ధ్యానం - అహంభావాన్ని చేదించి అతీతమానసమై అంతర్లయగా సాగేది.
ధ్యానం - దివ్యజీవనమునకు దోహదకారి.
ధ్యానం - ఆత్మాన్వేషణకై చేసే అంతర్యానం.
ధ్యానం - అంతరాన్న ఆత్మాపరమాత్మల అనుసంధానం.
ధ్యానం - ఆత్మ స్మృహ.
ధ్యానం - ఆత్మ దర్శనం.
ధ్యానంలో - అహంభావం అంతరిస్తుంది.
ధ్యానంలో - అహంకారం అడ్డుతొలగిపోతుంది.
ధ్యానంలో - ఆభిజాత్యం ఆవిరైపోతుంది.
ధ్యానంలో - అనుమానాలు అదృశ్యమౌతాయి.
ధ్యానంలో - అజ్ఞానం అంతర్దానమౌతుంది.
ధ్యానంలో - అంతర్యామియందు అపరిమితమైన అపేక్ష అంకురిస్తుంది.
ధ్యానంలో - అంతర్భూతంగా ఆధ్యాత్మికత అవతరిస్తుంది.
ధ్యానంలో - ఆరాధన అంతర్వాహినవుతుంది.
ధ్యానంలో - అభ్యాసంచే అన్నివేళలా అన్నింటా అంతటా ఆత్మభావం అలవడుతుంది.
ధ్యానంలో - మనసు అచలమై ఆత్మా ఆవిష్కృతమవుతుంది.
అన్నింటా విశ్వాసంతో వుండు
విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు.
చాలా బాగా వ్రాసారండి.
రిప్లయితొలగించండిఅనురాధగారు!
రిప్లయితొలగించండిధన్యవాదములండి.
bhaarati garoo, mee post ardam chesukone staayi naaku ledu. but try chesaanu, goppagaa undi.
రిప్లయితొలగించండిచిరు అనారోగ్యం వలన మీ వ్యాఖ్య చూడడం ఆలస్యం అయింది.
రిప్లయితొలగించండిపోస్ట్ అర్ధం కాలేదని వదిలేయకుండా, అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అర్ధంచేసుకొని, మీ స్పందనను తెలియజేసే మీ సహృదయత బహు గొప్పది మేరాజ్ గారు.
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండిధ్యానం తోనే వత్తిడికి సెలవ్
నేటి మహిళకు ఇంటిపని, ఆఫీసు పని రెండు చేసేసరికి ఒత్తిడికి గురయి తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే సమయం లేకపోవడంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల ఆమె మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ సమస్యలు నుండి బయటపడాలంటే రోజువారీ పనుల నుండి కాస్తంత సమయాన్ని ఈ వ్యాయామాలకు కేటాయిస్తే ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది మరి. మన మనసు, మెదడు ఎప్పుడూ శరీర ఆరోగ్యం సరిగా ఉంటేనే అవి బాగా పనిచేస్తాయి. అందుకని మీ ఆరోగ్యం గురించి మీరు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మీరు రోజంతా ఉత్సాహంగా మీ పనులు చేసుకోవాలంటే కొన్ని దినసరి వ్యాయామాలు తప్పనిసరి. వీటిని మీరు రోజూ చేస్తే మీకు చాలా శక్తి వస్తుంది. దీనివల్ల మీ పనులను చాలా ఉత్తేజంగా మీరు నిర్వర్తించగలుగుతారు. మీరు చేయవలసిన వ్యాయామాలు ఇవి:
దీర్ఘశ్వాస పీల్చడం
మీరెప్పుడైనా ఒక సన్యాసి చేసే ధ్యానాన్ని చూశారా. అతను శ్వాసను చాలా గట్టిగా పీలుస్తాడు. వదులుతాడు. ఇలా చేసినపుడు అతని పొట్ట లోపలికి వెళుతుంది. లోపల ఉన్న నరాలలో కదలిక వచ్చి జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది. శ్వాసకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా తీరిపోతాయి. కాని వాళ్లు, మగవాళ్లు. వారు తీసుకున్నంత బలంగా మహిళలు తీసుకోలేకపోవచ్చు. వారికి సాధ్యమైనంత వరకు బలంగా శ్వాసను తీసుకోగలిగితే చాలా మంచిది. ఇది ఆచరణలో పెడదామా మరి. ముందుగా మీ రెండు కళ్లను మూయండి. తరువాత గట్టిగా లోపలికి గాలిని యోగి పీల్చినట్లు (అంతగట్టిగా కాకపోయినా కొద్దిగా) పీల్చండి. మీ ముక్కుద్వారా గాలిని సులువ్ఞగా పీల్చగలుగుతున్నారా? ఇలా పీల్చినపుడు మీ కడుపు లోపలికి వెళుతుంది. కడుపు లోపలికి వెళ్లిన దగ్గర్నుండి ఎనిమిది అంకెల లెక్కబెడుతూ నెమ్మదిగా తిరిగి పూర్వస్థితికి వస్తే కడుపు కూడా సాధారణ స్థితికి వస్తుంది. ఈవిధంగా శ్వాసను లోపలికి, బయటికి వదిలే వ్యాయామాన్ని రోజుకి రెండుసార్లు చేస్తే చాలా ఉత్సాహంగా ఉంటుంది.
దీర్ఘశ్వాస వల్ల లాభాలివే
మీరు ఎప్పుడైతే గట్టిగా గాలిని లోపలికి పీల్చుతారో తాజా ఆక్సిజన్ మీ శరీరానికి అందుతుంది. మీ గాలిని గట్టిగా పీల్చినప్పుడు మీ శరీరంలో ఉన్న అన్ని కణాలు స్పందిస్తాయి. ముఖ్యమైన కణాలయిన లింఫోసెల్స్ కూడా స్పందిస్తాయి. కడుపులో గ్యాస్, మంట లాంటి బాధలున్నవారు ఇటువంటి వ్యాయామం చేస్తే తొందరగా నయమవ్ఞతుంది.
సూచన ఒక పచ్చనిచెట్టును చూసుకుని ఆ చెట్టుకింద కూర్చుని ఈ వ్యాయామాలు చేస్తే చాలా మంచిది. హైపర్టెన్షన్ గలవారు ఇటువంటి వ్యాయామం చేయకూడదు. వారు కేవలం శ్వాసపీల్చడం, వదలడం లాంటివి చేయాలంతే....ఓ లింక్ లో మొన్నెపుడో చదివాను...ధ్యానం సర్వరోగ నివారిణి కదూ!...@శ్రీ
శ్రీ గారు! మీరన్నది యదార్ధమండి.....ధ్యానం సర్వరోగ నివారిణి! చక్కటి విషయాలను తెలియజేశారు.
రిప్లయితొలగించండిధన్యవాదాలండి శ్రీ గారు.