7, సెప్టెంబర్ 2019, శనివారం

అమ్మమ్మా, రాముడొచ్చాడు చూడు...

మొన్నరాత్రినుండి, నా బంగారుతండ్రి అభినవ్ రామ్ కు జ్వరం వాంతులు. రాత్రంతా నిద్రలో ఉలికులికి పడుతున్నాడు. డాక్టరు ఇచ్చిన మందులు పడుతూ తనపై చేయివేసి రామస్మరణతో కలతనిద్రే అయింది.
ఉదయం టిఫిన్ తినిపించి మందులు ఇచ్చాక, నీరసంగా సోపాలో అలా నా ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. ఓ క్షణమైన కుదురుగా వుండక అటుఇటు పరుగులు తీసే చిట్టితండ్రి ఇలా నీరసంగా ఉండడం...చాలా బాధగా ఉంది.ఏం చేయగలను? భారమైన మనస్సుతో "రామయ్య, కరుణించవయ్యా, ఎక్కడున్నావ్, రావయ్యా" అని అనుకుంటూ ... ఓ నిముషం నాన్న, కాస్త కూర్చో...ORSL తాగడానికి తెస్తానంటూ ఫోన్ లో ఓ విడియో పెట్టి చూస్తుండమని డైనింగ్ హాల్ లోనికి వెళ్ళాను. ఇంతలో కిచెన్ నుండి చిరు మాడువాసన. స్టవ్ పై పాలు పెట్టి మర్చిపోయాను. స్టవ్ కట్టేసి ప్రిడ్జ్ దగ్గరకు వెళ్తుండగా "అమ్మమ్మా, రాముడొచ్చాడు చూడు" అంటూ అభినవ్ వచ్చాడు. ఆర్ధం కాక ఏమిటమ్మా అని అడుగుతుండగా రాముడొచ్చాడు చూడు అని ఫోన్ చూపించాడు. అప్పుడే వాట్సప్ లో వచ్చిన విడియో చూపిస్తూ, చూడు రాముడొచ్చాడు అని చెప్పగా చూసాను ఆ విడియోను. 3:24 నిముషాల్లో మొత్తం  రామాయణాన్నే దర్శించాను. అంతరమున అనిర్వచ ఆనందానుభూతి.
ఆనందంతో ఆ విడియోను స్మరణలో పదిలపర్చుకుంటున్నాను ఇలా -

9 కామెంట్‌లు:

 1. బాబుకు ఫీవర్ తగ్గిందా? ఇప్పుడిప్పుడెలా ఉన్నాడు? మంచి వీడియో షేర్ చేసారు.ధన్యవాదములు భారతిగారు.

  రిప్లయితొలగించండి
 2. అభినవ్ కు జ్వరం తగ్గిందా? రామదర్శనం మాక్కూడ చేయించారు. థాంక్స్ భారతిగారు.

  రిప్లయితొలగించండి
 3. వసుంధరగారు మరియు పద్మగారు,
  అభినవ్ కు జ్వరం తగ్గింది. బాగున్నాడు.
  మీరు అభిమానంగా కుశలమడగడం ఆనందంగా ఉంది. మీ ఇరువురుకి _/\_ ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 4. రిప్లయిలు
  1. నా పోస్ట్స్ పై వాట్సప్ ద్వారా నీ అభిప్రాయం తెలిపే నీవు, ఇలా బ్లాగ్ లో వ్యాఖ్య పెట్టడం...చిరు ఆశ్చర్యంగాను సంతోషంగాను ఉంది.
   ధన్యవాదములు రామూజీ.

   తొలగించండి
 5. మూడుముక్కల్లో చెప్పినట్టు ..మూడున్నర నిమిషాలలో ..చాలా బాగుంది. మనం ఏమి కోరుకుంటే అదే సంప్రాప్తం భారతీ గారూ .. వేయినొక్క ఏనుగుల బలం రామనామ స్మరణం. అభినవ రామ్ కి శుభాశీస్సులు.

  రిప్లయితొలగించండి
 6. ఏ నామాన్ని తలస్తే మనస్సు పులకరిస్తుందో అదే రామనామం.
  తారకమంత్రం...శక్తివంతం.
  మీ శుభాశీస్సులకు మనసార ధన్యవాదములు వనజగారు

  రిప్లయితొలగించండి