28, సెప్టెంబర్ 2015, సోమవారం

స్థూలం నుండి ప్రజ్ఞామయం వరకు - - - చక్రశుద్ధి - ఆనందసిద్ధి (చివరిభాగం)

ఇంతవరకు 'స్మరణ' యందు వివరించిన ఆరు చక్రాలను షట్చక్రములుగా పేర్కొంటారు. ఏడవది సహస్రారంగా వర్ణిస్తారు. ఇందు మొదటి ఆరింటి యందును ప్రజ్ఞ మేల్కొని పరిపూర్ణత చెంది, ఏడవది యగు సహస్రారమందు లయము చెందుటయే యోగం. ఇదియే మోక్షం. ఇదియే నిర్వాణం. ఇదియే అద్వైతస్థితి. 

ఆజ్ఞా విశుద్ధి చక్రములు సత్వగుణమునూ, అనాహతం మణిపూరక చక్రములు రజోగుణమునూ, స్వాధిష్టానం, మూలాధార చక్రములు తమోగుణమును వ్యక్తం చేయును. 
తమోగుణం దేహధాతువుల నిర్మాణమునకు, వానియందలి రసాయనిక మార్పులకు ఆధిపత్యం వహించడమే కాకుండా భౌతికదేహ నిర్మాణం కూడా దీని ప్రవృత్తియే. 
రజస్సు వలన శరీరం నందలి వివిధ అవయములు పనిచేయుచున్నవి. ఇక సత్వం వలన గ్రహణశక్తి, వివేకం, విచక్షణ, విమర్శన మున్నగు లక్షణములు మేల్కొనును. ఈ మూడును మూడు లోకములుగా అంటే,  భూలోకం (తమస్సు), భువర్లోకం (రజస్సు), సువర్లోకం (సత్వం)లుగా  మనదేహంనందునూ, సౌరమండలం నందునూ ఏర్పడుచున్నవి. 

గత టపాల్లో మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు సహస్రారచక్రం గురించి తెలుసుకుందాం. 

సహస్రారచక్రం : -              
                                                   
సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖా సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ 

ఈ కమలం వేయిదళాలతో వికసించి యుంటుంది. అధిదేవత యాకిని. అకారాది క్షకారంత వర్ణమాల యోగినీగణం చేత సేవించబడుచున్నది. ఈమెకు సర్వాన్నం ప్రీతి. 
                                           

                                       
మస్తిష్కం పైన బ్రహ్మరంధ్రం క్రిందిభాగమున విలసిల్లే ఈ చక్రం విశ్వాత్మ నివాసస్థానం. పరమాత్మ స్థానం. ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం. ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేసే చక్రం. ఆత్మశక్తి అలరారే సుందర సుదర్శన చక్రం. విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా పరిఢవిల్లే కమలం ఈ సహస్రారం. పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీక. ఆనందమయకోశంతో సంబంధం. 

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - 
షట్చక్రాలు బలహీనపడతాయి. గ్రహణశక్తి లోపిస్తుంది. భూత వర్తమానాలోనికి పయనిస్తూ అలసిపోతుంటారు. కష్టదుఃఖాలు పొందుతుంటారు. పునర్జన్మలు తప్పవు. 
ఈ చక్ర మానసిక స్వభావం - 
ఈ చక్రం జాగృతయితే సాధకుడు అమరుడౌతాడు. పరమాత్మగా వ్యక్తమౌతాడు. తనకు తాను తెలుసుకుంటాడు. ఇది ఈశ్వరీయత స్థితి. ఈశ్వరత్వం పొందుతారు. 
ఈ చక్రమును శుద్ధిచేసుకోవాలంటే - 
తలపు, మాట, చేత యోగ్యంగా వుండాలి. క్రమశిక్షణ, ఆచరణ, విశ్వాసం కలిగియుండాలి. ధ్యానం, బ్రహ్మతత్త్వజ్ఞానం, స్థితప్రజ్ఞ (గతాన్ని తలవక, భవిష్యత్తు ఊహించక, వర్తమానంలో వర్తించడం అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో జీవించడం) ప్రశాంత వాతవరణం ఏర్పరచుకోవడం చేయాలి. ఇక ఈ చక్రంనకు అధిపతి గ్రహం 'సూర్యుడు'. ఋజువర్తన, నాయకత్వలక్షణాలు, అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణీయశక్తి, సునిశితమైన చూపులు, విశాలమైన నుదురు, ఎందులోనూ ఓటమిని పొందని, మాటపడని తత్త్వం, విభిన్నమైన ఆలోచనావిధానంతో విజయమును సాధించే కార్యదక్షత సూర్యుని లక్షణాలు. సాధన ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకుంటే సహస్రారం శక్తివంతమై, తద్వారా ఈ చక్రంతో అనుసంధానింపబడియున్న షట్చక్రాలు శక్తిసామర్ధ్యాలు కలిగియుండి మనజీవితములు  ఆనంద నందనవనములు అవుతాయి. 
ప్రతీరోజూ సూర్యోదయ సమయానికి స్నానపానాదులు ముగించుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని, సూర్యోపాసన చెయ్యాలి. అంటే సూర్యకిరణాలు తాకిడిని అనుభవిస్తూ, సూర్యభగవానుని శక్తి మన సహస్రారం గుండా అన్నిచక్రాలయందు నిబిడీకృతమవుతున్నట్లు భావిస్తూ, ప్రశాంతచిత్తంతో కాసేపు ధ్యానించాలి. క్రమం తప్పని ఈ ఆచరణ వలన సూర్యభగవానుని శక్తి, గాయత్రి శక్తి మనకు లభించి తేజోమూర్తులవుతాం. 

కుండలినీశక్తి స్థూల శరీరం నుండి ప్రజ్ఞామయ శరీరం వరకు వ్యాపించియున్నది. ఈ శక్తిని చైతన్యవంతం చేయాలి. ఆయా చక్ర దేవతలను ప్రార్ధించాలి. {ప్రార్ధన అంటే దైవస్మరణ మాత్రమే కాదు, పూజగదిలో దేవుని పటాల ముందు దీపారాధన చేసి భగవంతుణ్ణి ఏదో ఒకపేరుతో నుతించడం, స్తుతించడం కాదు,  శ్లోకపూరితమైన అనుష్టానాలు కాదు. దేవుడు అంటే పటమో విగ్రహమో కాదు, దేవుడు అంటే గుడి లోనో, దివిలోనో ఉండేవాడు కాదు, పటమైనా, విగ్రహమైన, శ్లోకమైన, మంత్రమైన, నామమైన ... ఇవన్నియూ మన మనస్సును ఇహం నుండి పరం వైపు త్రిప్పడానికే అన్న నిజాన్ని అర్ధంచేసుకొని, దేహమే దేవాలయమని, అంతరాన్నే అంతర్యామి కొలువై వున్నాడని గ్రహించి అందుకు తగ్గ ప్రార్ధన చేయాలి}. ప్రకృతి సహజంగానే ప్రతీ మనిషికి కొంతశక్తి వస్తుంది. కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుకుని, వున్నశక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని పెంపొందించుకోగలగాలి. మనకేం కావాలో, మన గమ్యమేమిటో, ఏమార్గంలో పయనించాలో తెలుసుకుంటూ (శోధిస్తూ) సప్తచక్రాలను చైతన్యపూరితం చేయగలిగే సాధన చేయగలగాలి. ఈ విధమైన సాధనే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది.

ఈ విధంగా సాధన సాగిస్తున్న కొలది ...  ఆలోచనల్లో స్పష్టత, నడవడికలో సరళత, దృక్పదంలో విశాలత, అందర్నీ ప్రేమించగల సౌశీల్యత, ఆదరించగల సేవాతత్పరత, అన్ని పరిస్థితులలోనూ సంయమనం, స్థితప్రజ్ఞత అలవడతాయి. నేను అనెడి అహం నశిస్తుంది. 'నేను' అనెడి సంకుచిత స్వాభిమానమదృశ్యమైనచో అనంతమగు 'అహంబ్రహ్మస్మి' అనెడి ఉత్తమస్థితి తనంతటదియే సాక్షాత్కారమగును. అప్పుడు ఆనందం ఓ స్రవంతిలా ప్రవహిస్తుంది. పారమార్ధికంగా పురోగతి సాధించామన్నదానికి గుర్తు - ఆనందంగా ఉండటమే. సహజత్వానికి దగ్గరగా ఉండటమే. 
ఈవిధంగా సరైనరీతిలో సప్తచక్రాలను సాధన చేస్తే, సంసారం నందు తిరిగి జన్మింపరు. మూడులోకములయందు సయితం బద్ధులు కారు.  

మనలో వున్న సప్తచక్రాలను చైతన్యవంతం చేసే సాధనతో  స్థూలంనుండి  ప్రజ్ఞామయం వరకు పయనించి 'అహం బ్రహ్మస్మి' అన్న స్థితిని పొందడమే జీవన పరమావధి. 
29 కామెంట్‌లు:


 1. భారతిగారు మీరు మీ పోస్ట్ లను వీడియోలుగా రూపొందిస్తున్నారా? మీరు రాసిన సప్తచక్రాల వీడియోలను చూసానండి. ఇవి మీరే చేస్తున్నారా? మీ అనుమతితో వేరెవ్వరైన చేస్తున్నారా? ఎందుకో చిన్న అనుమానం. మీ అనుమతి లేకుండా ఈ వీడియోలు రూపొందించారని. ఎందుకంటే మీ ప్రమేయముంటే వీటిని మీ బ్లాగ్ ద్వారా తెలియజేస్తారు కదా. మీ పరిశీలనకై ఆ లింక్స్
  ఇస్తున్నాను, చూడండి ఓసారి. నా అనుమానం అసత్యమైతే ఈ వ్యాఖ్య ప్రచురించకండి.

  1&2
  https://youtu.be/Yow-obXvkJc
  3
  https://youtu.be/iUHlDJQVrug
  4.
  https://youtu.be/NpDu7wHe6cU
  5
  https://youtu.be/3plHEQqHWRE
  6
  https://youtu.be/xhXLb3rumO0

  రిప్లయితొలగించండి


 2. పద్మగారు ఈ విషయమును నా దృష్టికి తీసుకొచ్చినందుకు మనసార ధన్యవాదములు.
  అలానే ఈ విషయం తెలిసిన వెంటనే ఖండించిన ప్రముఖ బ్లాగర్, నా ప్రియనెచ్చలి వనజ తాతినేని గారికి హృదయపూర్వక ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 3. చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయిందని సామెత. చర్య తీసుకోండి, ఇటువంటివారు పెరుగుతున్నారు,గమనించండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నమస్కారమండి. బాగున్నారా?
   వారిని నా స్ర్కిప్ట్ ఆధారంగా తయారుచేసిన విడీయోస్ తొలగించమని చెప్పానండి. తొలగిస్తారో లేదో చూడాలి. ఇది వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను. నైతిక విలువలు లేనివారికి ఏం చెప్పగలం?

   తొలగించండి
 4. భారతి..స్మరణ అన్న వివరాలతో బ్లాగు అంటె..ఇది ఇంతటి మోక్షదాయకమైనబ్లాగు అని ఊహించలేకపోయాను.
  హఠయోగులమార్గంగాక ..జ్ఞానసాధనచే సహస్రారం వరకూచేరగలగటం అనేది ..అత్యంతకష్టతరమే..ఆజ్ఞాచక్రం ఉత్తేజితం కావటంతో..సిద్ధులుపొంగిరాటంచేత..బాబాలుగా..ప్రశంసలు మొదలై ఈశత్వ మందినట్లుభ్రమించటం జరుగుతుంది.
  ఇంకేముంది పునరపి జననం పునరపి మరణం

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గాదిరాజు మధుసూదనరాజుగారు నమస్తే. మీరన్నట్లు సిద్ధులుతోనే ఆగిపోతే జనన మరణాలు తప్పవు.
   ధన్యవాదములండి.

   తొలగించండి
 5. భారతిగారు తొలగించారు విడీయోస్ను కాదు, మీ వ్యాఖ్యలను.
  ముందస్తు అనుమతి లేకుండా, ఆపై మీ వ్యాఖ్యలను తొలగిస్తూ నైతిక విలువలకు తిలోదకాలిచ్చే మహీధర్ ధార్మిక ప్రచారుకులా? సిగ్గు సిగ్గు.
  ఆధ్యాత్మికతపై మక్కువతో అందరి బ్లాగులు, యూ ట్యూబ్ చానల్స్ చూస్తుంటాను తరచుగా. వ్యక్తిగత పరిచయం లేకున్నా మా ఊరివారన్న అభిమానంతో మీకు నా స్పందన తెలుపుతుంటాను.
  ఒక్కమాట చెప్పనా...ఇటువంటి తప్పులు జరగడానికి కారణం మీ బ్లాగర్స్ ఉదాసీనతే. చిన్న చిన్న తప్పులను పట్టుకొని మీలో మీరే పొట్లాడుకుంటారు గానీ, ఇటువంటి పెద్ద పెద్ద తప్పులను పట్టించుకోరు ప్రశ్నించరు. వనజగారు, శర్మగారు తప్ప ఎవ్వరూ ఖండించరు. మీలో మీకు ఐక్యమత్యముండదు. మంచిని ప్రోత్సాహించరు, చెడును ఖండించరు. మీరంతా ఉత్తమోత్తమ ఉదాసీనులు. దీనికి మీరంతా మంచితనమని పేరు పెట్టుకుంటారు కాబోలు. నా మాటలు ఎవరిని నొప్పించిన మన్నించాలి. నిజాన్ని చెప్పాలనిపించి చెప్తున్నాను. మీరంతా ఇలా ఉండబట్టే అలాంటి తస్కరులు తయారౌతున్నారు. మీలో సంఘటితశక్తి రానంతవరకు అలాంటివారు ఉండనే ఉంటారు. తప్పు మీదే మీదే మీదే ....

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగా చెప్పావు తల్లీ, నమస్కారం..
   ఇది నాకు తోచిన మాట
   http://kasthephali.blogspot.com/2020/02/blog-post_23.html

   తొలగించండి


 6. స్క్రిప్టు కర్టెసీ అని భారతి గారి పేరెట్టేరు :) రాయల్టీ ఏమన్నా ఇస్తారా గూగుల్ యాడ్ డబ్బులొస్తే గిస్తే :)  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారు నమస్తే!
   బాగున్నారా?
   డబ్బులొస్తే గిస్తే...
   ఆధ్యాత్మిక సంపదే తప్ప ఇటువంటి సంపాదనపై ఆసక్తి అవగాహన లేదండి:)

   తొలగించండి
  2. అదెంతకాలం లెండి,మూణ్ణాళ్ళ ముచ్చట

   తొలగించండి
  3. తల్లీ భారతి,
   పరభాగ్యోప జీవుల సంఖ్య పెరుగుతోందమ్మా! అదే ఇబ్బందికరం. చేయగలది కనపడటం లేదు,విచారించటం తప్ప.

   మనం తెలుగువాళ్ళం. విశ్వామిత్ర శపిత సంతతి వాళ్ళం, దుర్యోధన చక్రవర్తికి అనుగు చెలికాళ్ళం. ఆరంభ శూరులం, ఆవేశ పరులం. ఇదీ మన డి.ఎన్.ఎ.

   ఇక ఐకమత్యమా? అదో ఎండమావి. మన నిండా ఉన్నది అసూయ,ఈర్ష్య,ద్వేషం. పక్క వాడు పచ్చగా ఉంటే చూసి ఓర్చలేనితనం మెండుగా ఉన్నవాళ్ళం.

   ఇక బ్లాగరం అంటే మిగతావారికంటే మేధావులమని గొప్ప.వద్దు ఇంక చెప్పమనద్దు.ఇందులో ఉన్నంత బురద ఉంది, మొత్తం బురదేననను.ఐకమత్యం సుదూర స్వప్నం..నిరాశావాదిని కాదు, ఆశావాదినే... కాని ఐకమత్యం చూస్తానన్న నమ్మకం మాత్రం లేదు..

   కాని

   ఇటువంటి చిన్నారుల ఆవేశం చూసినపుడు మాత్రం కొద్దిగా ఆశ పొటమరిస్తూ ఉంటుంది, అంతే
   నమస్కారం.

   తొలగించండి
  4. గ్రంధ చౌర్యం, భావ చౌర్యం ఎవరు చేసినా నిందార్హం, గర్హనీయం.
   అటువంటివి బయటపెట్టాల్సిన ‘సమయం ఆసన్నమైంది’. సమయమూ ‘సన్నమైంది’.
   ఈ పదాల విరుపు, మెరుపు ‘బోల్డన్ని కబుర్లు’ బ్లాగులో 19/02/2020 రోజున మెరిసాయి.
   మరి అదెలాగో గానీ ‘కష్టేఫలి’ బ్లాగులో కూడా 24/02/2020 న మెరిసాయి. ఎలాగంటారు?

   తొలగించండి
  5. ఎవరు పరభాగ్యోపజీవో తెలుస్తూనే ఉంది.

   తొలగించండి
  6. అజ్ఞాత గారు మీ వ్యాఖ్య ఇప్పుడే చూసాను. మీరు చెప్పిన "బోల్డన్ని కబుర్లు" బ్లాగ్ లో ఇప్పుడే ఆ టపా చూసాను. ఇద్దరి బ్లాగ్ లలో ఒకేలా రెండు వాక్యాలుండడం యాదృచ్చికంగా జరిగివుండవచ్చు.
   కష్టేఫలి బ్లాగ్ ఎన్నెన్నో మంచి టపాల భాండాగారమన్నది అందరికీ విధితమే. వారి బ్లాగ్ లో తెలుగు భాషకు, పద విన్యాసాలకు కొదవలేదు.
   మీ నిందాపూర్వక సందేహం మీ ఊహాజనితం. నిజాన్ని నిర్ధారించుకోక ఇటువంటి వ్యాఖ్యలు పెట్టడం సబబుకాదు.
   అజ్ఞాత గారు,
   పెద్దలు చెప్పిన ఒక కధ గుర్తుకొస్తుంది.
   ఆ కధ లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
   https://youtu.be/gPahbd8S6Ls
   సూదిబెజ్జాం నుండి ఏనుగు దూరిపోతుంది, తోక మాత్రం ఇరుక్కుపొయింది... ఇది కలియుగం ఆరంభంకు ముందు కధ. కలియుగం ప్రారంభమై ఇప్పుడు పూర్తి కలిలో
   ఉన్నాం. చౌర్యం జరగకపోయిన అనుమానంతోనే నిందించేస్తాం. నిజం చెప్పులేసుకునే లోగా అబద్దం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. ఇదే మాయ.
   నిజంగా జరిగిన పెద్ద తప్పులను నిలదీయరు. కాకతాళీయంగా చోటు చేసుకున్న రెండు చిన్ని చిన్ని వాక్యలకు ఇంత రభసా?

   యధాతధంగా టపాలు అనుమతి లేకుండా సంగ్రహిస్తే తప్పు గానీ, ఇలా మాటలు ఒకటి రెండు దొర్లితే అది చౌర్యమా?

   తొలగించండి
  7. బాగా చెప్పారు భారతి గారూ.

   మీరన్నట్లు కాకతాళీయంగా ఒకటే రకపు పదగుంఫనం వాడడం జరిగింది. లేకపోతే శర్మ గారికేమన్నా తెలుగు భాషాజ్ఞానం తక్కువయిందా? బ్లాగులోకంలో శర్మ గారెంత లబ్ధప్రతిష్ఠులో అందరికీ తెలుసు.అదీగాక అ పదవిన్యాసం ఎప్పటి నుండో ఉన్నదే, ఇవాళ కొత్తగా కనిపెట్టినదేమీ కాదే. దాని మీద ఎవరికీ కాపీరైటు హక్కూ ఉన్నట్లు కాదు. అయినా నాలుగైదు ఒకే రకపు పదాలు వాడినంత మాత్రాన గ్రంథచౌర్యం / భావచౌర్యం అనడం విడ్డూరంగా ఉంది. అదే గనక అయితే లోకంలో పదాలు వాడడానికే భయపడాల్సి వస్తుందేమో? కాబట్టి ఆ Anonymous గారి ఆ వ్యాఖ్య ముమ్మాటికీ అసంబద్ధమే అనీ, ఆంగ్లంలో చెప్పినట్లు Much Ado About Nothing అనీ నా అభిప్రాయం కూడా (ఈ ఆంగ్ల పదాలు Shakespeare గారు అన్నారు ..... లోకంలో బాగా వాడుకలో నున్న పదప్రయోగమే. దీన్ని ఇక్కడ వాడి నేను చౌర్యం చేశాను అని నన్ను తప్పు పట్టరు కదా కొంపతీసి?? 😳) .

   ఇటువంటి అసమంజస విమర్శల ఫలితంగా రచనలు చేసేవారు విసిగిపోయి విరమించుకునే ఆలోచన చేసినా ఏమీ ఆశ్చర్యపడనక్కరలేదేమో?

   తొలగించండి
  8. చక్కగా చెప్పారు విన్నకోట నరసింహా రావుగారు. లలితగారి టపాకు, శర్మగారి టపాకు ఏమైన సారూప్యత ఉందా? రెండు మాటలు కలిసాయని ఇంత విమర్శా? అర్ధముందా ఈ విమర్శకు?

   తొలగించండి
 7. ఆది నుండి భారతీమాత వారు..స్మరణ పేర పెట్టిన ..ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలను చదివాను.
  మీ వివరణలు జగద్గురు మళయాళ స్వామి వారి
  "శుష్కవేదాంత తమోభాస్కరము" వలె సత్యాన్ని బోధిస్తున్నాయి

  నేడు ప్రవచనకారులుగా..ఆధ్యాత్మికవేత్తలుగా అవతారాలెత్తీన కుహనాపండితులు కొందరున్నారు. యూట్యూబు లలో ప్రవచిస్తున్న స్వార్జనాపరులైన కలిపండితులు ..
  ..సంపాదనలే లక్ష్యంగా
  సంచలనాత్మకమైన వీడియోలతో.. సాధారణంగా సంశయచలితాత్ములైన జిజ్ఞాసులను మరింత
  అయోమయంలో పడవేస్తున్నారు..
  మీ ప్రయత్నం చూస్తే ..జగద్గురువులే మీమ్మల్ని నియమించారనీ మనసునకు అనిపిస్తోంది
  .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గాదిరాజు మధుసూదనరాజుగారు నమస్తే. స్మరణ లో టపాలు చదివినందుకు మనసార ధన్యవాదములు. మలయాళ స్వామివారు, శ్రీ రమణులు, రామకృష్ణ పరమహంస వారు,పరమహంస యోగనందగారు వివేకనందుల వారు జిడ్డు కృష్ణమూర్తిగారు...ఇలా ఎందరో మహాత్ముల ప్రభావమే నా ఆధ్యాత్మిక జీవనం. 'నా జీవనగమనం లో' అన్న టపాలో ఈ విషయమే తెలిపాను.


   జగద్గురువులు తెలిపిన ఆధ్యాత్మికం అనంతం. నాకు తెలిసింది అణుమాత్రమే. నేను అతి సామాన్యురాలినండి.

   తొలగించండి
 8. అజ్ఞాత పేరిట నిన్న ఒకరు వ్యాఖ్య పెట్టారు. పొరపాటున ఆ వ్యాఖ్య డిలేట్ అయింది. వారు వారి పేరుతో ఆ వ్యాఖ్య పెడితే ప్రచురించగలను.

  రిప్లయితొలగించండి
 9. భారతివారూ నమస్సులు.
  ఆధ్యాత్మిక పరిపక్వత చే మనసావాచామీరు యోగులే..అనిపిస్తోంది.

  మీ టపాలు కేవలం సేకరణలు కావని..ఏదో యథాతథంగా
  చేసిన ప్రచురణలు కావు అనీ అవి మీ ఆత్మప్రకాశకాలుగానే
  స్ఫురించాయి.చదువుతున్నకొద్దీ..

  రిప్లయితొలగించండి
 10. సమయమా...గట్రా కాపీ (అట)...

  మరి శర్మ ఎందుకీ కామెంట్స్ను ఖండించిలేదు?

  రిప్లయితొలగించండి
 11. జీవితంలో పరిణితి సాధించినవారు,
  అనవసర విమర్శలు చేసినవారి వైఖరి ఇంతేనని, వారితో వాదనలు ఎందుకని సమాధానమివ్వక స్థిమితంగా సాగిపోతుంటారు. అది గ్రహించండి అజ్ఞాత గారు.

  ఇటుపై ఇటువంటి వాఖ్యలు ప్రచురించను.
  ఇది పూర్తిగా ఆధ్యాత్మిక బ్లాగ్.
  దీనిని సహృదయతతో అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 12. జిలేబీ, శర్మ, మీరు , ఆ మాటకొస్తే ప్రతి ఒక్కరూ అక్కడా ఇక్కడా సేకరించినవే గా వ్రాస్తున్నారు.

  ఈ ఫ్రీ మేక్ రచనలకు ప్రాపర్టీ రైట్స్ అవసరమా.  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవునండీ...ఆధ్యాత్మిక అంశాలన్నింటికి శాస్త్రాలే ఆధారం. జ్ఞానం ఏ ఒక్కరి సొంతం కాదు. జ్ఞానం కాలానుగుణంగా తరతరాలుగా యుగయుగాలుగా ప్రవహించాల్సిందే.
   అన్నింటికి మూలం శాస్త్రాలే. అందరం అందులో నుండే విషయాన్ని గ్రహిస్తారు.
   కానీ; అజ్ఞాత గారు!
   ఉదాహరణకు రామాయణాన్ని తీసుకొండి.
   ఆదికవి వాల్మీకి రామాయణ కావ్యాన్ని వ్రాసేక,
   భాస్కర రామాయణము, మొల్ల రామాయణము, విశ్వనాధ వారి శ్రీ మద్రామాయణ కల్పవృక్షం, వాసుదాసుగారి ఆంధ్ర వాల్మీకి రామాయణం, గోపినాధ రామాయణం, తులసీ రామాయణం, ఉషశ్రీ రామాయణం...ఇలా ఎంతో మంది ఈ కావ్యాన్ని రాసేరు. ఆ కావ్యం మీద ఎవరి ముద్ర వారికుంది. మూలం ఒకటే అయినా చెప్పే విధానంలో ఎవరి ముద్ర వారికుంటుంది. అందుకే వారు రాసింది వారి పేరిటే నిలిచాయన్నది జగద్విదితం. మూలం ఉన్నప్పటికి ఇలా వారి శైలిలో వారు రాసింది వారిది కాకుండా పోతుందా? అలానే అనంతునిపై అనురక్తితో, ఆధ్యాత్మిక జిజ్ఞాసతో, ఆధ్యాత్మిక గ్రంధాల నుండి అధ్యాయనం చేసినవి, అవగాహనతో వివిధ కోణాల్లో విశ్లేషించుకుంటూ వ్రాసుకున్న వాటిపై మా ముద్ర మాకుండదా? ఇలా వ్రాసుకున్నవి మావి కాకుండా పోతాయా? ఇలా మాదైన ముద్ర ఉన్న స్ర్కిప్ట్ లను మాకు తెలియకుండా తీసుకొని ప్రచురించుకొని కీర్తీ కనకాలను సంపాదించడం సరైన పనా? ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు న్యాయాన్యాయలు ఆలోచించరా?

   తొలగించండి

 13. విన్నపం -
  జిలేబి గార్ని ఉద్దేశిస్తూ అజ్ఞాత పేరిట ఎవరో ఒక వ్యాఖ్య పెట్టారు. ఇలా వ్యక్తులను ఉద్దేశిస్తూ పెట్టిన అనుచిత వ్యాఖ్యలను ప్రచురించను. స్మరణ ఇటువంటి వ్యాఖ్యలకు వేదిక కాదు, కాలేదు. అందుకే అనుచిత వ్యాఖ్యలు పెట్టవద్దని విన్నవించుకుంటున్నాను.


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సంస్కారం లేని అనామకుల వ్యాఖ్యలకు స్పందించకండి భారతిగారు.

   తొలగించండి
 14. ఇంతకీ పై అజ్ఞాత ఎక్కువగా బాధపడిపోతున్నారే! "ఆయన కాపీ చేసినా ఏమీ అనలేదేం" అని వాటాలేస్తూ వాదిస్తున్నారంటే కొంపదీసి అసలు గుమ్మడికాయ దొంగ కాదుకదా?!

  రిప్లయితొలగించండి