19, అక్టోబర్ 2012, శుక్రవారం

ప్రయత్నిస్తేనే ప్రగతిపధం.

ఉదయం పద్మ (చాకలామె) బట్టలు ఉతుకుతూ- అమ్మా! దగ్గర సంబంధమని, నేనేదో సుఖపడిపోతానని పెళ్లి చేశారమ్మ మా అమ్మా నాన్నలు. కానీ, పొద్దు కుంకితే చాలమ్మా, తాగేసి వచ్చి నానా రగడ చేస్తాడమ్మ. తాగనంతసేపు మంచోడే, తాగితేనే రాక్షసుడు, ఉట్టి అధముడమ్మ............అని బాధగా చెప్పగా -
నీవే మంచిగా, నెమ్మదిగా, ప్రేమగా చెప్తుండు, త్రాగుడు మానేయమని. మారేంతవరకు సహనంగా ప్రయత్నించు....... తప్పకుండా మారతాడు అని కాస్తంత దైర్యం చెప్తూ అన్నాను.

నిజమే! మనిషి యొక్క స్వాభావిక గుణకర్మల బట్టి పెద్దలు మానవులును మూడు విధములుగా పేర్కొన్నారు -
ఉత్తములు, మధ్యమములు, అధమములుగా!

ఉత్తములు:-  లోకహితార్ధమే నిష్కామభావంతో వేదవిహిత స్వధర్మ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ, నిశ్చయాత్మక బుద్ధితో స్థితప్రజ్ఞులై, విషయాసక్తి లేనివారై, అహంకార మమకార రహితులై, సకలభూతములయందు సర్వేశ్వరున్నే కాంచుచూ, నిత్య ఆనందమయులై ఉంటారు.
మధ్యములు:- సంసార బద్ధులై, స్వభావము బట్టి కర్మలను ఆచరిస్తూ, ప్రాపంచిక వ్యవహారంలతో బంధనములు ఏర్పరచుకొని కొంతకాలం గడిపినను క్రమేపి సంస్కార ఫలితంగా దైవమునందు భక్తి కలిగి, సకల భూతములయెడ స్నేహం, ప్రేమ, దయను కలిగియుండి అహంకార రహితులై, క్షమాశీలురై, సుఖదుఃఖముల ప్రాప్తియందు సమత్వం కలవారై, రాగద్వేషాలకు లోనుకాకుండా మోహరహితులై,
పరమాత్మయందు భక్తిప్రపత్తులతో దాన యజ్ఞయాగాది వంటి శుభకర్మలను ఆచరిస్తూ, సజ్జనులతో సద్గోష్టి జరుపుతూ సంతుష్టులై ఉంటారు.
 అధమములు:- అహంకారం, మూర్ఖం, గర్వం, దర్పం కలిగి కామ క్రోధ లోభ పరాయణులై, దయారహితులై, అన్యాయధనార్జనాపరులై, మోహజాలమందు చిక్కుకొని అపవిత్రులై ఉందురు. డాంభికమైన ఆడంబరాలు కొరకై  దానయజ్ఞాది కర్మలు ఆచరిస్తూ, స్వార్ధపరులై ఉంటారు.
ఎవరైనా సరే, త్రికరణశు
ద్ధితో ప్రయత్నిస్తే ప్రగతిపధంవైపు పయనించగలరు.
 

ఇక పారమార్ధిక కోణంలో వీరిని నిత్యులు, ముక్తులు, బద్ధులని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొన్నారు. నిత్యులు:- జన్మతః మహాత్ములుగా పుట్టి, బాల్యంలో కూడా యే అపరాధములు నెరుగక, స్వాచార్యుని వలె సత్యము నెరిగి, ఎల్లప్పుడూ ఆత్మభావమున ఉండువారు నిత్యులు. వీరు పరమానందమయులు. నిత్య భక్తమయులు. ఇందుకు ఉదాహరణము ప్రహ్లాదుడు.
ముక్తులు:- పుట్టుకతో సామాన్యుడిగా యుండి, సంస్కారఫలితంగా తన స్వంత ఆలోచన వలననో, లేక ఇతరుల ప్రభావం వలననో, ఆచార్యుని వాత్సల్యముననో, భక్తి ప్రపత్తులవలననో సంసార వ్యసన బంధములనుండి మానసికంగా బయటపడి, అరిషడ్వర్గముల నుండి విముక్తుడై, అన్నింటా సంస్కరింపబడినవాడై దేహాత్మభావనను వీడి సత్పురుషుడిగా మారి, ఆత్మభావమునకు వచ్చువారు ముక్తులు. ఇందుకు వాల్మీకి ఉదాహరణ.
బద్ధులు:- సంసారమున చిక్కుకొని, వ్యసనాలు, అరిషడ్వర్గములకు లొంగిపోయి, వానినుండి బయటపడలేక, పరమాత్మ విషయం పూర్తిగా నెరుగక, పాపులుగానే కడపటివరకు జీవించువారు బద్ధులు. మహిరావణుడు ఉదాహరణ.
ఎవరైనా సరే, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే పరమాత్మను కాంచగలరు.

7 కామెంట్‌లు:

  1. మీ వివరణ చాలా బాగుంది భారతి గారూ!...

    కాకుంటే బద్ధుడు అంటే తన బాధ్యతలకు కట్టుబడి ఉండే వాడు కదా!...
    మరి బద్దులు అంటే మీరు వ్రాసినదే సరిఅనది అంటారా?
    సందేహ నివృత్తి కోసం అడుగుతున్నాను...
    సంసార బంధాలలో చిక్కుకొని కాదేమో...
    సంసార బాధ్యతలకు కట్టుబడి ఉండిపోయేవాడేమో అనుకుంటున్నాను...

    మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...
    @శ్రీ

    రిప్లయితొలగించండి
  2. శ్రీగారు!
    సంసారంలో నీ బాధ్యతలను పరిత్యజించనవసరం లేదు. సంసారబాధ్యతలను సక్రమముగా నిర్వర్తిస్తునే దేనియందు నాది అనే తాదాత్మ్యభావాన్ని పెంచుకోకుండా, వాటియందు అనురక్తిని పరిత్యజించు. సంసారంలో నీవుండు కానీ, సంసారం నీలో లేకుండా చూసుకో అంటారు శ్రీరామకృష్ణులవారు.
    సంసారంలో ఉంటూనే దేనినీ అంటుకోకుండా అనురక్తరహితుడై నిష్కామభావంతో స్వధర్మకర్మాచరణ చెయ్యటం ద్వారా బంధవిముక్తులు కావొచ్చు అంటారు శ్రీవివేకనందులవారు.
    సంసార బంధాల యందు అనురక్తచిత్తుడై చిక్కుకున్న వ్యక్తి ఎప్పటికీ బద్ధుడే. మనోనిగ్రహం కల్గియుండి సంసారబాధ్యతలను సక్రమముగా నిర్వర్తిస్తూ, స్వధర్మమును నెరిగి సత్కర్మాచరణుడై ఉన్న వ్యక్తికి గృహజీవేనమే తపోవనం. అలా కాకుండా సంసారబందాలలో చిక్కుకొని పరమాత్మతత్వాన్ని గ్రహించనివాడు బద్ధుడే.

    మీ ఈ స్పందనకు ధన్యవాదములండి.

    రిప్లయితొలగించండి
  3. యెంత చక్కని విషయాలు వ్రాస్తున్నారు మీరు.అభినందనలు

    రిప్లయితొలగించండి
  4. Baarati gaaroo mannicheyandee.. aalasyamgaa choostunnduku. mee blog o vignaana vedika naaku.

    రిప్లయితొలగించండి
  5. హలో అండీ !!

    ''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!

    వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
    ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
    ఒక చిన్న విన్నపము ....!!

    రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది

    మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
    మీ అంగీకారము తెలుపగలరు

    http://teluguvariblogs.blogspot.in/

    రిప్లయితొలగించండి