tag:blogger.com,1999:blog-6017999693079769658.post7544531080408396886..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: ఓంకారంభారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-91873123154943216562013-11-17T14:14:34.477+05:302013-11-17T14:14:34.477+05:30నమస్కారమండి.
నిర్గుణ పరమాత్మ స్వరూపమును తెలుపునట్ట...నమస్కారమండి.
నిర్గుణ పరమాత్మ స్వరూపమును తెలుపునట్టి సమర్ధమైన శబ్దం ఒక్క 'ఓంకారం' మాత్రమే. ఓంకారం యొక్క సర్వవ్యాపకత్వమును, బ్రహ్మస్వరూపత్వమును మాండూక్యోపనిషత్తు నందు చక్కగా నిరూపించబడినది.
"ఓం" అని చెప్పబడు అక్షరమే ఇది (జడచేతనాత్మకమగు) అంతయూ. జరిగిపోయిన భూతకాలమును, జరుగుతూ వుండే వర్తమానకాలమును, జరగబోయే భవిష్యత్తు కాలమంతయును ఓంకారమే. ఇదియేకాక యింకను త్రికాలాతీతమై యేదైతే కలదో, అదికూడా ఓంకారమే. అంటే సర్వమున్ను ఓంకారమే.
ఓంకారం పరమాత్మకు శబ్దరూప ప్రతీక. అకార ఉకార మకారములుతో కూడిన ఓంకారం లో అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. అంటే ఈ మూడు అవస్థలూ ఓంకారమే. అలానే ఈ మూడింటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక కూడా ఈ ఓంకారమే.

ఈ ప్రపంచంలో ఎన్ని భాషలున్ననూ, ఆ భాషకి మూలకారణమైన మాటకి శబ్దమే ప్రధానం. మాటకి కారణమైన శబ్దం స్వరపేటికలోనుంచి బయటపడితే, ఆ స్వరపేటికకి స్పందన కలుగజేసే వాయువు నాభిస్థానం వద్ద నుండి బయలుదేరుతుంది.
అంటే మనలో అంతర్భాగముగా వున్న వాయువు క్రమపద్ధతిలో స్వరపేటికను స్పర్శించడం వలన, ఆ స్పర్శ తాకిడికి స్వరపేటికలో ప్రకంపన పుట్టి అది శబ్దరూపంలో వెలువడుతుంది.
శబ్దానికి కారణమైన వాయువు నాభి వద్ద నుండి అకార రూపంగా బయలుదేరి, స్వరపేటిక వద్దకు చేరినప్పుడు తీవ్రరూపం దాల్చి ఉకారముగా చైతన్యముతో స్వరపేటిక నుండి వెలువడి చివరికి మూయబడివున్న పెదాల ద్వారా మ్ అన్నట్లు మకార రూపమున బయటకు వెలువడుతుంది.
ఓం అని సాధారణంగా పలకడం కాకుండా, ఓ నాదంలా క్రమపద్ధతిలో ఉచ్చారణ చేయాలి. ఓంకారం ఓ నాదం... ఇది ప్రణవనాదం.
మరిన్ని వివరములకై 'పతంజలి యోగసూత్రములు' అను గ్రంధమును చూడండి.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-46372187167545284322013-11-04T19:02:58.636+05:302013-11-04T19:02:58.636+05:30శ్రీ భారతిగారికి, నమస్కారములు.
నా బ్లాగ్ 'మీ...శ్రీ భారతిగారికి, నమస్కారములు.

నా బ్లాగ్ 'మీతో చెప్పాలనుకున్నా' ను మీరు దర్శించుటద్వారా మీ పరిచయం కలిగింది. సంతోషం.
ఓంకారం పై చక్కని వివరాలను తెలియచేసారు. ధన్యవాదములు.

'ఓంకారం బ్రహ్మస్వరూపం. వాక్కుచేత చెప్పదగిన ఈ చేతనా చేతనాత్మక సమస్త ప్రపంచమును ఆ ఓంకారరూప పరమాత్మ యొక్క సమగ్ర స్వరూపమును విస్ఫష్టముగా తెలియుజేయుచున్నది' ..... - ఈ వివరణ చాలా క్లుప్తంగా వున్నది. మరికొంత వివరణ ఇవ్వగలరా?

అలాగే, 'ఓంకారం' చేసేటప్పుడు, 'ఆకారం' ముందుగా వినిపిస్తుందని పైన (శబ్దకారణమైన వాయువు నాభి వద్దనుండి అకార రూపముగా బయలుదేరి స్వరపేటికను స్పర్శించి,....) వ్రాసారు. నిజంగా అలా వినిపిస్తుందా? మీరు స్వయంగా పరీక్షించరా? ఇలా ప్రశ్నించటం కేవలం నిజాన్ని తెలుసుకోవటం కోసం మాత్రమే. అన్యధా భావించవద్దు.

మీ స్నేహశీలి,
మాధవరావు. madhavarao.pabbarajuhttps://www.blogger.com/profile/17404206429906313614noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-29319052134550913992011-10-13T18:24:52.899+05:302011-10-13T18:24:52.899+05:30ధన్యవాదములు రుక్మిణిజీ...ధన్యవాదములు రుక్మిణిజీ...భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-22342992174695295712011-10-13T11:30:51.976+05:302011-10-13T11:30:51.976+05:30బ్లాగు లోకం లోనికి స్వాగతం భారతి గారు.... ఓం ప్రధమ...బ్లాగు లోకం లోనికి స్వాగతం భారతి గారు.... ఓం ప్రధమంగా ఓంకారం తో మీ ఆధ్యాత్మిక రచనా ప్రయోగం.... చాలా బాగుందండి .... ముందు ముందు మీ రచనలను సర్వాంగ సుందరంగా మాకు అందిస్తారని ఆశిస్తూ............ I WISH YOU ALL THE BEST.....
--రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.com