శ్రీరామ జయరామ జయజయ రామ
రామజననం
మధుమాసే సితే పక్షే నవమ్యాం కర్కటే శుభే /
పునర్వస్వ్రక్షసహితే క్షసహితే ఉచ్ఛస్థే గ్రహపంచకే //
చైత్రమాసం శుక్లపక్షమున నవమినాడు, శుభకరమగు కర్కాటక లగ్నమందు, పునర్వసు నక్షత్రమున ఐదుగ్రహములు ఉచ్ఛస్థానములో యుండగా, సూర్యుడు మేషరాశి యందుండగా మధ్యానకాలమందు సనాతనుడగు పరమాత్మ కౌసల్యకు ఆవిర్భవించెను.
యస్మిన్ రమంతే మునయో విద్యయా జ్ఞానవిప్లవే /
తం గురు: ప్రాహ రామేతి రమణాద్రామ ఇత్యపి //
జ్ఞానం ద్వారా అజ్ఞానం నశించిపోయిన తరువాత, మునులు ఎవరియందు రమింతురో, ఎవరు తన సౌందర్యంచే భక్తజనుల చిత్తములను ఆనందింపచేయునో అతనికి "రాముడ"ని గురువు వశిష్టుడు పేరు పెట్టెను.
భరణాద్భరతో నామ లక్ష్మణం లక్షణాన్వితమ్ /
శత్రుఘ్నం శత్రుహన్తారమేవం గురురభాషత //
జగత్తును భరించినవాడు కావున రెండవ పుత్రునకు (కైకయి కి పుట్టినవానికి) "భరతుడ"ని, (ఇక సుమిత్రకు పుట్టిన ఇద్దరికి) సమస్త శుభలక్షణ సంపన్నుడు కావున మూడవ వానికి "లక్ష్మణుడ"ని, శత్రుహంత యగుటచే నాల్గవ వానికి "శత్రుఘ్ననుడ"ని వశిష్టులవారు పేర్లు పెట్టిరి.
రామకళ్యాణం
తమ రాజ్యమునకు వచ్చిన విశ్వామిత్రుడును, రామలక్ష్మణులును జనకుడు సాదరముగా స్వాగతించగా -
జనక మహారాజా! నీ వద్దనున్న శివధనస్సును చూడాలని రామలక్ష్మణులు అభిలాషించుచున్నారు. ఓసారి ఆ ధనస్సును వారికి చూపమని విశ్వామిత్రుడు అనగా -
అంతట జనక మహారాజు, జనక వంశీయులకు దేవతలు ప్రసాదించిన శివధనస్సును ఎవరు ఎక్కిపెడితే వారికే సీతనిచ్చి వివాహం చేయాలన్న తన సంకల్పమును విశ్వామిత్రునికి తెలిపి, ధనస్సును తీసుకురమ్మని ఆజ్ఞాపించగా -
జనకుని ఆదేశంతో బలిష్టులైన ఐదువేలమంది పురుషులు ధనుస్సు ఉంచిన పెట్టెను లాక్కొని రాగా -
గురువాజ్ఞ తీసుకొని, అందరూ ఉత్కంఠతో చూస్తుండగా, ధనస్సును శ్రీరాముడు ఎక్కుపెట్టగా, విరిగిపోయిన ధనస్సును సర్వులూ ఆశ్చర్యానందాలతో వీక్షించగా -
తన ప్రతిజ్ఞ మేరకు తన ప్రాణతుల్యమైన పుత్రికను రామునికి ఇచ్చి వివాహం చేస్తానని జనకుడు అనగా-
విశ్వామిత్రుని సూచన మేరకు జరిగిన విషయలాను వివరిస్తూ ఆహ్వానపత్రికను దూత ద్వారా అయోధ్యరాజు దశరధునికి పంపగా -
అంతట దశరధుడు ఎంతో సంతోషంతో వసిష్ఠ వామదేవాదులతో, మంత్రులతో, చతురంగబలసైన్యంతో విదేహరాజ్యమును చేరగా -
దశరధుని కులగురువు వశిష్టుడు దశరధుని వంశవృక్షమును జనకునికి తెలపగా, జనకుడు తన వంశవృక్షమును దశరధునికి వివరించగా -
అనంతరం సీతారాముల కళ్యాణమునకు అంతా సన్నద్ధమవ్వగా -
అంగరంగవైభవముగా సీతారాముల వివాహం జరిగినది.
సీతారాముల వివాహం జరిగినరోజు సౌమ్యనామ సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి, ఉత్తర ఫల్గుణి నక్షత్రం, కర్కాటక లగ్నం
అని పౌరాణిక కధనం. అయితే భగవంతుడు ఏ అవతారం ఏరోజున దాల్చితే, ఆ రోజునే ఆయన
కళ్యాణం జరిపించాలన్న ఆగమశాస్త్రవచనం ప్రకారం; శ్రీరామనవమి నాడే రాముని
జన్మదిన వేడుకలతోపాటు సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా, భక్తి పారవశ్యాలతో
జరుపుకుంటున్నాం.
ఈ నెల 19 న "శ్రీరామ నవమి".