నాకు రామాంజనేయులంటే అమిత ఆరాధన. ఆధ్యాత్మికతను అర్ధం చేసుకుంటూ, అటు పయనించాలనే అభిలాష.
ఆధ్యాత్మిక విషయాలు పఠన, శ్రవణముల ద్వారా తెలుసుకున్నవి మర్చిపోకుండా, మననం చేసుకోవడానికి వీలుగా వుంటుందని, మంచివిషయాలు నలుగురితో పంచుకోవడం కూడా అవుతుందని, వాటిని "స్మరణ"లో పదిలపరుస్తున్నాను.
ఈ మధ్య నా అవగాహన మేరకు చక్రాలు గురించి వివరణను పెట్టాను. అయితే, అనాహత చక్రం గురించి టపా పెట్టాక, ఒకరు వ్యాఖ్యకు బదులిచ్చాను గానీ, ఆ సందేహం నన్ను తొలుస్తుంది. దయజేసి ముందుగా ఆ లింక్ ను ఇక్కడ చూడండి.
అనాహతచక్రమునకు అధిదేవత లలితా సహస్ర నామముల యందు ఇలా తెలపబడింది.
అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా
దంష్ట్రోజ్జ్వలాక్షమాలాదిధరా రుధిరసంస్ధితా
కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా
మహావీరేంద్రవరదా రాకిన్యంబా స్వరూపిణీ.
ఈ విధంగా చూస్తే ఈ చక్రంనకు అధిదేవత 'రాకిని' గా తెలుస్తుంది.
అయితే ఓ సత్సంగ మిత్రురాలు ఈ చక్రమునకు అధిదేవత 'కాకిని' అని చెప్తూ, కొన్ని పుస్తకములు ఇచ్చారు. అందులో అధిదేవత 'కాకిని' అనే వివరణే ఉంది. అటుపై కొందరు పెద్దలను అడిగాను. 'రాకిని' కదండీ అని వారిని నేనడిగితే, అన్ని పేర్లూ అమ్మవేనమ్మా, కానీ, అనాహత చక్రమందు యున్న పరాదేవత "కాకిని" అని చెప్తూ, వారు కూడా ఆ టపాకు వచ్చిన వ్యాఖ్యకు నేనిచ్చిన జవాబునే వివరణగా తెలిపారు. కానీ, ఎందుకో ఏదో అశాంతి. లలితలో వున్నది తప్పని అనగలమా? అమ్మో! ఈ భావనే నన్ను వణికిస్తుంది. మనసంతా వేదనమయంగా వుంది.
ఇక, నేను చదివిన, విన్న వాటిని తప్పని అనుకోవడమా? ఏమిటో అంతా అయోమయంగా ఉంది. ఆవేదనగా ఉంది.
భారతిగారూ,
రిప్లయితొలగించండిమీరు శ్యామలీయంలో వ్యాఖ్యద్వారా పంపిన సందేశం చేరింది. ప్రస్తుతం నేను ఎక్కువగా వ్రాయటం లేదు. ఎందుకో మనసు రావటంలేదు. దానికి తోడు ఏమాత్రమూ వీలూ కుదరటం లేదు ఆఫీసుపనులతో. ఐనా మీరు చాలా ఆసక్తికరమైన ప్రశ్నవేశారు, అందుచేత తప్పకుండా పరిశీలించి నా శక్తిమేరకు నా అభిప్రాయం తెలియజేస్తాను. మీ అభిమానానికి చాలా సంతోషం.
ఓం అనాహతాబ్జ - నిలయాయై నమ: అనాహత పద్మము నందు వసించు తల్లికి నమస్కారము.
రిప్లయితొలగించండిహృదయంలో 12 పత్రాలతో కూడిన కమలం అనే అనాహతచక్రం ఉంది. అందు రాకినీ యోగిని రూపంలో జగజ్జనని అధిష్ఠించి ఉంది.
శ్యామల వర్ణంలో (నల్లని వర్ణంలో) ప్రకాశించు తల్లికి నమస్కారము. రెండు ముఖాలతో తేజరిల్లు తల్లికి నమస్కారము. అనాహతచక్ర అధిదేవతయైన రాకినీ యోగినికి రెండు శిరస్సులు ఉంటాయి. కోరలతో ప్రకాశించు తల్లికి నమస్కారము.రాకినీ యోగినికి రెండు ముఖాలకూ వరాహానికి ఉండు విధంగా తెల్లని ప్రకాశవంతమైన కోరలు ఉంటాయి.అక్షమాలను(రుద్రాక్షమాల)మొదలగు వాటిని ధరించి ఉన్న తల్లికి నమస్కారము.రక్తధాతువును అధిష్టించి ఉండు తల్లికి నమస్కారము.
కాళరాత్ర్యాదిశక్త్యౌఘ వృతా స్నిగ్ధౌదన ప్రియా!
మహావీరేంద్రవరదా రాకిన్యాంబా స్వరూపిణీ!!
కాళరాత్రీశక్తి మొదలుకొని పన్నెండు మంది శక్తి దేవతలచే ఆవరింపబడి ఉండు తల్లికి నమస్కారము.
అనాహత పద్మానికి ఉండు పన్నెండు దళాలకు ఒక్కొక్క దేవత చొప్పున పన్నెండుమంది శక్తి దేవతలచే జగన్మాత పరివేష్తించబడి ఉంటుంది.నేతితో కూడిన అన్నము నందు ప్రీతి గల తల్లికి నమస్కారము.వీరసాధకులకు వరాలను ప్రసాదించు తల్లికి నమస్కారము. అనాహిత చక్రాధిష్టాన దేవత అయిన రాకిని యోగిని రూపంతో ఉన్న తల్లికి నమస్కారము. mitramaa idi naaku telisina vivaraNa.swaadhiShTa cakramu na dEvata "kaakini" yOgini.
Vanaja Tatineni గారు తన అభిప్రాయమును మెయిల్ ద్వారా ఇలా తెలిపారు -
రిప్లయితొలగించండిభారతి గారు ..
అనాహత చక్రము
ఇది హృదయ పద్మమున కలదు. దీనికి పన్నెండు (12) దళములు. దీని దళముల నుండి కం, ఖం, గం., ఘం, చం, జం, ఘం, టం, ఠం, అను పన్నెండు శబ్ధములు కల్గినవి. "యం" అను బీజాక్షరము దీని నుండి ఉత్పన్నమయినది. వాయు మండల ప్రాంతము. ధూమ్ర వర్ణము కలది. ఆరు కోణము కలది. ఆధి దేవత రుద్రుడు. దేవత కాకిని. ఆనాహత శబ్దమును నాదము ఇందుండి విననగును. ఇందు విష్ణు గ్రంధి అనబడిన గ్రంధిన గ్రంధి ఒకటి వున్నది. వాయు తత్వము కావున స్పర్శానుభవమును తెలియ జేయును.
అధిదేవత రుద్రుడు దేవత రాకిని ఏ అయి ఉంటుంది భారతీ గారు . ఇతరుల మాట వినకండి . తాత్పర్యం ఇచ్చేటప్పుడు .. రా బదులు కా గా పొరబాటుగా పడి ఉండవచ్చును నిజంగా అర్ధం తెలిసి ప్రచురణకర్తలు పుస్తకాలు ప్రచురించరు . మహావీరేంద్రవరదా రాకిన్యంబా స్వరూపిణీ. గానే భావించి మనసు స్థిమిత పరుచుకోండి అజ్ఞాత వ్యాఖ్య సబబుగా ఉంది . మీరు మీకు లభించిన జ్ఞానం ద్వారానే అది శ్రుత పాండిత్యం అయినప్పటికీ సరే దానినే అనుసరించండి . పుస్తకాలలో ఉన్నది మాత్రం పొరబాటు కాకూడదని లేదు. రాకిని అమ్మవారి నామమే కాబట్టి అదే సరి అయినది. ప్రతి స్థలానికి మూల దేవత పర దేవతా ఇద్దరూ ఉంటారంటారు .. ఇక్కడ అధిదేవత రుద్రుడు రౌద్రంగా ఉన్నాడు కాబట్టి అమ్మ వారు రాకినీ గా ఉన్నారని అర్ధం చేసుకోవాలేమో .. !
చింత పడకండి . పొరబాటైన అమ్మ క్షమిస్తుంది . .. తెలిసీ తెలియక చేసేవే కదా మన పనులు . అలా అనుకుని స్తిమితపడండి
భారతి గారు , ఇది మీకు కలిగిన ఒక అపూర్వ అవకాశం .. ఇప్పుడు కావాల్సింది ఆవేదన కాదు .. శోధన .. అర్ధం ఐంది కాదు ,, మన మిత్రులు వనజ గారు , విశాలాక్షి గారు మంచి వివరణ ఇచ్చారు .. ముందుకు సాగండి .. ఆల్ ది బెస్ట్
రిప్లయితొలగించండిBharathi Garu,
రిప్లయితొలగించండిPlease go thru "http://telugu.srichaganti.net/", you can find lalitha sahasram pravachanams by Sri changanti koteswar rao garu. It was 40 days pravachanam given by chaganati garu, very very useful stuff.
Also please follow "http://www.teluguyogi.net/", excellent spiritual blogger and you can contact him if you have any doubts.
Thanks
Munikrishna Reddy
భారతీ,
రిప్లయితొలగించండిఓ 'స్నేహితురాలి'గా, 'హితురాలి'గా కాకపోయినా, నీ బ్లాగ్ వీక్షకురాలిగా నేను పెడుతున్న ఈ వ్యాఖ్యను తిరష్కరించక స్వీకరిస్తావనే ఆశిస్తున్నాను.
అనాహతచక్రంనకు అధిదేవత "రాకిని". ఇందులో సందేహం లేదు. 'లలిత'యందు వున్నదే మనకు ప్రామాణికం.
వేద శ్రీ గారు సరిగ్గా చెప్పారు. వనజ గారు సమగ్రంగా చెప్పారు. తను చెప్పినదాంట్లో మొత్తం వివరణ అంతా వుంది. ఈసరికే అది నీవు గ్రహించి వుంటే అసలు పోస్ట్ లో నీ తప్పుని సరిదిద్దేదానివి. బహుశా అపరాధభావంతో వున్న నీవు ఆమె చెప్పినది అర్ధంచేసుకోలేకపోయావని అన్పించి ఈ వ్యాఖ్యను పెడుతున్నాను.
వనజగారు నీ సందేహానికి ఎంతో స్పష్టంగా సమాధానమిచ్చారు. మొదటి పేరాలో అధిదేవుడు రుద్రుడు, దేవత కాకిని అని, రెండవ పేరాలో ప్రతిస్థలానికి మూలదేవత, పరదేవత అని ఇద్దరుంటారు అని చెప్పారు కదా. అది నిజం.
షట్చక్రాలకు అధిదేవతలతో పాటు అధిదైవంకూడా శక్తులతో కూడి వుంటారు. ఐతే, అన్ని చక్రాలయందు చక్ర అధిష్టానదేవతలతో కూడుకొని కాక, కొన్నింట వేరే దేవతలతో కూడుకొని ఉంటారు. బహుశా నీవు ఇక్కడే పొరబడి యుంటావు.
అనాహతచక్రమునకు అధిదేవత "రాకిని". ఇక అధిదేవుడులేదా అధిదైవంగా "ఈశానుడు అయిన రుద్రుడు కాకినీశక్తి"తో కూడుకొని వుంటాడు.
అలాగే, మూలాధారచక్రంనకు అధిదేవత "సాకిని". అధిదైవంగా "చతుర్ముఖబ్రహ్మ చతుర్ముఖడాకిని"తో కలిసి వుంటాడు.
స్వాదిష్టానచక్రంనకు అధిదేవత "కాకిని". అధిదైవంగా "వ్యాపుకుడైన విష్ణువు చతుర్బుజాలతో రాకిని"తో కూడివుంటాడు.
మణిపురచక్రంనకు అధిదేవత "లాకిని". అధిదైవంగా "రుద్రుడు లాకినిశక్తి"తో కూడివుంటాడు.
విశుద్ధిచక్రంనకు అధిదేవత "డాకిని". అధిదైవంగా "పంచముఖ సదాశివుడు శాకిని"తో కూడి వుంటాడు.
ఆజ్ఞాచక్రంనకు అధిదేవత "హాకిని". అధిదైవంగా "మంగళప్రదాత ఐన శివుడు నాలుగుభుజాలు, ఆరుముఖాలుగల హాకిని"తో వుంటాడు.
నీకు అర్ధంకావడానికి ఈ వివరణ చాలనుకుంటాను. ఆవేదనతో ఆగిపోక, అవగాహనతో సాగిపో ...
నాది కూడా అభ్యర్ధన -
నేను నీకు బాగా నొప్పించానన్నది వాస్తవం. తప్పును తెలుసుకొని లెంపలు వాయించుకున్నాను. ☺
ఇకనైనా నను క్షమించి మాట్లాడవే తల్లీ ... నీ హరిప్రియ
సదసద్వివేచనా సరణి పాటించెడు
రిప్లయితొలగించండిపటుతరంబగు బుధ్ధి పటిమ వారు
బహు పురాణాంతర పరిశీలనా జ్ఞాన
సంపత్తి గల్గిన సత్యవిదులు
వేదాంత విజ్ఞాన వీధుల విహరించి
పరమాత్మ నెరిగిన బ్రహ్మవిదులు
భక్తి పూదోటలో ప్రభవించు కుసుమాల
నేరి మాలల గట్ట నేర్చు వారు
సతత పరమాత్మ స్మరణలో , శాంత భక్తి
క్షీర సరసిలో విశ్రమించెదరు మీరు ,
సరసిలో అలజడి సహజము గదా ! చ
లించ వలదు బారతి గారు ! లేశమైన .
రాకిన్యాంబస్వరూపిణి:- (494)
రిప్లయితొలగించండిఅనాహతాబ్జనిలయ, శ్యామాభాయ, వదనద్వయ, దంష్ట్రోజ్జ్వలాయ, అక్షమాలాదిధరాయ, రుధిరసంస్దితాయ, కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయ, స్నిగ్ధౌదనప్రియాయ, మహావీరేంద్రవరదాయ. (485 నుండి 493 వరకూ గల నామములు)
“ హృత్పద్మే, భానుపత్రే, ద్వివదన లసితాం, దంష్ట్రిణీం, శ్యామవర్ణామ్
చక్రం, శూలం, కపాలం, డమరుపి – భుజైర్ధారయంతీ త్రినేత్రాం
రక్తస్దాం కాళరాత్రి ప్రభ్రుతి పరివృతాం, స్ధిగ్న భక్తైక సక్తాం
శ్రీమద్వీరేంద్ర వంద్యా మభిమత ఫలదాం, రాకినీ, భావయామః “
లలితా సహస్త్రములో ఉన్నదానికన్నా ప్రామాణికం ఏమున్నది? అనాహతం లో ఉన్నది రాకిణీ దేవి అనుటలో సందేహము వద్దు
Dear Bharathi Garu,
రిప్లయితొలగించండిToday evening at 5pm IST Samavedam Shanmukha Sarma's Bhashyam on Lalitha will be broadcasted on exactly on this aspect. Please see. I have sent the URLS of this progrmme in Bhakthi earlier too. Pray your doubts will be cleared.
భారతిగారు,
రిప్లయితొలగించండినమస్తే. 'పాహిరామప్రభో' శీర్షికన పద్యాలు మరలా మొదలు పెట్టాను. ఈ కొత్త వరుసలో ఈ రోజున ౧౬వ పద్యం వచ్చింది. మీరు లోగడ ఈ పద్యాలు ఆదరించారని మీకు తెలియజేస్తున్నాను.
మీరడిగ ప్రశ్నకు ఈ వారాంతంలో వీలుచేసుకొని సమాధానం వ్రాయాలని యత్నిస్తున్నాను,
అందరికీ వందనములు.
రిప్లయితొలగించండిఈ టపా చూసి స్పందించిన వారందరికీ హృదయపూర్వక నమస్సులు.
టపా పెట్టిన వెంటనే స్పందించిన శ్రీ శ్యామలీయం గారికి, చక్కగా వివరించిన వేద శ్రీ గారికి, సరైనా వివరణతో పాటు, నా వేదనను తగ్గించే అనునయ మాటలతో నేను స్థిమితపడేటట్లు చేసిన వనజ తాతినేని గారికి, ప్రోత్సాహపూరిత వ్యాఖ్యను పెట్టిన రుక్మిణీదేవి గారికి, చక్కటి లింక్ ఇచ్చిన మునికృష్ణ రెడ్డిగారికి, మరింత వివరణ ఇచ్చిన అంతరంగిక మిత్రురాలు హరిప్రియకు, వాత్సల్య ప్రోత్సాహపూరిత వాక్కులతో స్పందించిన మాస్టారుగారు శ్రీ వెంకట రాజారావుగారికి, చక్కటి వివరణను తెలిపిన నారాయణరావుగారికి, నాలో మరింత అవగాహన పెరగడానికి సహాయపడే శ్రీ సామవేదుల షణ్ముఖశర్మగారి భాష్యం వినే భాగ్యం కల్పించి, నాకు ఎంతో మేలు చేసిన అజ్ఞాతగారికి (నా తప్పును సరిచేసే మీపేరు చెప్పివుంటే బాగుండును), తల్లీ... భారతీ, అనాహత చక్రమునకు అధిదేవత "రాకిని" అనుమానం లేదు ... అని ఆత్మీయంగా మెయిల్ ద్వారా తన స్పందనను తెలియజేయడంతో పాటు అమూల్య వివరణను తెలిపిన సహృదయులు శ్రీ శర్మ గారికి, తన బ్లాగ్(ఆనందం) ముఖంగా సరైన వివరణ ఇచ్చిన అనూరాధ గారికి, ఇంకా ... మెయిల్స్ ద్వారా, ఫోన్ ద్వారా, ప్రత్యక్షంగా స్పందించి నా తప్పును సరిజేసే ప్రయత్నం చేసిన అందరికి ... అందరికీ హృదయపూర్వక వందనములు.
అనాహత చక్రమునకు అధిదేవత "రాకిని". అసలు టపాలో సరిచేస్తున్నాను. గమనించగలరు.
మీకు సరిచేయమని చెప్పినవారు అమ్మస్వరూపమే అనుకోండి అన్న స్నేహమయి వనజగారు మాటలు యదార్ధం. నా భావన కూడా అదే. నిజంగా నా తప్పును సరిదిద్దినది "అమ్మే" . శ్రీ మాత్రే నమః
అందరికీ మరోసారి మనసార ధన్యవాదములు.
Dear Bharathi Garu,
రిప్లయితొలగించండిI congratulate you for being courageous, humble and setting aside the sweet little ego to make the correction in the said article. When I read your article, I being the ardent Lalitha Parayana for the past 11 years could not take it. Initially I felt that it could been just a typing error and wrote the same to you. But then you had your views(?). I felt bad that you didn't want to correct it. But then Mother Lalitha worked through you to accept the folly. Great. You are Blessed. Please continue to write articles. Best wishes - AGNATHA