23, ఫిబ్రవరి 2013, శనివారం

తనో వినయశీలి... తనే మన "రసజ్ఞ"

రసజ్ఞ...
రసజ్ఞ అందరికీ తెలిసిన ప్రముఖ బ్లాగరిణి.
వివిధ విశిష్ట అంశాలను ప్రస్తావిస్తూ, అందుకు తగ్గ విలువైన విషయాలను అనుసంధానం చేసి సమగ్ర వివరణతో సామాన్యులకు సహితం సులభగ్రాహ్యంగా అవాగాహన కల్పిస్తూ ఆసక్తిదాయకంగా రచించడంలో అందె వేసిన చెయ్యి తనది.
అయినా అందరికీ తెలిసిన తన గురించి చెప్పడం 'ముంజేతి కంకణానికి అద్దం పట్టడమే' అయినా తనలో నాకు నచ్చిన, పలువురు మెచ్చిన "వినమ్రత" గురించి ప్రస్తావించాలనిపిస్తుంది.

తనతో నాకు పరిచయమై ఒక్క ఏడాదే అయింది. అయితేనేం... జన్మ జన్మల బంధములా ఆత్మీయంగా 'ఆత్మబంధువ'యింది. "అమ్మా" అన్న ప్రేమైక పిలుపుతో 'ప్రియపుత్రిక'యింది.

రసజ్ఞ...
రసజ్ఞ అంటే - రసం జ్ఞానాతీతి రసజ్ఞ అన్నారు. 
రసం అంటే సారభూతమయినది , నవరసాలు, కళలు అని కూడా అనుకోవచ్చును. జ్ఞానాతీతి అంటే తెలిసినది అని అర్ధం
ఇక పదానికి అర్ధాన్ని వాడుక భాషలో తీసుకుంటేమనకి రసాన్నితెలియచేసేది ఏమిటిమనం తినే దాని రసం వలనే మనకి రుచి తెలుస్తుందిట
అలా తీసుకుంటే మనకి రుచిని తెలియచేసేది ఏమిటి? నాలుక కనుక మామూలు పరిభాషలో నాలుక అనే అర్ధాన్ని ప్రతిబింబిస్తున్నా - 
ఒక రసాన్ని లేదా కళలని ఆస్వాదించేది అనుభూతని మనకి ఇచ్చేది అని 'రసజ్ఞ' అనే పేరు తెలియచేస్తోంది. (ఇంకా రసజ్ఞ నామవైభవమును తెలుసుకోవాలనుకుంటే తన బ్లాగ్ లో "నా పేరు..... అన్న టపా చూడగలరు.http://navarasabharitham.blogspot.in/2011/07/blog-post.html)
నేను సామాన్యురాలిని. అందుకే రసజ్ఞ అంటే నాలుక అనే సామాన్య అర్థాన్నే తీసుకొని దాని గురించే ప్రస్తావిస్తాను -
సాధారణంగా పెద్దవారు, పరహితాన్ని కోరుతూ పరోపకారతత్త్వంతో పలువురి మన్ననలు పొందే మంచివ్యక్తిని 'అందరి తలలో నాలుక లాంటివాడ'ని అంటుంటారు. నాలుకతో సద్గుణమును ఎందుకు పోల్చుతారంటే నాలుక (రసజ్ఞ) వినయానికి చిహ్నం. 
కన్ప్యూషియన్ అనే చైనా తత్వవేత్త తన చివరిక్షణాల్లో తన శిష్యులను దగ్గరకు పిలిచి, 'చూడండీ, నా నోట్లో నాలుక ఉన్నదా? లేదా?' అని ప్రశ్నించగా, 'ఉన్నద'ని శిష్యులు చెప్పారు. మరి దంతాలు ఉన్నాయా? లేవా?' అని ప్రశ్నించగా, 'లేవ'ని శిష్యులు చెప్పగా, అప్పుడు ఆ తత్వవేత్త యిలా అన్నారట -  'ఈ నాలుక నేను పుట్టినప్పటి నుండి నా నోట్లో ఉంది. పుట్టిన కొంతకాలానికి దంతాలు వచ్చాయి. యవ్వనదశలో ముప్పదిరెండు దంతాలు అయినాయి. కానీ, నేడు అవన్నీ ఊడిపోగా, నాలుక మాత్రమే మిగిలియుంది. కారణం, నాలుక కోమలంగా సరళంగా కొసదేలి కఠినంగా ఉన్న దంతాల మద్య కూడా ఎంతో వినయంగా ఉండడం వలన ఇప్పటిదాకా ఉంది. చాశారా... దంతాలు గట్టిగా కొసదేలి అన్ని ఉండీ ఇప్పుడు ఒక్కటీ మిగలలేదు. నాలిక ఒక్కటే ఉన్నను వినయమనే సద్గుణము వలన చివరికంటా ఉంది. అందుకే జీవితంలో వినమ్రతగా ఉండాలి' అని ఉపదేశించారు.
పరిణిత వ్యక్తిత్వంనకు ప్రామాణికం 'వినయం. ప్రతీవ్యక్తి అలవర్చుకోవలసిన మొట్టమొదటి సద్గుణం "వినయం". నాలుక(రసజ్ఞ) వినయానికి గుర్తు. వినయానికి చిహ్నమైన 'నాలుక'నే అర్ధం వచ్చే పేరు గల 'రసజ్ఞ' సార్ధక నామదేయురాలు. శ్రీ రవిశంకర్ గారు అన్నట్లు ప్రజ్ఞ యొక్క వికసనమే 'వినయం. అది మన రసజ్ఞలో ప్రస్పుటమైంది. 

రసజ్ఞ...
రసజ్ఞ విశిష్టమైన వినయానికి ప్రతీక. ఇది తనతో పరిచయం ఉన్న అందరి అభిప్రాయం.
కేవలం పేరుకే పరిమితంకాకుండా, అనేక సద్గుణములతో కూడిన తన వ్యక్తిత్వంలో వినయమనే అమూల్యభూషణమునే ధరించి తన నామానికే వన్నె తెచ్చుకుంది. అన్నింటికీ అతీతంగా, అన్ని రంగాల్లో విజేతగా నిలిపేదే వినయం. ఆ వినయం తన సహజస్వభావమై భాసిల్లుతుంది.  
ఈ మధ్యనే తను పెట్టిన టపా 'తౌర్యత్రిక కళ ' చదివాను. పోస్ట్ పోస్ట్కు ద్విగిణీకృతమౌతున్న తన ప్రతిభ నన్నెంతో ఆశ్చర్యానందాలకు లోనుచేస్తే, ఆ విషయాన్నే ఎప్పటిలా తనకి మెయిల్ చేయగా - "నీకు నా మీద ఉన్న ప్రేమ, అభిమానంతో అలా అంటున్నావు కానీ, అమ్మా! నేనింకా చిన్నదానినే, నా రచనలు ఇప్పుడే మొగ్గ దశలో ఉన్నాయి. మీ అందరి ఆశీర్వాదాలే వాటికి నీళ్ళు. అవి త్వరలో పూలు పూయాలని కోరుకుంటున్నాను"... అన్న తన ప్రత్యుత్తరం -
ఎదిగిన కొలది ఒదిగియుండే వినయానికి చిహ్నంగా ఉంది. ఎప్పటికప్పుడు తన ప్రత్యుత్తరాలు, మాటలు నన్ను ఎంతగానో అబ్బురపరుస్తుంటాయి. తన సంస్కారం, వినమ్రతకు ఎప్పుడూ ముగ్దురాలవుతుంటాను.

విద్యాదదాతి వినయం, వినయాద్యాతి పాత్రతా ... విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల పాత్రత (యోగ్యత) కలుగుతుందన్నదానికి ఓ చక్కటి ఉదాహరణ మన వినయ సౌజన్యమూర్తి "రసజ్ఞ".

తన పోస్ట్స్ ద్వారా తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నట్లే, తన ఆత్మీయ సహచర్యం ద్వారా ఎన్నెన్నో నేర్చుకున్నాను. అందులో మచ్చుకి ముచ్చటగా ఓ మూడు -
1. చిన్ని చిన్ని తప్పిదాల్ని భరించలేనప్పుడు జీవితంలో పెద్ద విజయాల్ని సాధించలేం.
2. చివరికంటూ మనవెంట వచ్చేది సంసారం కాదు, సంస్కారం.
3. మన భావాలు మరొకరికి భారం కాకూడదు, బాధని కల్గించకూడదు.
ఇలా తనగురించి ఎన్నైనా చెప్పగలను. కానీ; "అమ్మ మనస్సు" బిడ్డకి దిష్టి తగులుతుందన్న వెరపుతో నిలువరిస్తుంది.
యక్షప్రశ్నలలో ధర్మరాజు ఇలా అంటాడు - 'మానం హిత్వా ప్రియోభవతి' తన్ను తాను గొప్పగా భావించనివాడు జనులందరికీ ప్రియమైనవాడగునని. అలా ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే వినయశీలి అయిన మన రసజ్ఞ, అందరికీ ప్రియమైనది. అందరి మన్ననలు పొందుతున్న మన రసజ్ఞకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, ఎంతో ఉన్నత స్థాయిలో తనుండాలని ఆశిస్తూ... 


29 కామెంట్‌లు:

 1. తల్లీ భారతి,
  వందనం,
  దీర్ఘాఅయుష్మాన్భవ! ఇంతకుమించి చేయాలని ఉంది.ప్రస్తుతంలో అశక్తుడిని. దిష్టి తగులుతుందేమో, నాచిన్నతల్లికి దయచేసి దిష్టి తియ్యరా?

  రిప్లయితొలగించండి
 2. నిజమండి. బాగా వ్రాసినారుమీరు. సంతోషం కలిగించారు.

  రిప్లయితొలగించండి
 3. రసజ్ఞ గారి బ్లాగ్ అంటే నాకు చాలా ఇష్టం, వారి పోస్ట్స్ చాలా బాగుంటాయండీ.
  ఈ టపా, వారి గురించిన పరిచయం బాగుంది :)

  రిప్లయితొలగించండి
 4. aadhyaatmika bloglo o vyakthini sthuthinchadam?????

  రిప్లయితొలగించండి
 5. భారతి గారు ఇప్పుడే పోస్ట్ చూసాను

  "రసజ్ఞ " గురించి మీరు చెప్పినది అక్షర సత్యం భూమ్యాకాశాలు ఉన్నంత నిజం .

  ఎంత ప్రజ్ఞా పాటవాలు కల్గి ఉన్నప్పటకి కూడా ఒదిగి ఉండే అమ్మాయి తీరు అత్యద్బుతం వివేకం,వినయం ఆభరణాలుగా ఉన్న అమ్మాయి.

  కష్టే ఫలే శర్మ గారు అన్నట్లు "రసజ్ఞ : కి దిష్టి తగులుతుందేమో !

  తనని చూసినప్పుడల్లా ఇలాంటి అమ్మాయి ఉంటె బాగుండును అనుకుంటాను నా కోరిక ఏమంటే తను ఇంకా అన్నిరకాల పోస్ట్ లు వ్రాయాలి అని కోరిక. కొన్ని అంశాలకె పరిమితం కాకూడదు అని.

  మీ పోస్ట్ చాలా చాలా బాగుంది .

  రసజ్ఞ .. తల్లీ ! చిరంజీవ ! యశస్వి భవ.

  రిప్లయితొలగించండి
 6. నేను చెప్తామనుకున్నది ఫోటాన్ చెప్పేశారు :-)
  రసజ్ఞని చూస్తుంటే భలే ఆశ్చర్యం వేస్తుంది. తనకి భాష మీదున్న పట్టు , చెప్పాలనుకున్న విషయాన్ని సమగ్రం గా అర్ధం చేసుకుని చెప్పడం ఇవి నాకు చాలా ఇష్టమైన అంశాలు తనలో .
  తనకి ఒక చిన్న సూచన (తను పాజిటివ్ గా తీసుకుంటారు తలుస్తున్నాను):
  ఒక మూసలో ఇమిడి పోకుండా చూసుకోమని.
  రసజ్ఞ, బ్లాగ్ పరిధిని దాటి మంచి విషయాలు పంచుకునేట్లు గా మీ ప్రతిభకి తగిన అవకాశాలు రావాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నా !

  రిప్లయితొలగించండి
 7. రసజ్ఞాదేవిగారు,
  మిమ్మల్ని ఎవరో పొగుడుతున్నారు, చూశారా, స్మరణబ్లాగులో భారతిగారు. మిమ్మల్ని పొగిడినా మాటాడరు, తెగిడినా మాటాడారు, ద్వంద్వాతీతులా? కొద్దిగా తిట్టనయినా తిట్టండి, మీ నోటి ముత్యాలేరుకుంటాం. :)

  రిప్లయితొలగించండి
 8. సర్! (కష్టేఫలే శర్మగారు)
  నమస్కారమండి. నిజమేనండి ... దిష్టి తగులుతుందన్న వెరపు నాలోనూ ఉంది.
  మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 9. లక్ష్మీదేవి గారు!
  మీ స్పందన చాలా సంతోషాన్నిచ్చిందండి. ధన్యవాదాలండి.

  రిప్లయితొలగించండి
 10. అజ్ఞాత గారు!
  మీ స్పందనకు ధన్యవాదాలు

  రిప్లయితొలగించండి
 11. వనజ గారు!
  ఈ పోస్ట్ నచ్చినందుకు, రసజ్ఞను మెచ్చినందుకు, ముఖ్యంగా నా భావాలతో ఏకీభవించినందుకు మనసార ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 12. శ్రావ్య గారు!
  రసజ్ఞ ప్రజ్ఞాపాటవాలు చూస్తుంటే నాకు కూడా ఆశ్చర్యానందాలు కల్గుతుంటాయి.
  మీ స్పందనకు ధన్యవాదాలండి.

  రిప్లయితొలగించండి
 13. పోటాన్ గారు!
  రసజ్ఞ రచనలంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం. తన వ్యక్తిత్వం అంటే మరీ మరీ ఇష్టం.
  మీ స్పందనకు ధన్యవాదాలండి.

  రిప్లయితొలగించండి
 14. ఆధ్యాత్మిక బ్లాగ్లో ఓ వ్యక్తిని స్తుతించడమా???

  అజ్ఞాత గారు!
  ముందుగా మీ స్పందనకు నా ధన్యవాదాలు.

  ఆధ్యాత్మికం అంటే ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం.
  ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలంటే ఈశ్వరీయ లక్షణాలను అలవర్చుకోవాలి.
  ఈశ్వరీయ లక్షణాలంటే సద్గుణాలు. ఆధ్యాత్మిక గమనంలో సద్గుణాలే సోపానాలు.
  అన్ని సద్గుణాలలో ప్రధానమైనది 'వినయం'.
  ప్రాపంచికంగా అందరి మన్ననలు పొందేటట్లు, అందరికీ ప్రియమయ్యేటట్లు, చేసే ఉత్తమ సద్గుణం 'వినయం'. పారమార్ధికంగా పరమాత్ముని దరిచేర్చేదీ వినయమే.
  మానవుడు + సద్గుణాలు = మాధవుడు.
  మాధవుడు - సద్గుణాలు = మానవుడు.

  నేను ఈ టపాలో ప్రముఖంగా ప్రస్తావించింది తనలో ఉన్న వినయమనే సద్గుణాన్ని.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రసజ్ఞ లో ప్రజ్ఞాపాటవాల తో పాటు మంచి క్రియేటివిటి కూడా ఉంది. ఆమే ప్రతిభ ను చూస్తే స్వాతికిరణం లో మంజునాద్, ఆనతి నీయరా హరా పాట అయిపోతుందను కొనే సమయంలో ఆఖరున ట్విస్ట్ చేసి పాడిన సన్నివేశం గుర్తొస్తుంది.
   మనకు తెలిసిన పాత విషయం గురించి రాసింది కదా అని చదవటం మొదలుపెడితే, ఎక్కడా చదవని ఎన్నో కొత్త విషయాలు అందులో ఉంటాయి. ఆమేను పొగడటంలో తప్పేమి లేదు. వ్యక్తిలో ఉండే మంచి గుణాలను గుర్తించి ప్రోత్సహించటం కొన్నిసార్లు అవసరం కూడాను.

   తనకి ఒక చిన్న సూచన (తను పాజిటివ్ గా తీసుకుంటారు తలుస్తున్నాను)ఒక మూసలో ఇమిడి పోకుండా చూసుకోమని

   శ్రావ్య గారు రాసిన దానితో కొద్దిగా విభేదిస్తున్నాను. బ్లాగులోకంలో మహిళా బ్లాగర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాస్తూంటారు. కొత్త ఆవకాయ, మధురవాణి, మానస చామర్తి, వనజ వనమాలి,కృష్ణ ప్రియ మరియు మీరు. ఎవరి ప్రత్యేకత వారిదే. వాళ్ల టపాలు చదివితే, వాళ్ళు రాసేవి వాళ్ల లో ఉన్న రచయితను అందరికి చూపించాలనే కోరిక కన్నా (యండమూరి గారిలా కాకుండా), వాళ్ల లో ఉండే సహజమైన గుణాలకి/భావాలకి తగినట్లు రాస్తున్నారని పిస్తుంది.

   Sri

   తొలగించండి
 15. అజ్ఞాత గారు!
  మీ వ్యాఖ్య బాగుందండి.
  రసజ్ఞ!
  నాకు కూడా ముత్యాలు ఏరుకోవాలని ఉంది. :-)

  రిప్లయితొలగించండి
 16. చాలా మంచి బ్లాగ్. రెగులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు చూస్తుంటాను. నాక్కూడా ఇష్టం :-)
  మంచి పరిచయాన్ని అందించారు.

  రిప్లయితొలగించండి
 17. తృష్ణ గారు!
  మీ స్పందనకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 18. జై బోలో రసజ్ఞ గారు..
  పోస్ట్ బాగుందండీ.

  రిప్లయితొలగించండి

 19. ఎవరండీ ఈ రసజ్ఞ ? కొత్తగా రాయటం మొదలెట్టేరా ?

  జిలేబి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తెలుగు బ్లాగులో చక్కర్లు కొట్టే జిలేబి మామ్మ గారు, రసజ్ఞ ఎవరు అని అమాయకం గా
   అడుగుతారా? తమాషాలు ఆపి, ఆ అమ్మాయి రాసిన టపాల మీద అభిప్రాయం చెప్పు.
   ఇంతకి ఈ టపాని రసజ్ఞ చదివిందా లేదా?

   Sri

   తొలగించండి
 20. విషయ సేకరణ ప్రావీణ్యతలు జూడ
  బుధ జనులకు కూడ ముచ్చట యగు

  విషయ విభాజ్య వివేచనలు జూడ
  పరిణతి దెలియు ఏ పఠిత కైన

  తెలుగున ప్రాయు ఆ తీరు తెన్నులు జూడ
  భాషపై తన కున్న పట్టు తెలియు

  వివిథాంశముల యందు దవిలిన గురి జూడ
  విజ్ఞాన పరిథి సంవిథము దెలియు

  అన్నిటికి మించి పఠితల మన్ననలను
  పొంది బ్లాగ్వనమందు వెల్గొందు చున్న
  ఇట్టి శ్రీ రసజ్ఞ ను గూర్చి యిచట వ్రాయ
  మీరు ప్రతిభకు తగు పురస్కార మిడుటె .

  రిప్లయితొలగించండి
 21. కిమప్యస్తి స్వభావేన సుందరం వాప్య సుందరమ్
  యదేవ రోచతే యస్మై భవేత్ తత్స్య సుందరమ్
  అన్నట్టుగా ఈ టపా మీ మనోభావాలకీ, ఇష్టానికీ ప్రతీకగా వుంది. ఏదో నాకు తెలిసినవి, తెలుసుకున్నవి నలుగురితో బ్లాగు ద్వారా పంచుకోవడమే తప్ప నాలో అంత ప్రతిభ వుందని నేననుకోవడం లేదు. ఇంతమంది ఆత్మీయులను పొందగలిగినందుకు ఆనందంగా వున్నా నా మీద మీకున్న నమ్మకానికి కాస్త భయంగా కూడా వుంది :( మీ ఆదరాభిమానాలకు సదా కృతజ్ఞురాలిని. ఇంతకుమించి హర్షాన్ని వ్యక్తం చేయడానికి నాకు పదాలే దొరకడం లేదు.

  రిప్లయితొలగించండి
 22. @ తాతగారూ : ఆప్తుల వలన ఎన్నటికీ దిష్టి వుండదు. ధన్యవాదాలు!
  @ లక్ష్మీదేవి గారూ : మీ సమ్మతం నాకు కూడా చాలా ఆనందాన్నిచ్చింది. నెనర్లు!
  @ హర్ష గారూ : నా బ్లాగుపై మీకున్న మక్కువకి కృతజ్ఞతలు!
  @ వనజ గారూ : తప్పకుండా, త్వరలో (ఇండియా వచ్చాక) మీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తాను. మీ ప్రేమపూర్వకమైన దీవెనలు ఇలానే ఎల్లప్పుడూ వుండాలని నా ఆకాంక్ష. ధన్యవాదాలు!
  @ శ్రావ్య గారూ : మీరేమి చెప్పినా నా ఉన్నతి/మంచి కోసమే చెప్తారుగా, తప్పకుండా ఆ దిశగా కృషి చేస్తాను. నెనర్లు!
  @ అజ్ఞాత గారూ : భలేవారే, తెగిడితే మాట్లాడను కానీ పొగిడితే పొంగిపోనూ :)
  @ శ్రీ గారూ : ఇది మరీ పెద్ద పొగడ్త (స్వాతికిరణం చిత్రంలో మంజునాధ్ తో పోలికంటే మాటలా మరి!) మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!
  @ తృష్ణ గారూ : మీరు నా బ్లాగ్ చదివి మెచ్చారని తెలిసి చాలా సంతోషించాను. ధన్యవాదాలు!
  @ రాజ్ కుమార్ గారూ : ధన్యవాదాలు!
  @ జిలేబీ గారూ : అవునండీ, ఈ మధ్యనే (రెండున్నరేళ్లుగా) వ్రాస్తున్నాను.
  @ వెంకట రాజారావు. లక్కాకుల గారూ : మీ హృద్యమయిన పద్యరూప స్పందన నాకెంతో నచ్చుతుంది. మీలాంటి గురువుల ఆశీర్వాదాలు నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు!

  అమ్మా : మరొక్కసారి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!

  రిప్లయితొలగించండి
 23. "ఒక రసాన్ని లేదా కళలని ఆస్వాదించేది, ఆ అనుభూతని మనకి ఇచ్చేది అని 'రసజ్ఞ' అనే పేరు తెలియచేస్తోంది."
  ఒక్క వాక్యం లో చాలా చక్కగా చెప్పారు.

  తన బ్లాగ్ లో మొదటిసారి చిత్రకళ పై ఒక కళాకారుడి పెయింటింగ్స్ తో పరిచయం చేస్తూ తను రాసిన పోస్ట్ చదివినప్పుడు ఇలాంటి భావనే కలిగింది. తరువాత ఎన్నో పోస్ట్ లలో సంస్కృత పద్యాలు, సమగ్ర తెలుగు అర్ధ వివరణలతో తను రాసే విధానం, వివరించే తీరూ ఎన్నో సార్లు అబ్బురపరచింది. చదివిన ప్రతి పోస్టూ తెలుగు మాస్టారు పెద్ద గ్రంధం చదివి విపులంగా వివరిస్తూ చెప్పిన భావన కలిగేది.

  వినమ్రశీలీ, సార్ధక నామధేయులు, అందరికీ ప్రీతి ప్రాత్రులూ అయిన ఈ చిరంజీవికి భగవంతుడు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనీ, మరిన్ని రచనలతో అందరినీ అలరిస్తూ విరాజిల్లాలని కోరుకుంటూ...

  రిప్లయితొలగించండి
 24. naa comment enduku prachurinchadamledhu naa patla vivaksha enduku chooputunnaruu?

  రిప్లయితొలగించండి
 25. meerila chesthay aa bhagavanthudiki droham chesinatley telugu cinimallolaga nenu kooda maru veshamlo unna devudinemo tharvaatha meeru badha padakunda mundhe cheppanu

  రిప్లయితొలగించండి
 26. తనూజ్ గారు!
  నమస్తే! మీ ఈ వ్యాఖ్యల అంతరార్ధం అర్ధం కావడం లేదండి.
  ఏ కామెంట్ ప్రచురించలేదని అంటున్నారు? వ్యాఖ్యల పరిశీలన పేజీ లో మీ కామెంట్ ఏదీ లేనిదే నేనెలా ప్రచురించగలను? బహుశా మీరు వ్యాఖ్య పెడదామని మర్చిపోవడమో, లేక సాంకేతికలోపమో అయి ఉండవచ్చు. అన్యధా మరోలా భావించక మీ వ్యాఖ్యను మరలా పంపండి, తప్పకుండా ప్రచురిస్తాను.

  రిప్లయితొలగించండి