6, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఈశ్వరభక్తి

సర్వభూతేషు కారుణ్యం ప్రియభాషణమేవ చ /
సర్వభూతహితే శ్రద్ధా సాక్షాద్భక్తి: శివస్య తు //

సమస్తభూతములయందు కారుణ్యభావమును, అందరితో ప్రియముగా మాట్లాడుటయు, సకలప్రాణుల సౌఖ్యంకొరకు పాటుపడుటయు, సమస్తప్రాణుల యందు ప్రకాశించుచుండువాడు భగవంతుడేయని గ్రహించుటయుయే నిజమైన ఈశ్వరభక్తి. 

4 కామెంట్‌లు:

  1. ఈశ్వర అనుగ్రహం చేతనే అద్వైత వాసన కలుగుతుందని విన్నాను,
    ఈశ్వర స్సర్వ భూతానాం అని ఉపనిషత్తులు చెబితే
    ఈశ్వర ప్రణిపాతం చేయాలని పతంజలి మహర్షి సూచించగా
    సర్వ కాల సర్వ అవస్థలలోను ఈశ్వరుడు గమనిస్తున్నాడనే భావనతో మెలగాలని

    (nishkama karma, trikarana suddhi kavali bhoktha ni pogottalante.
    sankhya, taraka, amanaska paddhathi braahmanusandhanam chetha karthrutwa atheetham avvachu.
    anni telisi cheyyatam sadhana
    trikarana suddhi satwikam valla sadhhyam
    eeswarudu sarva kalamu landu gamanisthu unnadane spruha lo vundadam
    papa bheethi, bhagavanthuni pai preethi
    ee rendu sadhakudini ahimsa pradhamam pushpam ani cheppina slokam nu acharincha valenu ane dasa ku teesukoni velthai)
    ani మా సత్సంగం లో మొన్న [April 3rd]చెప్పారు

    మీకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  2. ఎందుకో?ఏమో! శివగారు, చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదములండి.

    రిప్లయితొలగించండి
  3. ప్రాణు లన్నింట కారుణ్య భావ ముంచి
    హితము గోరుచు శివుని దర్శించుటలును
    సతత ప్రియభాషణమ్ములు జనుల తోడ
    మహిని పరమేశ్వరుని గొల్చు మార్గములివి

    రిప్లయితొలగించండి
  4. వెంకట రాజారావు గారు, చక్కటి సందేశమున్న పద్యం అందించారు. ధన్యవాదములండి.

    రిప్లయితొలగించండి