అమ్మా!
నీ తండ్రి జనకుడు బ్రహ్మజ్ఞాని. నీవేవరో తెలుసు...అందుకే నీవు వీర్యశుల్క వంటూ, ఎవరూ ముట్టుకోవడానికి, పట్టుకోవడానికి వీలు కానటువంటి శివధనస్సుని ఎక్కుపెట్టిన వారితోనే నీ వివాహమని ప్రకటించడం...
రామలక్ష్మణులు విశ్వామిత్రుడు తలపెట్టిన యాగ సంరక్షణ చేయడం, విశ్వామిత్రుడు రామునికి దివ్యాస్త్రాలు అనుగ్రహించడం, సిద్దాశ్రమంలో కొన్ని రోజులు గడపడం అయ్యాక, ఒకరోజు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో, మిథిలా నగరంలో జనక మహారాజు గొప్పయాగం చేస్తున్నాడట, అందరూ వెళ్తున్నారు, మనమూ వెళ్దాం, పైగా ఒకప్పుడు మిధిలాధిపతియైన దేవరాతుడు దేవతల నుండి ఒక ధనస్సును పొందాడు. ధృఢమైన ఆ ధనస్సును వంచి ఎవరూ నారిని సంధించలేరట... దానిని చూద్దాం పదండి... అని బయల్దేరదీసి, దారి పొడుగునా కుశనాభుని నూరుగురు కుమార్తెలు గూనివారయ్యే ఇతివృత్తం, సగరుని వృత్తాంతం, అహల్య వృత్తాంతం ... ఇలా ఒకోచోట ఒకో ఇతివృత్తం చెప్పడం ద్వారా గృహస్థాశ్రమ ధర్మం, వివాహం ఎవరు చేయాలి, ఎలా చేయాలి... వివాహం అయ్యాక ఎట్లా ఉండాలి... అనేక అనేక సూక్ష్మ ధర్మాలను చెప్పకనే చెప్పి, భవిష్యత్తులో రామచంద్రుని యందు ప్రకాశించే సద్గుణాలన్నిటికీ సానబెట్టి, ఓ వజ్రంలా చేసి, మిధిలకు యేతించి, నీ తండ్రికి, వీరు దశరథ మహారాజు పుత్రులని పరిచయం చేసి, శివధనుస్సును చూపమని, రాముణ్ణి చూడమనడం... అనాయాసంగా రాముడు ఎక్కుపెట్టగా ధనుర్భంగం కావడం... అప్పుడు కదమ్మా, నీ వివాహ సన్నాహాలు ప్రారంభమైనవి.
తల్లీ!
తాటకవధ... అహల్యశాపవిమోచనం... శివ ధనుర్భంగం చేసినప్పుడే రాముడు అవతార పురుషుడని గ్రహించి, నీ పాణిగ్రహణ సమయంలో జనకులవారు నిన్ను ఎంతో గొప్పగా పరిచయం చేస్తూ -
ఈమె సీత. నా కూతురు. ఇకనుంచి నీకు ధర్మ మార్గంలో తోడుగా చరిస్తుంది. ఈమె పాణిని గ్రహించు, నీకు భద్రం కలుగుతుంది. ఈమె పతివ్రత, మహా భాగ్యశాలి, నీడవలే నిన్ను అనుసరిస్తుంది...అని అన్నారట కదమ్మా...
బ్రహ్మజ్ఞాని అయిన నీ తండ్రి భవిష్యత్ దర్శించారా ఏమిటి తల్లి?
ఇయం సీతా... ఈమె నాగటి చాలున ఉద్భవించిన సీత. అయోనిజ. నాగటి చాలు రైతు కృషి ఫలింపజేస్తుంది. అలానే నీ కృషిని ఫలింపజేసే ఈమె సీత.
మమసుత... నా కుమార్తె. నేను కనలేదని నాకూతురు కాదనుకుంటావేమో... ఆకాశవాణి చెప్పింది ఈమె నాకుమార్తె అని!
సహధర్మ చరితవ... నీకు దర్మమార్గంలో తోడుగా చరిస్తుంది... అంటే ధర్మం లేకపోతే ఈమె వుండదు, నీతో చరించదు, నీవు లేకుండా ఉండదు, ఈమెకు భర్తవయినందుకు ఇక నీవు ధర్మ మార్గంలో చరించి తీరాల్సిందే ... ఏం ముడి పెట్టారమ్మా... ధర్మ మార్గంలోనే చరించాలని శాసనమే చేసేశారు.
భద్రం తే... నీకు మంగళము అగుగాక. నిన్ను పెళ్లాడాక భద్రం (శుభమ్) కాకుండా ఎలా వుంటుంది?
ప్రతీచ్ఛచైనాం...ఈమెను పరిగ్రహింపుము.
(మా అమ్మాయిని ఇస్తున్నాను, పుచ్చుకో...అని కాకుండా, ఈమె సాక్షాత్తు నీ దేవేరి, నీ అన్ని అవతారాల్లో ఈమెనే నీ సహదర్మచారిణి. ఈమెను గుర్తించి స్వీకరించు అన్న భావం ప్రస్పుటింపజేసిన నీ తండ్రి ఎంతటి జ్ఞానియో...)
పాణిం గృహ్ణీష్వ పాణినా...నీ చేతిలో ఆమె చేతిని తీసుకొనుము. ఇక ఈమె రక్షణా బాధ్యత నీదే సుమా అన్నట్లు చెప్పారు కదమ్మా.
పతివ్రతా... ఏ స్థితిలోనైన భర్తనే అనువర్తించే ఇల్లాలవుతుందని,
చాయేవానుగత సదా... ఎప్పుడూ నిన్ను నీడలా అనుసరిస్తుందని ... (నీవు తండ్రి మాట ప్రకారం ఈ ప్రాయం లోనే విశ్వామిత్రుని వెంట వచ్చిన పితృవాక్య పరిపాలకుడువి అయినట్లే, ఈమె కూడా నా మాటకు విలువనిస్తూ నీ వెన్నంటే ఉంటుందని)...ఏం చెప్పారమ్మా.
రాముడు అరణ్యవాసంకు సిద్ధమైనప్పుడు, ఈ మాటలనే చెప్పి, ఒకింత పరుషంగా మాట్లాడి, రామయ్యను ఒప్పించావు కదా. ఈ ధర్మాచరణ వైశిష్టమే ఉన్నత పథంలో నిలుపుతుందనడానికి తార్కణమై నిలిచావు. ఎంత చక్కటి చరితం తల్లి నీది...
అమ్మా!
అమ్మా! ఎప్పుడో జానకితో జనాంతికం చదివాను. ఇప్పుడు మరలా సీతమ్మతో ముచ్చట్లు చదివాను. బాగా వ్రాసారమ్మా. పూజగదిలో మూలనున్న వాల్మీకి రామాయణం మరలా తీసి చదివించేటట్లు ప్రేరేపించారు.ధన్యోస్మి. మీకు శుభమగు గాక!
రిప్లయితొలగించండిధన్యవాదాలు సర్...🙏
తొలగించండిభారతీ గారు, మా రాజమహేంద్రవరంలో రేపు సాయంత్రం జరిగే మొల్లమాంబ గారి 584వ జయంతి మహోత్సవంకు రావల్సిందిగా రాయపూడి శ్రీనివాస్ గారి నుండి ఆహ్వానం అందింది. వయోభారంతో వెళ్ళాలా, వద్దా అన్న మీమాంస. మీ ఈ ముచ్చట్లతో మొల్ల పద్య రుచి గుర్తుకు వచ్చి వెళ్ళాలనే నిర్ణయించుకున్నాను. బహు ముచ్చటైన భాషణం.
రిప్లయితొలగించండితప్పకుండా మొల్లమాంబ గారి జయంతి మహోత్సవం కు వెళ్ళిరండి.
తొలగించండిధన్యవాదాలండి...
సీత సత్వ రజ తమో గుణాత్మకమైంది. సకార, ఇకార, తకారాల సంగమం. సకారం ఆత్మ తత్త్వానికి సంకేతం. ఇకారం ఇచ్ఛా శక్తికి సంకేతం. తకారం తారా శక్తి, తరింప జేసేది. అంటే ఆత్మదర్శనం కలిగించి పరమాత్మతో అనుసంధానం చేసి జీవుడిని తరింప జేసే శక్తి సీత.
రిప్లయితొలగించండిచాల బాగుంది. మంచిగా వ్రాసారు.
మనసార ధన్యవాదాలు రమణి గారు.
తొలగించండిఅత్యద్భుతం.మనస్సుకు హత్తుకునేలా చెప్పారు.
రిప్లయితొలగించండివసుంధర గారు,
తొలగించండిమీ స్పందనకు ధన్యవాదాలు...
బాగుంది Bharatigaru.. maaku idi oka margadharshakam.. hrudayapoorvaka conversation..amma tho ముచ్చట్లు baagunnaayi .. మళ్లీ గుర్తొచ్చింది- - నీవు నా ammavu. అందుకే naaku ఈ ప్రశాంతత.
రిప్లయితొలగించండిబాగుంది భారతిగారు.. అమ్మ తో ముచ్చట్లు..ముచ్చట గా ఉంది. ఒక్కసారి కళ్ళు మూసి ఆ దృశ్యం చూసినట్లు..
రిప్లయితొలగించండిహృదయపూర్వక ధన్యవాదాలు రుక్మిణి జీ.
తొలగించండిమీరు మాతోనే అనుకున్నా... అమ్మగారితో కూడా అలానే మాట్లాడం బాగా నచ్చింది.
రిప్లయితొలగించండిఒక సందేహం భారతి గారు, భగవంతుడు మనల్ని పట్టుకోవాలా? మనం భగవంతున్ని పట్టుకోవాలా???
మీకు నచ్చినందుకు సంతోషం పద్మ గారు.
రిప్లయితొలగించండిమీ సందేహంకు సమాధానం ఇవ్వడానికి నా భావనలో కొంచెం స్పష్టత రావాలి. అందుకు సమయం కావాలి.
మీకు కావల్సినంత టైం తీసుకొండి. కానీ నా సందేహం తీర్చండి.మీకు నాగూర్చి తెలుసుకదా...😊 కొంచెం వివరించి సులువుగా అర్ధమయ్యేటట్లు చెప్పండి. Depth వద్దు, అర్ధం చేసుకొలేను.
తొలగించండిటపా అద్భుతం అంటే అతిశయోక్తికాదు.అమ్మ ఏరూపంలో ఉన్నా అమ్మే!అమ్మతొనే ఆయ్య! అందుకేసీతారాములు లక్ష్మీనారాయణులు, శచీపురందరులు,గౌరీశంకరులు, ఇది అనంతం. అమ్మ ఇఛ్ఛా శక్తి,జ్ఞానశక్తి, క్రియా శక్తి స్వరూపిణి. జడశక్తి,క్రియాశక్తి అమ్మే!ధరాధరసుతా, ధరసుతా అమ్మే, ప్రకృతి అమ్మ, ఇది అనంతం.ఇక ఇయంసీతా మమసుతా విశ్లేషణ బాగుంది.
రిప్లయితొలగించండిపద్మగారడిగిన ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూస్తున్నా!
మీకు హృదయపూర్వక నమస్సులు.
తొలగించండిమీ వ్యాఖ్యకు ధన్యవాదాలండీ...
> పద్మగారడిగిన ప్రశ్నకు సమాధానం కోసం ఎదురుచూస్తున్నా.
పద్మగారు నాకు బాగా పరిచయమున్నామే.ఇప్పుడిప్పుడే అన్ని తెలుసుకోవాలన్న ప్రయత్నంలో ఏదేదో అడుగుతుంటారు. మీరు అన్నీ తెలిసినవారు...ఇలాంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పకుండా ఎదురుచూడడం ఏమిటి బాబాయ్ గారు?
తొలగించండితల్లీ భారతి
వందనం
నేను ఆధ్యాత్మిక విద్యార్థినేనండి.
అమ్మ చెప్పేదానిలో సొగసుంటుంది. అదివినాలని కోరిక, కుతూహలం ఆపుకోలేక ఎదురుచూస్తున్నానని చెప్పేసేనండి.
ఆధ్యాత్మిక భావనతో యెవరు యెవరితో మాటాడినా మంచి విషయాలే దొర్లుతాయి. మీరు ఇంతగా “నను బ్రోవమని చెప్పవే” అని అడగడం మాత్రం రామచంద్రుడికి తెలియదంటారా.. ? చదవటానికి సమయం పట్టింది. కానీ తృప్తిగా వుంది. వీడియోలు వినలేదు. ఇంకో రెండు టపాలు చదివాను. మీతో చాలా పంచుకోవాలి. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి