శరీరం
లోపల అంతర్గముగా నుండు సూక్ష్మతత్త్వములతో కూడియుండిన అంతఃకరణమునే
అంతరింద్రియమని అందురు. పంచభూతముల యొక్క సూక్ష్మంశములే మనో, బుద్ధి, చిత్త,
అహంకారంలతో కూడిన అంతఃకరణం. ఈ నాలుగింటితో కూడిన అంతఃకరణమునే అంతఃకరణ
చతుష్టయం అంటారు. గాలి, అగ్ని, జలము, పృథ్వి, ఆకాశాంశలతో కూడినదే
అంతఃకరణం. అంతఃకరణముది ఆకాశతత్త్వం కాగా, మనస్సుది వాయుతత్త్వం, బుద్ధిది
అగ్ని తత్త్వం, చిత్తముది జలతత్త్వం, అహముది పృథ్వితత్త్వం.
మనస్సు :-
వాయుతత్త్వం అగుటచే నిరంతరమూ చలించుటకు కారణమగుచున్నది. ఇది చంచలమైనది.
సంకల్ప, వికల్పములు దీని కార్యములు. అనిశ్చితస్థితి. చంద్రుడు
అధిష్టానదేవత.
అహంకారం :-
పృధ్వీ అంశం. కాఠిన్యస్వభావం. నేను, నాది అను అభిమానమును కల్గించును. ఈ
తత్త్వంతో చేయు క్రియలు, వాటిచే ఏర్పడిన గర్వం దీని స్వంతం. కోపం, రోషం,
స్వార్ధం మొదలగు వాటికి ఈ అహమే కారణం. అధిష్టానదేవత రుద్రుడు.
ఈ అంతఃకరణ చతుష్టయం విజ్రుంభన ఆగి నిర్విషయస్థితి కలుగనంతవరకు అంతరశుద్ధి కలుగదు. అంతఃకరణశుద్ధి కానంతవరకు ఆత్మతత్త్వం గ్రహించలేం.
బావుందండి . అంతఃకరణ చతుష్టయం గురించి .వివరంగా తెలుసుకున్నాం . ధన్యవాదములు భారతి గారు .
రిప్లయితొలగించండివనజ గారు,
తొలగించండిచాలా కాలానికి ... బాగున్నారా?
మీ స్పందనకు మనసారా ధన్యవాదములండి.
chakkagaa cheppaaru. naa sandeham teerchinanduku chaalaa thanks andi.
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారు!
రిప్లయితొలగించండిచక్కగా చెప్పారు ...
లేదండి, నేను చెప్పలేదు.
నిగద్యతేంతఃకరణం మనోధీ
రహంకృతిశ్చిత్తమితి స్వవృత్తిభి:
మనస్తు సంకల్పవికల్పనాదిభి:
బుద్ధి: పదార్ధాధ్యావసాయధర్మతః
అత్రాభిమానాదహమిత్యహంకృతి:
స్వార్ధానుసంధానగుణేన చిత్తమ్
- శ్రీ శంకరులు (వివేక చూడామణి)
{తన వేరు వేరు వృత్తుల కారణంగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని నాలుగు విధములుగా అంతఃకరణము పిలువబడుతుంది. సంకల్పవికల్పాలతో అస్థిరంగా ఉన్నదశలో మనస్సు అనియు, పదార్ధ నిశ్చయము చేయు దశయందు బుద్ధియనియు, అహం అహం (నేను నేను) అని అహంకరించిన దశలో అహంకారమనియు, వస్తువును చింతనం చేయుదశలో చిత్తము అనియు అనబడును}
ఇలా ఎందఱో మహాత్ములు చెప్పిన విషయాన్నే నా అవగాహన మేరకు తెలిపాను, అంతే!
మీ సందేహం తీరినందుకు సంతోషం.
ఇహము నందే
రిప్లయితొలగించండిపరతత్వమును గూర్చి తెలుపునది/పొందు లాగున చేయునది ఏదియో అది శ్రేయము
అట్టి శ్రేయో దాయక అంశములను అందించేది మీకు దీపావళి శుభాకామన లతో ...
http://issuu.com/satsangamu
పై లింక్ ద్వారా కొన్ని ఆధ్యాత్మిక గ్రంథ రత్నములను పొందగలరు !!
ధన్యవాదములండి. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిచక్కటి లింక్ పంపినందుకు కృతజ్ఞతలండి.