22, ఆగస్టు 2012, బుధవారం

భక్తుడు - బద్ధుడు

పరమహంస :-
                    అనగా హంసకు పరమై ఉండువారని అర్ధం. 
                    హంస అనగా జీవుడు, పరమమనగా పరబ్రహ్మం (పరమాత్మ). జీవునికి పరమగు శివత్వమును పొందినవారు పరమహంస.
                    హంస అనగా ఓ పక్షి పేరు. ఇది క్షీరనీరములు (పాలు,నీరు) కలిసియుండిన నీరమును (నీటిని) వదిలి క్షీరమును మాత్రమే పానముచేయును. అలాగునే ప్రకృతి, పురుషులు కలిసియుండు ఈ సృష్టి నుండి లేక ఈ దేహమునుండి ఆత్మానాత్మ విచారణచే ప్రకృతిని త్యజించి పురుషున్ని, అనగా ఆత్మను గ్రహించినవారిని పరమహంస అందురు.

అటువంటి పరమహంస అయిన శ్రీరామకృష్ణులవారిని ఓ వ్యక్తి ఇలా ప్రశ్నించాడు -
'ఈశ్వరుడు అన్నిటిలోనూ సమానముగా ఉండగా ఒకరు యోగ్యుడగుటకు, మరియొకరు యోగ్యుడు కాకపోవుటకు కారణమేమీ?'
అప్పుడు శ్రీరామకృష్ణపరమహంస వారు ఇలా బదులిచ్చారు -
"ఈశ్వరుడు అందరిలోనూ సమముగానే ఉన్నాడుగాని, ఈశ్వరునియందు అందరును సమానముగా ఉండుటలేదు. అందుచేతనే ఒకరు భక్తుడుగాను, మరియొకరు బద్ధుడుగాను ఉండుట జరుగుచున్నది.


7 కామెంట్‌లు:

  1. భారతి గారూ, మంచి సందేశం.
    పరమహంసను గుర్తుచేశారు,
    భక్తునికి , బద్దునికి బేదం తెలిపారు.

    రిప్లయితొలగించండి
  2. ప|| దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో | ఉబ్బు నీటిపై నొక హంస ||

    చ|| అనువున గమల విహారమె నెలవై | ఒనరియున్న దిదె ఒక హంస |
    మనియెడి జీవుల మానస సరసుల | వునికి నున్న దిదె ఒక హంస ||

    చ|| పాలు నీరు నేర్పరచి పాలలో | నోలలాడె నిదె యొక హంస |
    పాలుపడిన యీ పరమహంసముల | ఓలి నున్న దిదె యొక హంస ||

    చ|| తడవి రోమరంధ్రంబుల గ్రుడ్ల | నుడుగక పొదిగీ నొక హంస |
    కడు వేడుక వేంకటగిరి మీదట | నొడలు పెంచెనిదె యొక హంస ||

    http://youtu.be/aFgI_x1olGc

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'ఎందుకో ? ఏమో !' బ్లాగర్ శివగారు!
      ధన్యవాదములండి.
      ధన్యురాలిని, చక్కటి అన్నమాచార్యుని సంకీర్తన విన్పించారు.

      తొలగించండి
  3. భారతి గారూ!
    మీరు చెప్పిన క్షీర నీర న్యాయం బాగుంది కానీ...:-)
    ప్రకృతి నుంచి పురుషుని గ్రహించడం???
    ప్రకృతి లో భాగమే అన్నీ...
    ప్రకృతి నుంచి దేనినీ వేరు చేయలేము...
    ప్రకృతి దేహం...పురుషుడు ఆత్మ అనడం భావ్యం కాదేమో...
    ఇంకా...
    పరమ అంటే ఉత్తమం...
    'పరమహంస' అంటే హంసలలో ఉత్తమమైన హంస...
    క్షీరాన్ని, నీటిని హంస ఎలా వేరు చేస్తుందో...
    పరమహంస మంచి చెడులను అలా వేరు చేయగలదు...
    అని నా భావం...
    ఇకపోతే...పరమహంస గారి సమాధానం అద్భుతమైనది...
    మీ వలన భక్తునికి బద్ధునికి తేడా తెలుసుకున్నాము...
    అభినందనలు...
    @శ్రీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ గారు!
      చాలారోజుల క్రితం 'పరమహంస' అని ఎవరిని అందురో ఓ పుస్తకంలో చదివిన నాకు మొదట మీలాగే సందేహం కల్గింది. కానీ, ఓ నాలుగయిదు సార్లు చదివిన తర్వాత అర్ధమైంది.
      ప్రకృతి, పురుషులు కలిసియుండు ఈ సృష్టినుండి లేక దేహమునుండి...........
      పై వాక్యాన్ని మరోసారి గమనించండి -
      ప్రకృతిని మాత్రమే దేహమనలేదు, ప్రకృతి పురుషులను కలిపే సృష్టి లేదా దేహమని అన్నారు.
      ఇక్కడ ప్రకృతి అంటే అనాత్మ (మాయ), పురుషుడు అంటే ఆత్మ.
      ఈ దేహములోనున్న ప్రకృతి అనే మాయని (అనాత్మభావనని)విడిచి పురుషుడనే ఆత్మని గ్రహించినవారినే పరమహంస అని అందురని నాకు అర్ధమయిందండి.
      ఏది సత్యమో, ఏది అసత్యమో; ఏది మంచో, ఏది చెడో; ఏది శాశ్వతమో, ఏది ఆశశ్వతమో తెలుసుకొని మాయలాంటి దేహత్మభావన నుండి విడివడి ఆత్మభావనలో ఉండి ఆత్మను గ్రహించినవారే పరమహంసలు.
      ఇక -
      పరమహంస అంటే అని మీరు తెలిపిన అర్ధం చాలా బాగుంది. మీ ఈ స్పందనకు ధన్యవాదాలండి.

      తొలగించండి
    2. మీ వివరణ అర్థవంతంగా ఉంది...
      ధన్యవాదాలు...
      @శ్రీ

      తొలగించండి