సర్వం ఆత్మగా దర్శించినప్పుడు, సర్వాన్ని ఏకత్వ భావనతో చూసినప్పుడు, శోకం మటుమాయమవుతుందని తెలిపే ఉపనిషత్ ఈశావాస్యోపనిషత్ అని,
అంతా ఏకత్వమే అని గ్రహించాక, నేను అనగా శరీర ఇంద్రియాలకు అతీతంగా ఉన్న చైతన్యం అని, ఏకాత్మ రూపమైన ఆ పరమాత్మే నువ్వేనని, ఒక్కమాటలో చెప్పాలంటే 'తత్వమసి' సారం చాందోగ్యం అని,
మనం చేయవలసిన సాధన బాహ్యంగా కాదు, సాధన అంతరంలో చేయాలని తెలిపేది, 'అహం బ్రహ్మాస్మి' అనే సిద్ధాంతం ప్రతిపాదించేది బృహదారణ్యక ఉపనిషత్ అని...
ఈ మూడు ఉపనిషత్తుల గురించి అనర్గళంగా మాట్లాడగలరు.
భగవద్గీత, కపిల గీత, ఋభు గీత... వీటిలో ఏ సందేహం అడిగినా, అడిగిందే తడవుగా, తడబడకుండా తడుముకోకుండా చెప్పగలరు.
రామాయణం, భారతం, భాగవతం, యోగ వాసిష్టం ల గురించి విపులంగా వివరించగలరు. నాకు ఏ సందేహం వచ్చిన ముందుగా కాల్ చేసేది తనకే. అలాంటి ఆమెలో ఏదో నిరాశ, బాధ, నిర్లిప్తత. ఉత్సాహమనేది కనిపించదు. కొంతకాలం తర్వాత ఒకానొక సందర్భంలో వ్యక్తమయ్యారు.
నేను ఈ సత్సంగముకు రాకముందు ధ్యాన తరగతులకు వెళ్ళేదానిని. అక్కడ ఓ అరగంట ధ్యానం గురించి చెప్పి, ఆ తర్వాత ఓ గంట నిటారుగా కూర్చొని, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయమనేవారు. ఆలోచనలు వస్తే, ఆ ఆలోచనలు వెంబడే వెళ్ళిపోకుండా, ఆ ఆలోచనలను కట్ చేసి వెనక్కి వచ్చి శ్వాస మీదే దృష్టి పెట్టండని చెప్పేవారు. ఆ తర్వాత మరో గంట ధ్యాన అనుభవాలు చెప్పమనేవారు. సప్త ఋషులు కనిపించారని, నీటి ప్రవాహం నెత్తి మీద పడి ప్రవాహంతో సాగిపోతున్నానని, గాలిలొ తేలిపోతున్నానని... ఒకటని ఏముందీ... ఎన్నో అనుభూతులు... అక్కడి సాధకులవి.
ఒకరోజు మాష్టారు గారు నన్ను అడిగారు...ఎప్పుడూ మీ అనుభూతులు చెప్పరేమని? 'కదలకుండా కూర్చోవడమే కష్టంగా ఉంది. వీపు నొప్పి వస్తుంది. ఆలోచనల వెంబడి పరుగులు తీస్తున్న మనస్సును శ్వాస మీద పెట్టడం... మరల ఆలోచనలు... వెనక్కి రావడం... ఇదో ఆటలా ఉంది తప్ప, ఏ అనుభూతి లేద'ని చెప్పేను. దాంతో అందరూ నన్ను ఏదోలా చూసారు. మీరు ధ్యానంకు పనికిరారు. నిటారుగా కూర్చోలేరు. మీకు గూని ఉంది. ధ్యానం ద్వారానే ముక్తి వస్తుంది. ఈ జన్మలో మీకు ముక్తి రాదు. మరు జన్మలోనైనా ఈ వైకల్యం లేకుండా పుట్టించమని దైవాన్ని వేడుకోండి. రేపటి నుండి క్లాస్ కు రాకండి అని చెప్పేసారు. నాకు ముక్తి రాదు, ధ్యానం కుదరడం లేదు. నా గూనే నాకు అవరోధం. నా వైకల్యమే నాకు శాపం...అంటూ ఏడ్వడం ప్రారంభించారు.
ఆశ్చర్యం....ఒక ప్రతికూల భావం అన్నీ తెలిసిన ఆమెను మాయలా కమ్మేసింది కదా.
ఏదైనా చదివిన, విన్నా... దానిని ఒక విజ్ఞానంగా మెదడులో నిక్షిప్తం చేసుకుని అక్కడే ఆగిపోతే, అది ఓ జ్ఞాపకంలా మాత్రమే నిలిచిపోతే...మాటలు నేర్చిన చిలుకలా పలకడానికే ఆ విజ్ఞానం పనికి వస్తుందని జిడ్డు కృష్ణమూర్తి గారి మాటలు ఉదహరిస్తూ ఒకరు చెప్పిన చిలుక కథ చెప్పనా -
ఒకానొక చెట్టు కొమ్మ మీద ఒక చిలుక తన పిల్లలతో వుండేది. అది తన పిల్లలు పెద్దవవుతుండడంతో బయటకువెళ్లి ఏదైనా అపాయంలో పడతాయేమోననీ, భయపడి, ఒకరోజు రెపరెపా రెక్కలు కొట్టుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్నిచూసి, పిల్లల్లారా! రండి, మీకొక సత్యాన్ని పాటగా నేర్పిస్తాను అంది సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన పిల్లలకు...
వేటగాడొస్తున్నాడు జాగ్రత్త.
గింజలు ఎరగా విసురుతాడు జాగ్రత్త.
వలవేస్తాడు జాగ్రత్త.
పట్టుకుంటాడు జాగ్రత్త.
మెడ విరిచేస్తాడు జాగ్రత్త.
అనే పాటనేర్పింది. అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చేసుకున్న ఆ పిల్లలు రమ్యంగా పాడటం మొదలుపెట్టాయి. హమ్మయ్యా! వేటగాడొచ్చినా నా పిల్లలకి ఇంకేం పరవాలేదు, అనుకొని వేటకొరకు అడవులలోకి తుర్రున వెళ్ళిపోయింది ఒకనాడు ఆ తల్లి చిలుక. ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే చిలుక పిల్లలు, వేటగాడొస్తున్నాడు జాగ్రత్త... అని పాడసాగాయి. అది విన్న వేటగాడు హడలిపోయి చెట్టు చాటున నక్కి, పోనీ గింజలు విసిరి చూద్దామనుకొని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త... అని పాడసాగాయి. ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏంచెయ్యాలో అర్ధంకాక వలవేసాడు. ఈలోగా వలవేస్తాడు జాగ్రత్త... అని పాడుతూ ఆ చిలుకలు అతడు విసిరిన వలపై వ్రాలాయి. పాడుకుంటూ గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కక్కటిగా పట్టుకొని మెడ విరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ చిలుకలు మెడ విరు...స్తా......డు ........ అంటూనే చచ్చిపోయాయి.
చూసారా... ఆ చిలుకలు పాట అయితే నేర్చుకున్నాయి గాని, దానిలోని అర్ధాన్ని అవగాహన చేసుకోలేదు, ఆచరణలో పెట్టలేదు.
మనమందరము కూడా, అలానే వున్నాము. తెలుసుకున్న సత్యాన్ని జీవితంలో ప్రవేశపెట్టడమే ఆచరణ. తెలుసుకున్న సత్యాలను ఆచరణలో పెట్టకపోతే, తెలుసుకొని ప్రయోజనం ఏముంది? ఆచరణలో పెట్టలేనివి ఎన్ని వల్లించినా వృథాయే కదా!
ఇక ధ్యానమంటారా... కొందరు నిటారుగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడతారు. కొందరు పద్మాసనం వేసుకొని చేస్తారు. సుఖాసనం అని పంతజలి చెప్పారు. ఆటంకం కలిగించని, ఎవరి సౌలభ్యం కొద్దీ వారు కూర్చోవచ్చు. ఒత్తిడికి గురైన భంగిమలో ధ్యానం చేయడం వల్ల శరీరం యొక్క అసౌకర్యంపై మనస్సు నిలిచిపోతుంది. ఏకాగ్రత కుదరదు. కూర్చోవడం ధ్యాన ముద్ర. శ్వాస మీద ధ్యాస పెట్టడం ధ్యాన నిష్ఠ. ఇవి ధ్యాన ప్రక్రియలు. అయితే ఒక గంట కళ్ళు మూసుకొని కూర్చొని, రోజంతా మనకు నచ్చేలా ఉండడం ధ్యానం కాదు.

నిరంతరం ఎరుక లో ఉండడం ధ్యానం. చేస్తున్న ప్రతీ పనినీ ఎరుకతో చేయడం ధ్యానం. ధ్యానం యొక్క అంతిమ గమ్యం సాక్షితత్వమే.
గూని... ఇది ఓ చిరు శారీరక లోపం మాత్రమే. ఒకటి గుర్తించండి... శారీరక వైకల్యాలు ఎప్పుడూ ప్రాపంచికంగానైనా, పారమార్ధికంగానైనా మన లక్ష్యాలకు అడ్డు కావు. ప్రాపంచిక పరంగా ఉదాహరణలు చూస్తే -
అరుదైన వ్యాధితో వచ్చిన పూర్తి పక్షవాతం చక్రాల కుర్చీలో కుదేసినా, మాట పెదవి దాటలేనంతగా వైకల్యం కుదిపేసినా, కృత్రిమ పరికరంతోనే విశ్వాంతరాలను శోధించి, కృష్ణబిలాలు, వర్క్హోల్స్, క్వాంటమ్ మెకానిక్స్, టైమ్ ట్రావెల్... అంటూ, శాస్త్ర ప్రపంచాన్ని కుదిపేసే సిద్ధాంతాన్ని వెలువరించిన మహా శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్ గురించి విన్నాం కదా.
పుట్టుకతోనే చేతులు లేని జర్సికా, కాళ్లతో విమానం నడిపిన ఏకైక పైలెట్ గా గిన్నిస్ రికార్డు సాధించారు కదా.
1981 జూన్ నెలలో తమిళనాడులోని త్రీచీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినా, కృత్రిమ కాలితో నాట్య ప్రదర్శనలు ఇచ్చి, వందలాది అవార్డులను అందుకున్న నాట్య మయూరి సుధాచంద్రన్ గురించి అందరికీ తెలుసు కదా.
వాలీబాల్, ఫుట్బాల్ క్రీడల్లో జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగిన ఉత్తరప్రదేశ్ అంబెద్కర్ నగర్ కు చెందిన అరుణిమా సిన్హా, 2011 ఏప్రిల్ లో జరిగిన ఓ ఘటన కారణంగా తన కాళ్లను కోల్పోయినా, కృత్రిమ కాళ్ళు అమర్చుకుని, ఎవరెస్టు శిఖరం ఎక్కాలని నిశ్చయించుకుని, 2013 లో పట్టుదలతో 52 రోజులపాటు ఎముకలను కొరికేసే చలిలో సైతం ప్రయాణించి, శిఖరాగ్రాన్ని చేరారు. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన వికలాంగ మహిళగా అరుణిమ చరిత్రకెక్కారు కదా.
3 సంవత్సరాల వయస్సులో అంధుడిగా మారిన లూయిస్ బ్రెయిలీ అంధులు చదవగలిగే వ్రాయగలిగే లిపిని కనుగొనలేదా?
పారమార్థిక పరంగా చూస్తే -
ఏడు గుర్రాలున్న రథంపై నిరంతరం సంచరిస్తూ, అఖిల జగాలకూ వెలుగునిచ్చే మహత్కర్యాం నిర్వర్తిస్తున్న సూర్యుని రథ సారథి ఎవరు? కాళ్ళు, తొడలు లేని సమర్ధుడైన అనూరుడు కాదా?
అంధత్వం కలిగిన భక్తిపూర్వక కీర్తనలతో సూరదాసు కృష్ణ పరమాత్మను సాక్షాత్కారింప జేసుకోలేదా?
కాళ్ళు చేతులు లేని కూర్మదాసు అనే పాండురంగ విఠల భక్తుడు పండరీపూర్ సందర్శించాలని తలచి, దృఢ చిత్తంతో నాలుగు నెలలు రోడ్డుపై పాకుకుంటూ బహుల ప్రాంతం చేరుకొని, ఇక కదలలేక విఠలునే ప్రార్ధించగా, భక్తునికై విఠలుడే కదిలి రాలేదా? భక్తుని కోరిక మేరకు అక్కడ విగ్రహంలా వెలియలేదా?
ఎనిమిది అంగ వంకరలు కలిగిన అష్టావక్రుడు బ్రహ్మర్షి కాలేదా?

ఆత్మస్థైర్యంతో అంగవైకల్యం శరీరానికే గానీ; మనసుకు కాదంటూ చాటిచెప్పిన మహర్షులు, మహా భక్తులు, మహానుభావులు ఎందరో కదా🙏
నిజం చెప్పాలంటే, ఆలోచనా వైఫల్యమే వైకల్యం. ఆచరణా వైఫల్యమే వైకల్యం.
ఆఁ అన్నట్లు అష్టావక్రుడు అంటే గుర్తుకు వస్తుంది. ఒకనాడు మా తాతయ్య గారు (నాలో ఆధ్యాత్మికత పట్ల అభిరుచి, అవగాహనలకు బీజం వేసిన గురువర్యులు) చెప్పిన విషయం -
ఒకసారి ఎందరో పండితులు, వేదాంతవేత్తలు, తత్వవేత్తలుతో జనక మహారాజు ఏర్పాటు చేసిన పండిత మహాసభకు వచ్చిన అష్టావక్రుడును చూసి సభలో వారంతా నవ్వగా, వారందర్నీ చూస్తూ, అష్టావక్రుడు కూడా బిగ్గరగా నవ్వెను. కొంతసేపటికి నవ్వులు సర్ధుమణిగాక, "మిమ్మల్ని చూసి సభలో వారంతా నవ్వినందుకు అందరి తరుపున క్షమాపణలు చెప్పుకుంటున్నాను. వారంతా ఎందుకు నవ్వారో అర్థమైంది కానీ, మీరు అంత బిగ్గరగా ఎందుకు నవ్వారో అర్థం కావడం లేదు. మీ నవ్వుకు కారణం తెలియజేయగలరా" అని వినయంగా జనక మహారాజు అడిగెను. అంతటా అష్టావక్రుడు జనకుడితో, "ఈ సమావేశం జ్ఞాన కోవిదులు, వేద పండితులు మరియు తత్వవేత్తల కోసం అని నేను అనుకున్నాను. వారిని దర్శించుకుని తరిద్దామని వచ్చాను కానీ; వీరందరూ అజ్ఞానులు. వీరికి భౌతిక దృష్టే తప్పా, ఆత్మ దృష్టి లేదు. వీరంతా శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు. ఆ శరీరం లోపల వెలుగులీనుతున్న ఆత్మను దర్శించలేకపోతున్నారు. ఆలయం వంకరలు తిరిగినంత మాత్రాన అందులోని ప్రతిమ వంకర తిరిగి ఉంటుందా? వీరంతా దేహాత్మ భావనలోనే ఉన్నారు. బాహ్యదృష్టే తప్ప అంతర దృష్టి అలవడలేదు. వారికి పైకి కనిపించే చర్మమే తప్ప, దాని వెనక ఉన్న తేజోమయమైన ఆత్మతత్వం అవగతం కాలేదని అర్థమైంది. పుస్తక పాండిత్యమే తప్ప, అనుభవ జ్ఞానం లేని అజ్ఞానులను చూసి అందుకే నవ్వెన"నెను.
కాళ్ళు చేతులు లేని కూర్మదాసు అనే పాండురంగ విఠల భక్తుడు పండరీపూర్ సందర్శించాలని తలచి, దృఢ చిత్తంతో నాలుగు నెలలు రోడ్డుపై పాకుకుంటూ బహుల ప్రాంతం చేరుకొని, ఇక కదలలేక విఠలునే ప్రార్ధించగా, భక్తునికై విఠలుడే కదిలి రాలేదా? భక్తుని కోరిక మేరకు అక్కడ విగ్రహంలా వెలియలేదా?
ఎనిమిది అంగ వంకరలు కలిగిన అష్టావక్రుడు బ్రహ్మర్షి కాలేదా?

ఆత్మస్థైర్యంతో అంగవైకల్యం శరీరానికే గానీ; మనసుకు కాదంటూ చాటిచెప్పిన మహర్షులు, మహా భక్తులు, మహానుభావులు ఎందరో కదా🙏
నిజం చెప్పాలంటే, ఆలోచనా వైఫల్యమే వైకల్యం. ఆచరణా వైఫల్యమే వైకల్యం.
ఆఁ అన్నట్లు అష్టావక్రుడు అంటే గుర్తుకు వస్తుంది. ఒకనాడు మా తాతయ్య గారు (నాలో ఆధ్యాత్మికత పట్ల అభిరుచి, అవగాహనలకు బీజం వేసిన గురువర్యులు) చెప్పిన విషయం -
ఒకసారి ఎందరో పండితులు, వేదాంతవేత్తలు, తత్వవేత్తలుతో జనక మహారాజు ఏర్పాటు చేసిన పండిత మహాసభకు వచ్చిన అష్టావక్రుడును చూసి సభలో వారంతా నవ్వగా, వారందర్నీ చూస్తూ, అష్టావక్రుడు కూడా బిగ్గరగా నవ్వెను. కొంతసేపటికి నవ్వులు సర్ధుమణిగాక, "మిమ్మల్ని చూసి సభలో వారంతా నవ్వినందుకు అందరి తరుపున క్షమాపణలు చెప్పుకుంటున్నాను. వారంతా ఎందుకు నవ్వారో అర్థమైంది కానీ, మీరు అంత బిగ్గరగా ఎందుకు నవ్వారో అర్థం కావడం లేదు. మీ నవ్వుకు కారణం తెలియజేయగలరా" అని వినయంగా జనక మహారాజు అడిగెను. అంతటా అష్టావక్రుడు జనకుడితో, "ఈ సమావేశం జ్ఞాన కోవిదులు, వేద పండితులు మరియు తత్వవేత్తల కోసం అని నేను అనుకున్నాను. వారిని దర్శించుకుని తరిద్దామని వచ్చాను కానీ; వీరందరూ అజ్ఞానులు. వీరికి భౌతిక దృష్టే తప్పా, ఆత్మ దృష్టి లేదు. వీరంతా శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు. ఆ శరీరం లోపల వెలుగులీనుతున్న ఆత్మను దర్శించలేకపోతున్నారు. ఆలయం వంకరలు తిరిగినంత మాత్రాన అందులోని ప్రతిమ వంకర తిరిగి ఉంటుందా? వీరంతా దేహాత్మ భావనలోనే ఉన్నారు. బాహ్యదృష్టే తప్ప అంతర దృష్టి అలవడలేదు. వారికి పైకి కనిపించే చర్మమే తప్ప, దాని వెనక ఉన్న తేజోమయమైన ఆత్మతత్వం అవగతం కాలేదని అర్థమైంది. పుస్తక పాండిత్యమే తప్ప, అనుభవ జ్ఞానం లేని అజ్ఞానులను చూసి అందుకే నవ్వెన"నెను.
ఆధ్యాత్మిక ఆకాంక్షలు, శాస్త్రపరిజ్ఞానం ఉత్తమంగా ఉంటే చాలదు. అవి ఆచరణగా రూపుదిద్దుకోవాలి. మనం తెలుసుకున్న వాటిని మన జీవితంలో ఆచరించగల్గినప్పుడే అందులో మహా సత్యాన్ని అనుభూతి చెందగలం.
ఇక ముక్తి -
అన్నింటి నుంచి విముక్తం చేసేదే ముక్తి. ఇది ఎలా లభిస్తుందనే చర్చ అనాదిగా సాగుతుంది. ఎవరి యోగ మార్గం వారిది. ఎవరి విశ్వాసం వారిది. ఎవరి వాదం వారికి వేదం. ఎవరి సాధనా విధానం వారికి సరైనది. ఇది తప్పు కాదు. ఒక గమ్యానికి వెళ్ళినప్పుడు అన్ని దిశల నుండీ ఎన్నో దారులుంటాయి. ఏ దారిలో వెళ్ళినా, గమ్యస్థానం చేరగలం. ఎన్నో వాహనాలు... ఏ వాహనం మీద వెళ్ళినా, గమ్యం చేరుకోగలము. అల్లోపతీ, ఆయుర్వేదం, హోమియోపతీ, మూలికా వైద్యం, ప్రకృతి వైద్యం, ఆక్యుపంచర్, ఫిజియోథెరఫీ... వైద్యవిధానాలు ఏవైనా, రోగికి స్వస్థత చేకూర్చేందుకే. వారి వారి శరీరతత్వం బట్టి, విశ్వాసం బట్టి వైద్య మార్గం అనుసరిస్తారు. ఒక వైద్య విధానముతో లొంగని రోగం మరొక విధానముతో తగ్గవచ్చును.
అలానే ముక్తే గమ్యమైనప్పుడు, అక్కడికి చేరడానికి ఎన్నో మార్గాలను కృష్ణ పరమాత్మ, ఋషులు తెలిపారు. కొందరు వేద మార్గంలో, కొందరు క్రియాయోగ మార్గంలో, కొందరు ధ్యాన మార్గంలో, జ్ఞాన మార్గంలో, భక్తి మార్గంలో..... ఇలా పలు మార్గాలు. ఎవరి విశ్వాసం బట్టి వారు ఆ మార్గంలో వెళ్తారు. లక్ష్యం మీద చూపించే శ్రద్ధ దాన్ని సాధించే విధానాల మీద కూడా చూపించినప్పుడే లక్ష్యసిద్ధి జరుగుతుంది.
మన విజయాన్ని అడ్డుకునేది మనలోని ప్రతికూల ఆలోచనలే. మన ప్రవర్తన మన ఆలోచన విధానాలే మనం వ్యక్తి నుండి శక్తిగా ఎదగడానికి దోహదపడుతాయి. కొన్నిసార్లు ఎక్కడా దొరకని ప్రశాంతత, మన ఆలోచనలను మార్చుకుంటే దొరుకుతుంది. అంతేగానీ, చిత్తాన్ని చంచలం చేసుకుంటే దాని ఫలితంగా లక్ష్య సాధన సిద్ధించదు. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే.
దృఢసంకల్పానికి ఏకాగ్రత, విశ్వసనీయత తోడైనప్పుడు, ఎలాంటి వారైనా తాము కోరుకున్న లక్ష్యాలు సాధిస్తారు. తన పూర్వీకులకు పుణ్యలోకాలు ప్రాప్తింప జేయాలన్న లక్ష్యం భగీరథుడిది. అకుంఠిత దీక్షతో దివి నుంచి భువికి గంగ దిగి వచ్చేలా చేశాడు.

ఎవరు ఏమైనా చేయనీ, ఎన్నైనా చెప్పనీ, మనదృష్టి మన లక్ష్యంపై మాత్రమే వుంటే, మనం మనతోనే విశ్వాసంగా వుంటే, మనం సాధించాలనుకున్నదాన్ని ఎవ్వరూ ఆపలేరు! తండ్రి ఎన్ని హింసలకు గురిచేసినా ప్రహ్లాదుడు తాను నమ్మిన భక్తిమార్గాన్ని వీడలేదు.
దారిలో నది అడొస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు - నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులోస్తే ఆపాల్సింది పని కాదు - ప్రయత్నించే పద్ధతి.
బాహ్య సంఘటనలకి ఉద్రేక పడకుండా నిలకడగా మనసును జాగ్రత్తగా ఉంచుకోవడమే సాధన. అలానే మనం చేసే సాధనలన్నీ ఆత్మను పొందటానికి కాదు, శరీరం నేను కాదు అని తెలుసుకోవటానికే.

శరీరం దైవదత్తం - మనసు మానవ కల్పితం
బుద్ధిని శుద్ధి చేసుకుంటే మోక్ష సిద్ధి తధ్యం.
- స్వామి మైత్రేయ

శరీరం దైవదత్తం - మనసు మానవ కల్పితం
బుద్ధిని శుద్ధి చేసుకుంటే మోక్ష సిద్ధి తధ్యం.
- స్వామి మైత్రేయ
తను గురించి, తనలా ఆలోచించేవారి గురించి మీరు మాట్లాడుకున్నది బాగుంది. కానీ, నాకు ధ్యానం కుదరదు, జ్ఞానం నా ఊహకు అందని పదం. కర్మ చేయడమే తప్ప, కర్మ ఫలత్యాగం అంటే అర్థం కాదు. నాకు తెలుసిందంతా ఒకటే...ఉదయం దైవ స్మరణతో లేవడం, స్నానాదికాలు అయ్యాక దైవాన్ని పూజించడం, పనులు చేసుకుంటూ, మధ్య మధ్యలో నేను నమ్మిన దైవాన్ని తలుచుకోవడం, రోజు చివరలో అంటే పడుకునేముందు, నేను ఈరోజు నా మాట చేతలతో చేసే పనులలో తప్పున్నా, ఒప్పున్నా నన్ను మన్నించు అని మనస్సులో దైవం ముందు సాగిలపడడం తప్పా, ఏ శాస్త్ర పరిజ్ఞానం లేని నాకోసం ఏం చెప్తారని అడిగిన మరొకామెకు నా సమాధానమిదే -
అద్భుత వివరణ. ఎక్సలెంట్ పోస్ట్.
రిప్లయితొలగించండికుబ్జ కూడా శ్రీకృష్ణ దర్శనంతో ధన్యురాలు అయింది. ఆమె గూని అడ్డు కాలేదు ఆమెకు. నిజానికి ఆ గూనే కృష్ణుని దరి చేర్చిందంటారు కొందరు. నిజం తెలియదు, అంతే గాక కొందరు ఈమె క్రిందటి జన్మలో శూర్పణఖ అంటారు. నిజమేనా భారతిగారు?
శ్రీ గారు,
తొలగించండికుబ్జ క్రిందటి జన్మలో శూర్పణఖ అని అక్కడక్కడ వినడమో, చడవడమో జరిగింది కానీ, ప్రామాణికంగా ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదండి.
ఇక, రామాయణంలో శూర్పణఖ ను విశ్లేషిస్తే, ఆమె మనసులో భావాలు, మాటలు, చేతలు అన్నీ వక్రంగా ఉండేవి. మనసులో భావం వేరు (తన భర్తను అన్న రావణుడు కావాలనే చంపేడని తలచి, ఆ ప్రతీకారంతో అన్నను చంపే శక్తివంతునికై ఎంతోకాలంగా ఎదురుచూస్తుండగా, ఒకసారి రాముణ్ణి చూసిందని, అతని ప్రతిభ తెలుకుని, అన్నను సంహరించే శక్తి రామునికే ఉందని భావించి, రాముడు దగ్గరకు వచ్చిందని చెప్తుంటారు కొందరు), ఆపై ఆమె మాటలు వేరు, చేతలు వేరు కాబట్టి, ఈ జన్మలో ఆ మూడు వంకరలుతో వికృతంగా పుట్టిందని, అందుకే త్రివక్ర అని పిలిచేవారని, కుబ్జం అంటే మరుగుజ్జు కాబట్టి కుబ్జ అని అనేవారని చెప్తుంటారు. ఈ జన్మలో కృష్ణుడు అనుగ్రహించి, ఆ మూడు వంకరలు తీసేసినట్లు చెప్తుంటారు.
చెప్పగా విని , ' హరి ' రాము , జేరి చూచి ,
రిప్లయితొలగించండిధనువు బాణాలు దాల్చిన ధర్మమూర్తి
మోహనతలకు ముగ్ధుడై , ముచ్చట పడి
తాను నటువలె మారి , యా దారి నడచె ,
అచ్చు గుద్దిన రూపంబు లచ్చుపడగ
మోహనాకార సంశోభ మూర్తిమత్త్వ
రాములను గాంచి , ' అనిమిష' ద్రమణు డగుట ,
దొంగ రాముడు సీతకు దొరికి పోయె .
(మునులు త్రిజగన్మోహనుడైన శ్రీరామ చంద్రుని
రూప గుణ యశో విభవాలను గూర్చి చెప్పుకొను
చుండగా శ్రీ మహా విష్ణువు విన్నాడు .
ఆ దివ్య మనోహర రూపాన్ని చూడాలనుకున్నాడు .
వెంటనే భూలోకం చేరి సీతాలక్ష్మణసమేతంగా
నడచి వెళుతున్న ఆ ధనుర్ధారిని దూరం నుంచి
చూసేడు .
దేవతలను కూడా కన్నార్పనీని ఇంత మోహనమా!
అని ఆశ్చర్యంలో మునిగేడు . అతడి తలపులో ఒక
చిలిపి ఆలోచన మెదిలింది .
అనుకున్న తడవే రామచంద్రుని రూపంలోకి మారి
ప్రక్కన నడువ సాగేడు .
సీతకు రామచంద్రుని రెండు మూర్తులు కన్పిస్తున్నవి . అచ్చుగుద్దినట్లు ఒకే పోలికతో కన్పిస్తు
న్నారు . తీక్షణంగా గమనించింది . ఒకరికి కను
రెప్పలు పడడం లేదు . దొంగరాముడు దొరికి
పోయేడు . ఆయనకు సభక్తిగా నమస్కరించింది .
శంఖ చక్ర గదా ధారియై శ్రీమహా విష్ణువు ప్రత్య
క్షమై , ఆశీర్వదించి అంతర్దాన మయ్యేడు .)
స్వస్తి
వి ఆర్ ఆర్ గారు, పార్వతి దేవి సీత రూపం దాల్చి రాముడును పరిక్షించడం వలన శివుడు పరిత్యజించాడు పార్వతిని. మరి విష్ణువు రాముడు రూపంలొ వచ్చినందుకు ఏ శిక్షా ఉండదా? చెరో న్యాయమా?
తొలగించండిశాస్త్రి
మాష్టారు గారు,
తొలగించండిఅద్భుతమైన మీ భక్తి భావనలకు శిరసాభివందనం.
రాముడు తన అంశే కదా !
రిప్లయితొలగించండిఐనా ,
శంఖ చక్ర గదా ధారియై ఉన్నప్పటి
తన రూపం కంటే ,
ధనుర్బాణాలు దాల్చిన రామచంద్రుని
తన రూపం మోహనంగా కన్నార్పనీ
య లేదు ( కన్నార్పకపోవడం దేవతల లక్షణం . ఆ లక్షణముతోనే
దొరికిపోయాడు) ఇందు పరీక్షించడం
అనే అంశమే తలెత్తదు .
రామచంద్రుని లోకోత్తర రూప లావణ్యమే ప్రతిపాదితము .
లెస్సగా చెప్పారు.
తొలగించండి" నిజానికి మహనీయుల చరిత్రలు చదవడం ఎంతో సులభము, సంతోషకరమూ అయిన సాధన.
రిప్లయితొలగించండిదీనికి యజ్ఞము, ఉపవాసము, జాగరణవంటి ప్రక్రియలతో పనిలేదు. ధనవ్యయంతో అసలే పనిలేదు.
మనం వ్యర్థంగా గడిపే సమయం కొంతైనా యిందుకు వినియోగిస్తే చాలు.
అటుపై వారిని గుర్తుంచుకొని సర్వసాక్షియైన వారి దృష్టిలో జీవిస్తున్నామని గుర్తుంచుకొని ప్రవర్తిస్తే.....
అదే అనన్య చింతన, ధ్యానము. "
- సద్గురు ఆచార్య శ్రీ భరద్వాజ మాస్టర్