అష్టదళ పుష్పముల పాట
అందమైనపూలు కోయుదమా
ఓ రమణులార ।ఆత్మారాముని
పూజ చేయుదమా।
అందమైన పూలు కోసి ఆత్మారాముని పూజచేసి।
అందము మీరంగ బ్రహ్మానంద
పదవి పొందరమ్మా।
చెట్టులేని పూలు చూడరే
అవి చేతులతో ముట్టుకొన కుండా కోయరే ।
గట్టిపూర్వ సుకృతమనే చెట్టు మీలో కలిగిఉంటే ।
పట్టుబట్టి మనసుతోనే ముట్టి
పూలు కోయరమ్మా ।।అం।।
అహింసా పుష్పము మొదటిది
ఇది ఆత్మారాముని
మూలాధారమున ఉంచేది.
ఇదిమొదలు పరులకెపుడు హింసచేయవలదు సుమ్మా।
ఇదిమదిని మరిచితేను మన పూజలు విఫలమమ్మా ।।అం।।
ఇంద్రియనిగ్రహము రెండవది
ఇది ఆత్మారాముని స్వాధిష్టామున ఉంచేది
ఇంద్రియాది విషయసుఖములెల్ల తుచ్ఛమనుచు రోసి
ఇంద్రియాతీతునిపై డెందము
పొందించరమ్మా ।।అం।।
సర్వభూతదయా పుష్పము మూడవది
ఇది ఆత్మారాముని మణిపూరమున ఉంచేది.
సర్వజీవ కరుణతోడ ।
సర్వేశ్వరుని కరుణకలిగి
సకలసౌఖ్యమందరమ్మా।।అం।
క్షమాపుష్పము నాల్గవది
ఇది ఆత్మారాముని అనాహతమున ఉంచేది.
అలిగిమనలెవ్వరేని అనగరాని
మాటలనిన ।
అంటుకొనని మదిని భూమివంటి ఓర్పు పొందరమ్మా।
శాంతిపుష్పము ఐదవది
ఇది ఆత్మారాముని విశుద్ధమున ఉంచేది.
వాదములను బేధములను
క్రోధములను పెరుగనీయక
పాదుకొని పరమశాంతి బడసి
సుఖముపొందరమ్మా।।అం।।
తపోపుష్పము ఆరవది
ఇది ఆత్మారాముని ఆజ్ఞేయమున ఉంచేది।
కోరితగిన స్థలమునందు
చేరిగురుని గురుతునందు।
ధారణగా మనసు నిలిపి
తపము చేయవలెను సుమ్మా ।
।।అం।।
ఏడవది ధ్యానపుష్పము
ఇదిఆత్మారాముని సహస్రారమున ఉంచేది.
వేడుకతో జగతి ఆటలాడ
మీరు మిమ్మెరింగి ।
వీడరాని ధ్యానమును కూడుకుని ఉండరమ్మా।।అం।।
సత్యము ఎనిమిదవ పుష్పము
ఇది ఆత్మారాముని నిత్యనిర్గుణమున ఉంచేది।
సత్యమార్గమనుసరించి
సత్యస్వరూపుడిని ఆశ్రయించి।
నిత్యనుర్గుణమున మునిగి
నిర్వికల్పమొందరమ్మా।।అం।।
నిరతమిది మరువకుందామా
సద్గురునిబోధ మురుయుచునే
చెవులవిందామా।
ధరణ మళయాళ సద్గురు కరుణ మనము పొందుదామా।
వరదరాజ మనవి విని పరమ
పదము పొందరమ్మా ।।అం।।
⚘
ఎంతో అర్ధవంతమైన ఈ పాట వాట్సప్ సేకరణ.
ఎవరు రాసారో తెలియదు గానీ, వారికి
అబ్బ ..యెంత బావుంది! ఇది చూసినవారు పరులు పెంచిన తోటలో పూలకై ప్రాకులాడకుండా వుంటే బాగుండును. ఆ చిత్రం వుంది చూసారూ .. యెంత బావుందో ..
రిప్లయితొలగించండిఅవునూ.. ఎన్ని పుష్ఫములను భగవంతునికి అర్పించినా హృదయపుష్పాన్ని అర్పించడం ముఖ్యం. ధన్యవాదాలు.
వనజగారు, మీ స్పందన ఎంత బాగుందో...
తొలగించండివాట్సప్ లో వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్ ఇది. ఎంతగానో నచ్చిన ఈ పాటను ప్రాచుర్యంలోనికి తీసుకురావాలని పోస్ట్ చేసాను.
ఇక 'చిత్రం' గూగులమ్మ ఇచ్చింది.
పరమాత్మున్ని పూజించడానికి మనలోనే పూచే పారమార్ధిక పువ్వులు గురించి తెలిపే ఈ పాట ఎంత బాగుందో...
రిప్లయితొలగించండిపాటకు తగ్గ పిక్ బహు బాగు బాగు భారతిగారు.
రమణిగారు,
తొలగించండిమీ చక్కటి వ్యాఖ్యకు ధన్యవాదములండి
ఎంత అర్ధవంతమైన పాట. పరమాత్మ ని మన లోని పువ్వులతోనే పూజించడం... మంచి భావన... 👌
రిప్లయితొలగించండిమీ స్పందనకు మనసార ధన్యవాదములు భాగ్యలక్ష్మి గారు.
రిప్లయితొలగించండిమా అమ్మ నిత్యం ఈ పాట పాడుతూ ఉండేది. భావము కూడా విశీదీకరించి చెప్తూ ఉండేది. చెప్పడమే కాకుండా ఆచరణ లో కూడా పెట్టేది.
రిప్లయితొలగించండిఈ పాట సద్గురు మలయాలస్వాముల వారు వ్రాసారని అమ్మమ్మ చెప్పిందిట
తొలగించండిఅజ్ఞాత గారు,
మీ పేరు చెప్పియుంటే చాలా బాగుండేది.
// మా అమ్మ నిత్యం ఈ పాట పాడుతూ ఉండేది. భావము కూడా విశీదీకరించి చెప్తూ ఉండేది. చెప్పడమే కాకుండా ఆచరణ లో కూడా పెట్టేది //
మీ ఈ మాటలు చదువుతుంటే ఎంతో ఆనందం కల్గింది. చాలా అదృష్టవంతులు మీరు. మీ అమ్మగార్కి హృదయపూర్వక నమస్సులు.
// ఈ పాట సద్గురు మలయాలస్వాముల వారు వ్రాసారని అమ్మమ్మ చెప్పిందిట //
ఈ పాట చివరిలో -
నిరతమిది మరువకుందామా, సద్గురునిబోధ మురుయుచునే, చెవుల విందామా|
ధరణ మలయాళ సద్గురు కరుణ మనము పొందుదమా|
అని చూసినప్పుడే ఇది సద్గురు శ్రీ మలయాళ స్వామి వారే వ్రాసి వుంటారనిపించిన ఖచ్చితమైన సమాచారం తెలియక సందేహంతో ఉండిపోయాను. సరైన సమాచారం ఇచ్చినందుకు మీకు మనసార ధన్యవాదములు
ఈపాట బాగుంది. (నిజానికి ఈపాటలోని భావాలను రామకీర్తనలలో ఉపయోగించితే బాగుంటుందేమో అనిపించింది కూడా. కాని వాటిపై నాకు కర్తృత్వం లేదు రామయ్య ఎలా వ్రాయిస్తే అలా వ్రాసుకుంటూపోతూ ఉండటమే. కాబట్టి నాఆలోచన కేవలం ఆలోచనగానే ఉండిపోతుందేమో!)
రిప్లయితొలగించండిరామకీర్తనలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యపంపినది నేనేనండీ. కాని అజ్ఞాతగా వెళ్ళింది వ్యాఖ్య అందుకని వివరణ ఇస్తున్నాను.
రిప్లయితొలగించండి