హాయ్ ...
ఈ రోజుకి ఈ బ్లాగ్ కు నేనే నాయకిని.
నా పేరు "శ్రీ మాన్వి".
వయస్సు ఒక సంవత్సర రెండు నెలల ఇరవైఏడు రోజులు.
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలనిపించి మా అమ్మమ్మ బ్లాగ్ కు వచ్చేసాను.
"భారతదేశం నా మాతృభూమి"
రత్నాకరా ధౌతపదాం హిమాలయ కిరీటినీం
బ్రహ్మరాజర్షిరత్నాడ్యాం వందేభారతమాతరం
(రత్నాకరుడైన సముద్రుడు ఎవరి పాదములను కడుగుతున్నాడో, ఎవరికీ హిమాలయము కిరీటమై ప్రకాశిస్తుందో, బ్రహ్మర్షి రాజర్షులనెడి పుత్రరత్నములతో ఎవరు ప్రకాశిస్తూ ఉన్నారో ... అట్టి పవిత్ర భారత నా మాతృభూమికి వందనం)
భారతభూమి జగన్మాత యొక్క సాక్షాద్రూపమే. అది ఎలాగంటే తండ్రి అయిన దక్షునిచే అవమానింపబడి అగ్నికాహుతి అయిన సతీదేవి దేహాన్ని ఎత్తి పరమశివుడు ప్రళయతాండవం చేస్తే, ఆ దేవి శరీరావయవాలు ఏబైరెండు చోట్ల పడ్డాయి. అవి మన భారతదేశంలోనే ఎబైరెండు శక్తిపీఠాలుగా విలసిల్లుతూ మన భూమి ఘనతను వెల్లడిస్తుంది. సముద్రమును వస్త్రముగా, పర్వతములను స్తనమండలముగా గలిగిన విష్ణుపత్నిగా భారతమాతను మన ఋషులు శ్లాఘిస్తున్నారు. మన మాతృదేశం కేవలం ఒక మట్టిముద్దకాదు, ఆమె భవాని, మహిషాసురమర్ధిని, భారతి. ఆమె కోటి కోటి జనమనో హృదయాలలోని ఇచ్ఛాశక్తుల సజీవ సాక్షాత్కారం. ఆమె సాక్షాజ్జగజ్జనని. పరాశక్తి యొక్క సజీవావిష్క్రుతి అని అరవిందులు వారుకీర్తించారట. ఈ విషయాలు అన్నీ మా అమ్మమ్మ చెప్తుంటుంది. అందుకే -
"నేను భారతీయురాలిగా జన్మించినందుకు గర్విస్తున్నాను"
ఏ ప్రపుల్ల పుష్పముల నీశ్వరునకు
పూజ సల్పితినో యిందు పుట్టినాడ
ఇంతటి మహనీయగడ్డ పై నాకు జన్మనిచ్చిన మా అమ్మానాన్న (అనూష, లతీష్) లకు వందనములు.
ఈ టపా ఇప్పుడు నాకు అర్ధం కాకపోయినను భవిష్యత్తులో నాకు స్ఫూర్తినిస్తుందనే ఆకాంక్షతో నా పేరిట మా అమ్మమ్మ ఈ పోస్ట్ ను పెట్టింది.
మరోసారి -
అందరికీ
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
- మీ శ్రీ మాన్వి
శుభ దీవెనలు (ఈ టపా కర్త, క్రియ ఇద్దరూ నాకు చిరంజీవులే ...). కర్త తన దైవ చింతన నడత, మాటు కానీయక, క్రియ ప్రాయముకు తగ్గట్టుగా. ఈ టపా కర్మ (పని) ని నెఱపడము అభినందనీయము, ఆనందకరము. శుభమ్ ...
రిప్లయితొలగించండిఅన్నయ్య!
తొలగించండిధన్యవాదములు.
నీ దీవెనలు మాకు శ్రీరామ రక్ష.
భావి భారత చిన్నారి తో అమ్మమ్మ చెప్పించిన భారతమాత ఔన్నత్యం చూసి మది పులకించి పోయింది . భారతి గారు అభివందనం అభినందనీయం. జయ జయహో .. భారతమాత " ఈ భూమి పై పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది "
రిప్లయితొలగించండివనజ గారు!
తొలగించండిమీ స్పందనకు ధన్యవాదములు.
శ్రీరాముడు నడయాడిన, శ్రీకష్ణుడు కదలాడిన పుణ్యభూమి మనది.
" ఈ భూమి పై పుట్టినందుకు నాకూ చాలా గర్వంగా ఉంది "
చిన్నారీ .. శ్రీ మాన్వి. .. అమ్మమ్మకి వారసురాలివై భారతమాత బిడ్డగా తేజోమయంగా చిరునవ్వులు చిందిస్తూ నిండునూరేళ్లు వర్ధిల్లు బంగారు . నీకు నా మనఃపూర్వక ఆశ్సీస్సులు. భగవంతుని కృపాకటాక్షాలు అన్నివేళలా లభించాలని ప్రార్ధిస్తూ .. నీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చిన్నారి .
రిప్లయితొలగించండిభగవంతుని అనుగ్రహమే మీ అమూల్యమైన ఆశీస్సులని అమ్మమ్మ చెప్పింది.
తొలగించండిధన్యవాదములు నేస్తం (అమ్మమ్మ స్నేహితులు నాకూ స్నేహితులే).
భక్తికి నిలయమై పరిఢవిల్లిన భూమి
రిప్లయితొలగించండిజ్ఞానాగ్ని రగిలిన కర్మ భూమి
గురు బోధనామృత ఝరులు పారిన భూమి
తత్త్వ వేత్తల యరుదైన భూమి
పరమ హంసల దివ్య పాదముద్రల భూమి
పావన నదుల సంపదల భూమి
వివిధ సంస్కృతులతో వెల్గులీనెడు భూమి
భిన్న మతాల సంపన్న భూమి
అట్టి భారత భూమిపై పుట్టిన ఘను
లెందరో కలరు , వారిలో మంది కొఱకు
బ్రతికి మార్గ దర్శకులైన వారి దలచి
ప్రణతులిడుటె శ్రీ మాన్వికి వరము నేడు
చిట్టితల్లి శ్రీమాన్వికి మీ ఈ స్పందన మరింత స్ఫూర్తినిస్తుంది మాస్టారు గారు.
తొలగించండిమీకు మా (నా మరియు నా మనుమరాలి) నమస్సులు.
చక్కగా చిన్నారి చేత చెప్పించి , భవిష్యత్తులో అర్ధం చేసుహోవాలన్న సత్సలహా బహు చక్కటి సందేశం .
రిప్లయితొలగించండిసర్!
తొలగించండిమిమ్మల్ని స్మరణ స్వాగతిస్తుంది.
నా భావనను, ఆకాంక్షను అర్ధం చేసుకొని మీ స్పందనను తెలిపినందుకు ధన్యవాదములండి.
మన భారతదేశం ప్రపంచీకరణ లో పడి ఉనికి కొల్పోకుండా ఉంది అంటే , శ్రీ మాన్వి లాంటి బుడుతలు , మీ లాంటి అమ్మమ్మలు వల్లనే
రిప్లయితొలగించండి