3, ఆగస్టు 2012, శుక్రవారం

ఏమని బదులివ్వను?

నా స్నేహితుల్లో ఒకామె కృష్ణభక్తురాలు. ఆధ్యాత్మిక చింతన తనలో ఎక్కువ. తనుంటున్న వీధిలో ఒకరింటిలో ప్రతిగురువారం మధ్యానం రెండు నుండి ఐదు వరకు జరిగే 'సత్సంగం'కి తప్పనిసరిగా వెళ్ళడం, అక్కడ తెలుసుకున్న విషయాలను పదే పదే మననం చేసుకుంటూ ఒకవిధమైన పారవశ్యంతో పదిమందికి ఆ విషయాలను చెప్పడం తనకి అలవాటు. అలానే గురువారంనాటి సత్సంగవిషయాలను శుక్రవారం ఉదయం స్వయంగా వచ్చిగానీ, ఫోన్ ద్వారాగాని నాకు చెప్పడంకూడా తన క్రమం తప్పని అలవాటు.
ఈరోజు ఉదయం ఫోన్ వచ్చిందిగానీ, చేసింది వాళ్ళబ్బాయి. ఆంటీ! అమ్మకి విపరీతంగా కడుపులో నొప్పివస్తే రాత్రే హాస్పిటల్ లో అడ్మిట్ చేశాం. ఇప్పుడు హాస్పిటల్ లోనే ఉన్నాం అని చెప్పిన కాసేపటిలో తన దగ్గరికి వెళ్ళిన నన్ను చూస్తూనే అంతటి నీరసంలో కూడా నిన్నటి సత్సంగపు మాటలు - ...........'ఈ సృష్టంతా సర్వేశ్వరుని స్వప్నసదృశ్యం. సర్వాంతర్యామి స్వప్నమిది. మనమంతా ఆ జగన్నాటకంలో పాత్రలం' అని చెప్తుండగా ఒకింత కోపంతో 'అయితే రాత్రినుండి నీవు పడుతున్న ఈ నొప్పి కూడ స్వప్నమేనా?' అని కాస్త వెటకారంగా వాళ్ళబ్బాయి ప్రశ్నించగా -
"అవునురా, ఇదీ స్వప్నమే. కాకపొతే బాధకరస్వప్నం, ప్రారబ్ధస్వప్నం" అని బదులిచ్చి 'అంతేనా భారతీ, నీవు చెప్పు' అని నన్ను ప్రశ్నించిన తనకి ఏమని బదులివ్వను?
భగవంతుని పట్ల, భగవత్ విషయాలు పట్ల తనకి గల భక్తివిశ్వాసములకు ఏమని బదులివ్వగలను?

7 వ్యాఖ్యలు:

  1. అదే మాయ. ఇప్పుడు స్టెం సెల్ చికిత్స అంటే, ఒక కణానికి కొన్ని సిగ్నల్స్ ఇచ్చి కాలు, చేయి, కన్ను ఏది కావాలంటే అది తాయారు చేయవచ్చు. అలాగే మనకు ఏ సిగ్నల్ ఇస్తే అల ఫీల్ అవుతాము. అదే మాయ. సిగ్నల్ అంటే తరంగము. wave energy... శక్తి అంటే అదే మాయా శక్తి...

    ప్రత్యుత్తరంతొలగించు
  2. swapnam anubhavam avutunnappude satyam. melukonna drishti tho asatyam. sakshi ki kala pai dhyasa ledu, tureyatheetham lo sarvam sunyame.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి.

    ప్రత్యుత్తరంతొలగించు