సాయంత్రం ఏం జరిగిందో తెలుసా రుక్మిణిజీ.......ఓ చిన్న మేక నా చిన్నతోటలోనికి వచ్చి కొన్ని పూలమొక్కలును తినేసింది. ఆ క్షణమున కోపం దుఃఖం నాలో..... వెంటనే ఓ కర్ర తీసుకున్న..... దాని నడుము విరగ్గోట్టేయాలన్నంత కోపంతో చెయ్యి ఎత్తేసరికి, వెనగ్గా వచ్చిన మావారు నన్ను గట్టిగ పట్టుకొని నెమ్మదిగా ఈ పాట పాడేరు-రాజుగారి తోటలోన మేతకెలితిని,రాజుగారి తోటలోన ఏమి చూసితివి,రాణిగారి పూలచెట్లు సొగసు చూసితిని,పూలచెట్లు సొగసు చూసి ఊరికుంటివా?ఊరుకోక పూలచెట్లు మేసివేస్తిని,మేసివేస్తే తోటమాలి ఏమి చేసెను,తోటమాలి కొట్టవస్తే తుర్రుమంటిని...........ఈ పాట వింటున్న ఆ క్షణాలలో........ నేను పొందిన ఆ హాయి మరువలేను....నాలో కోపం,దుఃఖం పోయి....ఏదో ఆనందశక్తి నాలో పునరాగమనం చేస్తున్న ఆ క్షణములను ఆస్వాదించడం అద్భుతఅనుభూతి. కోపంపోవడం వేరు, నెమ్మదిగా తర్వాత రిలాక్స్ అవ్వడం వేరు. కానీ; కోపం పోయి ఆనందం అలా ప్రవేశిస్తున్న ఆ క్షణములను ఎంతో ఎరుకలో వుండి గమనించడం అనిర్వచనీయానుభూతి. అర్ధమౌతుందా రుక్మిణిజీ, నా ఈ అనుభూతి.... వ్యక్తం చేయలేకపోతున్నాను."ఏ క్షణముకు ఆ క్షణం ఆస్వాదించండి, వర్తమానములో వుండండి, ప్రతి క్షణము ఎరుకలో వుండి అనుభూతించండి" - అన్న మైత్రేయుని మాటలు ఎంత నిజమో కదా! ఏదో చైతన్యశక్తి నాలో ప్రవేశమౌతున్న ఆ అనుభూతి......... ఓహో, చెప్పలేకున్నాను. భావోద్వేగాలు వలన ఎంత శక్తి పోతుందో అర్ధమైంది. అలానే ఆనందం వలన ఎంత శక్తి ప్రవేశమౌతుందో అవగాహన అయింది నేస్తం.
ఇది నాకు అత్యంత ఆత్మీయస్నేహితురాలు రుక్మిణిజీ (భారతీయం బ్లాగర్ రుక్మిణీదేవి)తో పంచుకున్న ఒకప్పటి నా అనుభూతి.ఐతే చిన్నప్పుడు అందరం విని నేర్చుకున్న ఆ పాట వెనుక ఆధ్యాత్మిక అంతరార్ధం నా మిత్రురాలు ఎలా వివరించారంటే - తన మాటలలోనే యధాతధంగా -"ఈ పాటను ఆధ్యాత్మిక దృష్టితో చూడండీ..........చంచలమైన మనస్సు కల్గించే ఒక చిన్న కోరిక అంతరంగమనే అందమైన పూదోటలో ప్రవేశించినప్పుడు, ఆ పూదోట చిందర వందరగా మారే సమయంలో కోపం, దుఃఖం కల్గినప్పుడు....వెంటనే విజ్ఞత అనే కర్ర తీసుకుని ఆ కోరికను త్రుంచి వెయ్యాలన్న సందేశం ఈ పాటలో వున్నాయన్నది అవగాహనౌతుంది. ఎలాగంటే -బుజ్జిమేక బుజ్జిమేక యాడికెలితివి - మనసా మనసా యాడికెలితిని,
రాజుగారి తోటలోన మేతకెలితిని - సాధకుని అంతరంగంలోకి మేతకెలితిని,రాజుగారి తోటలోన ఏమి చూసితివి - సాధకుని అంతరంగంలోన ఏం చూసితివి,రాణిగారి పూలచెట్లు సొగసు చూసితిని - హృదయరాణి సాధనా సొగసు చూసితినిరాణిగారి పూలచెట్లు సొగసు చూసి ఊరుకుంటివా? - హృదయరాణి సాధనా సొగసు చూసి
ఊరుకుంటివా?
ఊరుకోక పూలచెట్లు మేసివేస్తిని - ఊరుకోక సాధనను మేసివేస్తిని(చెడ గొట్టితిని)
మేసివేస్తే తోటమాలి ఏమి చేసెను? - మేసివేస్తే బుద్ధి (తోటమాలి లాంటి విజ్ఞత) ఏమి చేసెను?
తోటమాలి కొట్టవస్తే తుర్రుమన్నాను - బుద్ధి(విజ్ఞత) తరిమేస్తే తుర్రుమన్నాను.
- ఆధ్యాత్మిక రంగం అందమైన ఆనందకర పూదోట. ఐతే పువ్వులతోపాటు ముల్లుకూడా వుంటాయి. ఆధ్యాత్మిక సాధనలో మనస్సు రూపేణ కొంత, ఇతరత్రా మరికొన్ని అవరోధాలు, వివిధవిధాలుగా ఆటంకాలు, కష్టాలు కలగడం సహజం. అప్పడే ఎంతో నేర్పుతో, ఓర్పుతో అవగాహనతో విజ్ఞతతో సాధనను పరమాత్మునివైపే సాగిస్తే........ అంతరంగపు పూదోటలో అనంతుడే ఉంటాడు".
ఆహా....... ఎంతటి పరమార్ధం........ మన బాల్యములో నేర్చుకున్న పాటల్లో......... ఇంతటి అంతరార్ధమా.......ఎంతటి అవగహన నా మిత్రురాలిది .......... జోహార్లు మిత్రమా........!
పంచుకున్నందుకు మీకూ జోహార్లు భారతిగారూ...
రిప్లయితొలగించండిమిమ్మల్ని'స్మరణ'స్వాగతిస్తుంది జ్యోతిర్మయిగారు.మీకు నా ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండిచాలా బాగుందండి. నాకెప్పుడు ఇలాంటి ఆలోచన కలుగలేదు. చక్కటి ఆలోచననిచ్చారు.
రిప్లయితొలగించండిఎంత మిస్ అయ్యేవాడిని !!
రిప్లయితొలగించండిశ్రీరామచంద్ర
శివ రాత్రి అందునా ౨.౩౦ శంభో శంకర
థాంక్స్ భారతి గారు బాగుంది బుజ్జి మేక .....
same ఇలా నే మొన్న ఏదో blog లో సినిమా డైలాగులను బ్లాగులకు అన్వయించారు
చూసాను ఓహ్ ఇలా కూడా చెయ్యొచ్చ అనిపించింది
కాసేపయ్యాక మా online సత్సంగం start అయ్యింది
ఆరోజు topic ఏమి ఇంకా సిద్ధం కాలేదు,
నాకు ఇందాక చదివిన ఆ సినిమా డయలాగే మనసుకు వచ్చింది
""కంటికి కనిపించని మూడు సింహాలు......bla bla bla ""
ఎదురుగుండా chat window లో గురువుగారు ఉన్నారు కదా
ఇక చుడండి, వెంటనే డైలాగు ఇలా మారింది
"కనిపించే దేహము, వినిపించే మనస్సు తెలియబడే ప్రాణము ఇవి అన్ని కలిపి జీవుడైతే వీటన్నింటిని చూస్తూ వేరుగా విలక్షణంగా ఉన్న ఆ సాక్షి ఏ కదా! నేను"
నిజంగా సత్య సాయీశుడు చెప్పినట్లు "దృష్టి మారితే సృష్టి మారుతుంది"
చాలా సంతోషం గా ఉండండి. చాల కలం నుంచి aggregators చూడటం లా మీ newsletter రావటం లేదు సో miss అయ్యేవాడిని
ఇందాక యశోదక్రిశ్నుల బ్లాగు లో మీ comment చూసి వచ్చాను.
చాల ఆనందంగా ఉన్నది....
సాయిరాం !!
"కనిపించే దేహము, వినిపించే మనస్సు తెలియబడే ప్రాణము ఇవి అన్ని కలిపి జీవుడైతే వీటన్నింటిని చూస్తూ వేరుగా విలక్షణంగా ఉన్న ఆ సాక్షియే కదా - నేను" ఎంతటి భావపరిపక్వత! సరైన సమయంలో సరిగ్గా ఇటువంటి భావం స్ఫురించడం అద్భుతం. మీలో ఆధ్యాత్మిక అవగాహనకు, అభిలాషకు,ఆలోచనలకు దర్పణం మీ ఈ భావస్పందన.
రిప్లయితొలగించండినిర్మలంగా ఆలోచించడం, నిశ్చలంగా పనిచేయడం, సహృదయతతో మాట్లాడడం సాధకుని లక్షణం. మీలో ఈ లక్షణం పరిపూర్ణంగా ఉందండి.
చక్కటి విషయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండి.
Nice analogy! Vivarinchina vidhanam bavundandi!! Manam choose konam enta mukhyamo kooda artham avutundi...
రిప్లయితొలగించండితెలుగు అభిమానిగారు!
రిప్లయితొలగించండిమీరు చెప్పింది సత్యం - ఏదైనా మనం చూసే కోణం బట్టే వుంటుంది. పెద్దలు ఏది చెప్పిన, ఏది నేర్పిన అందులో ఏదో పరమార్ధం వుంటుందన్నది నా అనుభవాల ద్వారా ఇప్పుడిప్పుడే తెలుసుకోగల్గుతున్నాను. నా బ్లాగ్ చూస్తున్నందుకు ధన్యవాదాలండి.
భారతి గారు, మీకు మీ కుటుంబానికి శ్రీ రామనవమి సుభాఖంక్షలు!!
రిప్లయితొలగించండిశ్రీ రామనవమితో మొదలుపెట్టి, మన పండుగలగూర్చి వాటి విశిష్ట గురుంచి మీరు మీ బ్లాగ్లో వివరిస్తే బావుంటుంది.
అట్లా ఆ బ్లాగ్ సీరీస్ ఒక అద్భుతమైన జ్ఞాన మాల అవుతుందని మరియు ఆ మాల డిజిటల్ యోగంలో అడుగుపెట్టి మరెన్నో తరాలకు ఒక జ్యోతిగా వేలుగుండుతందని నా ఆశ!!
అందుకు మీకు ముందుగానే ధన్యవాదాలు!!!
తెలుగు అభిమానిగారు,
రిప్లయితొలగించండిమీకూ, మీకుటుంబ సభ్యులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. "రామనామం - పరమపావనం" అని గతంలో నా బ్లాగ్లో కొంతవరకు వివరించాను. చూసుంటారనే అనుకుంటున్నాను. మీ ప్రోత్సాహం మరువలేనిది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు.
http://youtu.be/et6PqteMa-Y
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిమీ ఈ పోస్ట్ చదివాక నాకూ చిన్నప్పుడు నేర్చుకున్న
ఏదైన పాటకు ఆధ్యాత్మిక అర్ధం చెప్పాలనిపించి బుర్రుపిట్ట పాటకు ఇలా విశ్లేషణ చేసాను. తప్పో ఒప్పో తెలియదు గానీ చిరు సరదాతో చేసిన ప్రయోగం.
బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది.
బుర్రుపిట్ట అంటే అంతరింద్రియం/అంతఃకరణ అని అనుకుంటున్నాను. ఇది తుర్రుమన్నది. ఎక్కడికి?
ఈ ప్రశ్నకు జవాబు ముందు ముందు అర్ధమౌతుంది.
పడమటింటి కాపురం చేయనన్నది. సూర్యోదయమైన తూర్పు దిశ, దైవోపాసనకు జ్ఞానవికాసమునకు ప్రేరితమైతే, దానికి వ్యతిరేక దిశ పడమర. పాశమును ఆయుధంగా ధరించిన వరుణుడు దీనికి అధిపతి. ఈ దిశలో కాపురం అంటే అనేక బంధపాశాలతో బంధింపబడడమే. ఆ బంధనాల నడుమ జ్ఞానోదయం కాదు. చిరు అజాగురత వున్నా జ్ఞానాస్తమయమే. అందుకే పడమటింటి కాపురం వద్దంది.
అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది.
మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది.
దేనితో బంధనాలు పెట్టుకోకుండా సాగిపోతున్న ఆధ్యాత్మిక పయనంలో సాధనాఫలితంగా దేవాతానుగ్రములతో కొత్త కొత్త సిద్ధులకు, మానసికోల్లాసం నొసగే గుభాలింపులకు చలించక...దేనినీ అంటాలేదు ముట్టాలేదు.
మొగునిచే మొట్టికాయలు తింటానన్నది.
అచలములోని చలనమే ప్రకృతి (స్త్రీ - శక్తి స్వరూపం). చలనములోని నిశ్చలమే ఆత్మ (పురుషుడు - పరమాత్మ స్వరూపం).
మీరో మాట వినుంటారు...పుణ్యం కొలది పురుషుడు అని. ఇక్కడ పుణ్యం అంటే చేసే మంచిపనుల మూట కాదు. పుణ్యం అంటే ఆధ్యాత్మికంగా ప్రాప్తింపజేసుకున్న ఆత్మజ్ఞానం. పురుషుడు అంటే పరమాత్మ.
సకల ప్రకృతి స్త్రీ కాగా, పురుషుడు పరమాత్మ. ఈ సూక్ష్మం గ్రహించిన అంతఃకరణం అనబడే బుర్రుపిట్ట తుర్రుమన్నది, ఆ ఆత్మ చెంతకే. జగత్ కు పతి అయిన పరమాత్మ సన్నిధికే.
ఎలా ఉందండీ నా వివరణ?
చెప్పడం మరిచాను...మొగునిచే మొట్టికాయలు అంటే ఆధ్యాత్మిక సాధకునికి ఎన్నెన్నో పరీక్షలు పరమేశ్వరునిచే. అవన్నీ తింటానన్నది. ఆన్నీ తట్టుకుంటేనే కదండీ...గమ్యం చేయగలం.
రిప్లయితొలగించండి