మౌనమంటే
మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను
వ్యక్తపరచడం కాదు, నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి
మనస్సుతో భాషించడం కాదు, మౌనమంటే అంతరింద్రియ (మనో, బుద్ధి, చిత్త, అహములతో
కూడిన అంతఃకరణమునే అంతరింద్రియమంటారు) విజ్రుంభణను ఆపడం. మౌనమంటే ఆలోచనలు,
ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం
స్పష్టంగా చూసుకోవడం. ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం.
మౌనమంటే -
పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదుశాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి. అహంవృత్తి ఏమాత్రం ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు. ఈ మౌనం మూడు రకాలు.
2. అక్షమౌనం :-
కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక యేకాగ్రనిష్టలో నుండుట. ఈ మౌనం వలన
ఇంద్రియాలు నియంత్రణ ద్వారా ధ్యానవైరాగ్యాలు బాగా అలవడుతాయి.
దీనిని మానసిక మౌనమంటారు. మౌనధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని
దైవచింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా
పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠమౌనమంటారు. ఈ మౌనం వలనే
ఆత్మసాక్షాత్కారం అవుతుంది.
దీనినే 40 సంవత్సరములు మౌనదీక్షలో గడిపిన శ్రీ మెహర్ బాబా గారు ఇలా తెలిపారు - 'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది. మనస్సు మౌనంగా వున్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'.
మౌనం -
మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధసంభాషణ అని శ్రీ రమణులు అంటారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్ధవంతమైన భాష. అనేక సంవత్సరములు చర్చలద్వారా, చర్యలద్వారా దేనిని తెలుసుకోలేరో, దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు. మాటలకు ఆటుపోట్లు వుంటాయి, కానీ; మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞానస్రవంతి.
'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం' వాక్కునకు మనస్సునకు అందని
పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది. భగవంతుడు ఒక వ్యక్తి కాదు,
రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే
స్మృశించి గ్రహించగలం. మౌనం మాత్రమే శబ్ధప్రపంచం కంటే అందమైనది,
అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది. మౌనమే సత్యం, శివం, సుందరం. ఇదే
అఖండానందం, ఇదే ఆత్మసాక్షాత్కారం, ఇదే మోక్షం.
చాన్నాళ్లకు ... మంచి అంశము ...
రిప్లయితొలగించండిచాన్నాళ్ళకు ... మీ ఈ స్పందన ఆనందాన్నిచ్చింది.
తొలగించండిmanassu chitthamu okati kaadaa? rendoo veru veraa?
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారు,
తొలగించండిమనస్సు, చిత్తము ఒకటి కాదండి. నాకు తెలిసినంతలో ఈ అంతరింద్రియం గురించి తదుపరి పోస్ట్ లో తెలియజేస్తానండి.
చాన్నాళ్ళకు
రిప్లయితొలగించండిమౌనము వీడి
''మౌన బోధ'' (ద్వితీయ తత్పురుష) చేసినందులకు
ధన్యోస్మి
?!
' ?! ' శివగారు, బాగున్నారా?
తొలగించండిమీ స్పందనకు ధన్యవాదములండి.
chaaalaa chaalaa baavundi mi tapaa
రిప్లయితొలగించండిమంజు గారు!
తొలగించండిఈ టపా మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదాలండి.
deeni gurinchi maatlaadadam kante mounamgaa undatame utaamam. totalgaapostadubutamgaa undi
రిప్లయితొలగించండిhttp://www.googlefacebook.info/
అజయ్ కుమార్ గారు,
రిప్లయితొలగించండిమీరు చెప్పింది నిజం. మీ స్పందనకు ధన్యవాదములు.
శ్రీ భారతిగారికి, నమస్కారములు.
రిప్లయితొలగించండిచాలా,చాలా చక్కగా, ఉపయోగకరంగా వుందీ టపా.
మీ స్నేహశీలి,
మాధవరావు.
శ్రీ మాధవరావు గారికి, నమస్కారమండి.
తొలగించండిమీ ఈ స్పందనకు ధన్యవాదములండి.
Having read this I thought it was very informative. I appreciate you finding the time and
రిప్లయితొలగించండిenergy to put this information together. I once again find myself spending
way too much time both reading and commenting.
But so what, it was still worthwhile!
My blog post ... Las Vegas Kenmore Parts
ప్రపంచ సంబంధములయందు చలించక, నిశ్చలంగా, సకల సంకల్పములు నశింపజేసుకొని దేహాత్మభావనను వీడి, బ్రహ్మస్వరూపుడై వున్నవానికి లభించెడి అఖండానందదశే 'మౌనం'.
రిప్లయితొలగించండి*"మౌనం" కాంతి వంతమైన శాంతి.
రిప్లయితొలగించండికల్పనలకు అందనిది .
అనేక వేల కల్పాలకు హేతువది .
*ఇతరంలేదనే అంగీకారం ఏకాంతం .
తన స్పృహ లేనిది మౌనం .
1. *మౌనము* జీవితమునకు పరమ మిత్రుడు.
రిప్లయితొలగించండి2. *మౌనము* ద్వారా ఆత్మ చింతన యొక్క బలము లభిస్తుంది.
3. *మౌనము* ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కలుగుతుంది.
4. *మౌనము* ఆధ్యాత్మిక జీవితము కొరకు బ్రహ్మాస్త్రము.
5. *మౌనము* అనగా వ్యర్థమైన మరియు సాధారణమైన సంకల్పాల నుండి ముక్తి అవ్వడం.
6. *మౌనము* మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచుతుంది.
7. *మౌనము* అశరీరి స్థితిని తయారు చేసుకునేందుకు సహజ సాధనం.
8. *మౌనము* అనగా శ్రేష్టమైన క్వాలిటీ కలిగిన సంకల్పాలు చేయాలి.
9. *మౌనము* - వ్యర్థం నుండి ముక్తి చేసే అద్భుత ఇంజక్షన్.
10. *మౌనము* - ఆలోచనా విధానాన్ని శ్రేష్టంగా చేసుకునేందుకు ఒక టానిక్.
11. *మౌనము* - కలహః, క్లేశాలను సమాప్తం చేసే ఒక మంచి ఔషధం.
12. *మౌనము* - మనస్సు యొక్క స్థితిని ఏకరసంగా తయారుచేసే మందు.
13. *మౌనము* - మౌనం యొక్క సాధన ద్వారా మనస్సు యొక్క శక్తి పెరుగుతుంది.
14. *మౌనము* - స్వధర్మంలో స్థితులయ్యేందుకు ఒక శ్రేష్ఠ విధి.
15. *మౌనము* - పరమాత్మ ప్రేమలో లవలీనమయ్యేందుకు సహజ ఉపాయం.
16. *మౌనము* - విస్తారాన్ని సారములోనికి తీసుకువచ్చేది.
17. *మౌనము* - దేహము మరియు దేహపు ప్రపంచము నుండి అతీతంగా అయ్యేందుకు సహజ ఉపాయం.
18. *మౌనము*- పరమాత్మ సుఖం యొక్క అనుభూతిని చేసుకునేందుకు సహజ సాధనము
19. *మౌనము* - మన్మనాభవ మరియు మధ్యాజీభవగా అయ్యేందుకు సంజీవని మౌలిక.
20. *మౌనము* - పరమాత్మ శక్తులను అనుభూతి చేసుకొనేందుకు శ్రేష్ట మార్గము.