tag:blogger.com,1999:blog-6017999693079769658.post8091063415038186762..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: జ్ఞాపకాల దొంతరలో మరో ముచ్చట - ఏడుచేపల కధ అంతరార్ధం.భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-78695803585951217592021-09-19T07:36:50.358+05:302021-09-19T07:36:50.358+05:30
*ఏడు చేపల కథకు మరో ఆధ్యాత్మిక వివరణ .*
*రాజుగారు ...
*ఏడు చేపల కథకు మరో ఆధ్యాత్మిక వివరణ .*
*రాజుగారు అంటే మనిషి.*
*ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు.*
*కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.*
*జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం.*
*రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే.*
* మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు (అనగా 6)*
*1.కామ 2.క్రోధ 3.లోభ 4.మోహ 5.మద 6.మాత్సర్యాలు.*
*వీటన్నిం టిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు. అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.*
*అందుకే కథలో ఆరు చేపలను ఎండగట్టినట్టు చెప్పారు.*
*రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.*
*ఏమిటా చేప. అది మనస్సు.*
*దీన్ని జయించడం చాలా కష్టం.*
*ఎంత ప్రయత్నించినా అది ఎండదు.*
*మనస్సు అంటే ఏమిటి*❓
*మనస్సు అంటే సంకల్ప వికల్పాలు*
*ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది.*
*మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు.*
*కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.*
*మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.*
*ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.*
*ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది❓గడ్డిమేటు.*
*గడ్డిమేటు అంటే ఏమిటి?*
*కుప్పపోసిన అజ్ఞానం.*
*గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా?*
*మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.*
*కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే‼️*
*ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు.*
*దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.*
*మరి అది పోవాలంటే ఏం చేయాలి❓*
*ఆవు వచ్చి మేయాలి.*
*ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి❓*
*ఆవు అంటే జ్ఞానం.*
*జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.*
*లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.*
*అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు (జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం)*
*జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.*
*ఈ గోవును ఎవ్వరు మేపాలి.*
*గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు❓*
*సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.*
*జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా‼️*
*అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు.*
*ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.*
*ఏమిరా నాయనా‼️ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.*
*ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు❓*
*అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.*
*ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.*
*ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.*
*ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు❓ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.*
*ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు❓*
*వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా❓దానికి ఇంకోపేరే సంసారం.*
*సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.*
*ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది. మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన తన విధిని నిలిపి వేసాడా.లేదు.అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.*
*చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం,*
*మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.*
*చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట❓*
*మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట.*
*ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.

సేకరణ : వాట్సాప్Ramaninoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-62773587650731630702013-02-16T21:15:02.962+05:302013-02-16T21:15:02.962+05:30ప్రసాద్ గారు!
చక్కటి వివరణ. ఆధ్యాత్మిక అవగాహనను పె...ప్రసాద్ గారు!
చక్కటి వివరణ. ఆధ్యాత్మిక అవగాహనను పెంపొందించే విశ్లేషణ. చాలా బాగుందండి.
చక్కటి వివరణ తెలిపినందుకు మీకు నా ధన్యవాదాలండి.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-42507972180703539832013-02-16T19:50:58.926+05:302013-02-16T19:50:58.926+05:30తేది గుర్తు లేదు కాని ఈమద్యనే భక్తి టివీ చానెల్ లో...తేది గుర్తు లేదు కాని ఈమద్యనే భక్తి టివీ చానెల్ లో మహా సహస్రావదహని శ్రీ గరికిపాటి నరసిం హా రావుగారు "మహాభారతానికి సామజిక వాఖ్య" అనే ధారావాహిక లో భగవద్గీతలోని ఒక "సంకల్పాన్ని జ్ఞానాగ్ని లో దహనం చెసినవాడు నిజమైన పండితుడనబడతాడు" అన్న శ్లోకార్ధానికి ఈ ఏడు చేపల కధని అన్వయిస్తూ ఈ విధంగా చెప్పారు. "ఏడు చేపలంటే మనలోని అరిష్డ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మధ, మోహ, మరియు మాత్సర్యములు. ఈ ఆరు ఆరు చేపలకు ప్రతీకలు మరి యెడవ చేప సంకల్పానికి ప్రతీక. నిజానికి ఈ అరిషడ్వర్గాలు విడి విడిగా కనిపిస్తున్న కామం పెరిగితే అది మోహం గాను, క్రోధం పెరిగితే మదమంగాను, లోభం పెరిగెతే మాత్సర్యం(అసూయా) గా మారుతాయి. అలాగే కామ, క్రోధ, లోభాలు అంకురించడానికి కారణం మనస్సులో కలిగే "సంకల్పం" ఇదే యెండని ఏడవ చేప, ఇది ఎందుకు ఎండలేదంటే అజ్ఞానమనే గడ్డి అడ్డుపడింది, గడ్డి ఎందుకడ్డుపడిందటే ఆవు(జ్ఞానం) మేయలేదు అంటే గొల్లవాడు(గురువు/శ్రీ కృష్ణుడు) మేపలేదు(బోధించలేదు) గొల్లవాడు ఎందుకు మేపలేదు అంటే అవ్వ (జగన్మాత) బువ్వ) పెట్టలేదు (ఆజ్ఞాపించలేదు). అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదంటే వేరొక చిన్నపిల్లవాడు యేడుస్తున్నడందట (ప్రాపంచిక విషాయలమేద విరక్తి కలిగి(పుట్టలో వేలుపెట్టి చీమ కుట్టటం వల్ల) జ్ఞానాన్నీపొంది ముక్తి కై తప్పస్సు చేస్తున్న వేరొక సాధకుడు ఆర్తితో(ఏఎడవటం) మోక్షం కోరుతున్నాడు. పిలుస్తున్నాడు. మనస్సులో సంకల్పాలు నశించనతకాలం ఎంత కోరిన ముక్తి లభించదు"
--- ఇది గరికిపాటి వారి అద్భుత వ్యఖ్యనానికి నా అక్షర రోపం దీనిలో ధొషాలెమైన వుంటే అది నా అవగాహనాలోపమే గాని వారికి చెందదవు.
kuchimanchiprasad.wordpress.com

ప్రసాద్https://www.blogger.com/profile/02279706054135497395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-1124145859555465492012-08-06T16:41:42.312+05:302012-08-06T16:41:42.312+05:30సత్యవాణిగారు! మీ విశ్లేషణ బాగుంది. మరోకోణంలో ఈ కధన...సత్యవాణిగారు! మీ విశ్లేషణ బాగుంది. మరోకోణంలో ఈ కధని తెలియజెప్పారు. మరింతగా ఆధ్యాత్మిక అవగాహనకు మీ వివరణ దోహదపడుతుంది. మీకు నా ధన్యవాదములు.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-86908299313771878872012-08-06T16:10:30.568+05:302012-08-06T16:10:30.568+05:30భారతిగారు,
ఈ కధను ఇలా కూడా విశ్లేషించవచ్చు అని అన్...భారతిగారు,
ఈ కధను ఇలా కూడా విశ్లేషించవచ్చు అని అన్పిస్తుంది.
నిరంతరం జలమునందు ఈదులాడే స్వభావముగల చేపలను, సంసార సాగరంలో ఈదులాడే మనిషిలో ఉన్న చంచలత్వమునకు (చంచలస్వభావమునకు) కారకములైన సప్తవ్యసనాలతో కూడా పోల్చవచ్చు.
సప్తవ్యసనాలు- వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రల్లదనంబు, దండ పరుషం, ధనం వృధాగా ఖర్చు చేయడం.
ఏడు చేపలను ఎండబెట్టారు. ఓ చేప ఎండలేదు. పై ఏడు వ్యసనాలలో ఒకటి ఎండలేదు. ఎండలేదంటే మీకు అర్ధం తెలుసుకాబట్టి వివరించడం లేదు.
ఇక ప్రశ్నల పరంపరలను పరిశీలిస్తే -
చేపా చేపా ఎందుకు ఎండలేదు అంటే గడ్డిమోపు అడ్డువచ్చింది. గడ్డిమోపు అంటే అజ్ఞానం. అంటే ఇక్కడ అజ్ఞానం అడ్డువచ్చింది. ఎందుకడ్డువచ్చిందంటే ఆవు మేయలేదు. జ్ఞానత్వానికి ప్రతీక ఆవు. జ్ఞానం అజ్ఞానంను మేయలేదు. ఎందుకు మేయలేదంటే పాలేరు విప్పలేదు. ఆవుకు రక్షకుడు పాలేరైతే, జ్ఞానంకు సంరక్షకుడు గురువు. గురువు విప్పలేదంటే గురువు అజ్ఞానాన్ని పోగెట్టే జ్ఞానాన్ని అందివ్వలేదు. గురువు ఎందుకందివ్వలేదంటే అవ్వ బువ్వ పెట్టలేదు. అవ్వ అంటే జగన్మాత. బువ్వ అంటే అనుజ్ఞ. జ్ఞానస్వరూపిణి అయిన ఆ జగన్మాత ఆజ్ఞ ఇవ్వలేదు, అందుకే నేను పెట్టలేదు అని గురువంటాడు. తల్లీ! జ్ఞానబోధను ప్రసాదించమని గురువుకు ఎందుకు ఆజ్ఞ ఇవ్వలేదంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు అందట. జ్ఞానాన్ని అందుకునే పరిపక్వత లేకపోవడంచే ఇంకా భోగభాగ్యాలు కావాలని పిల్లవాడు ఏడుస్తున్నాడు అని అర్ధం. పిల్లవాడిని ఎందుకేడుస్తున్నావంటే చీమ కుట్టింది అని అన్నాడట. చీమంటే కోరిక. కోరిక ఎందుకు కల్గిందంటే నా బంగారుపుట్టలో వేలెడితే కుట్టనా అందట. బంగారుపుట్ట అంటే ఆశలపుట్ట. వేలు అంటే మనస్సు. ఆశలన్నవి వాటంతట అవి దరిచేరవు. మనస్సు పెడితేనే పట్టుకుంటాయి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-15643234973904324462012-05-18T11:01:50.504+05:302012-05-18T11:01:50.504+05:30అవునా! ఇప్పుడైనా మీ కోణంలో మీ అద్భతమైన భావనలను అవి...అవునా! ఇప్పుడైనా మీ కోణంలో మీ అద్భతమైన భావనలను అవిష్కరించండి రసజ్ఞ. ఎదురుచూస్తుంటాను మీ పోస్ట్ కై.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-74888166605510244522012-05-18T06:04:17.296+05:302012-05-18T06:04:17.296+05:30హే! ఎన్నాల్టికి నాకు తెలిసిన కథ పెట్టారో! నిజానికి...హే! ఎన్నాల్టికి నాకు తెలిసిన కథ పెట్టారో! నిజానికి దీనికి సంబంధించి ఒక టపా వేద్దామని నేను అనుకుంటున్నా ఈ లోపు మీరు పెట్టేసారు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-37304892599990790232012-05-17T22:05:57.034+05:302012-05-17T22:05:57.034+05:30మీ ఈ స్పందన ఎంతో స్పూర్తినిస్తుంది. మీకు నా ధన్యవా...మీ ఈ స్పందన ఎంతో స్పూర్తినిస్తుంది. మీకు నా ధన్యవాదములు.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-58434956545153452462012-05-17T20:37:14.140+05:302012-05-17T20:37:14.140+05:30చక్కగా ఉన్నది. తెలిసింది మరో కోణంలో. మరిన్ని ఆశిస్...చక్కగా ఉన్నది. తెలిసింది మరో కోణంలో. మరిన్ని ఆశిస్తున్నాను. అభినందన.బివిడి ప్రసాదరావుhttps://www.blogger.com/profile/15471769281687097170noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-2337264767322360342012-05-17T18:08:48.372+05:302012-05-17T18:08:48.372+05:30రమేష్ గారు,
ధన్యవాదములు.రమేష్ గారు,
ధన్యవాదములు.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-53863839703336148652012-05-17T16:47:24.214+05:302012-05-17T16:47:24.214+05:30excellent narration.excellent narration.Alapati Ramesh Babuhttps://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com